Petrol Viral Video: సోషల్ మీడియాలో ఇప్పుడు మరో విచిత్రమైన వీడియో బాగా వైరల్ అవుతోంది. ఓ మాజీ కౌన్సిలర్ ఏకంగా బుల్లెట్ ట్యాంక్ తీసుకొచ్చి..పెట్రోల్ నింపుకుంటున్నాడు. కారణాలేంటో మీరే చూడండి..


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

సోషల్ మీడియా వేదిక ట్విట్టర్‌పై ఇటీవల ఒక వీడియో వైరల్ అవుతోంది. ఇందులో ఒక మాజీ కౌన్సిలర్ పెట్రోల్ కొట్టించుకుంటూ కన్పిస్తాడు. ఈ వీడియో ఇప్పుడు వైరల్ అవుతోంది. ఇందులో విచిత్రమేముందని వైరల్ అవుతోందనుకుంటున్నారా..ఉంది విచిత్రం. అతను పెట్రోల్ కొట్టించుకుంటున్నది ఎందులోనో చూస్తే మీరే ఆశ్చర్యపోతారు. 


బుల్లెట్ పెట్రోల్ ట్యాంక్ ఓపెన్ చేసి మరో బండిపై తీసుకొచ్చి..పెట్రోల్ కొట్టించుకుంటున్నాడు. ఇప్పుడు ఆశ్చర్యపోతున్నారు కదూ..వాస్తవానికి బాటిల్‌లో పెట్రోల్ కొట్టించుకుందామనుకుని తిరిగితే..ఎక్కడా కొట్టలేదు. బాటిల్లో పెట్రోల్ కొట్టకూడదనే నిబంధనలతో బంకులు తిరస్కరించాయి. దాంతో చేసేది లేక ఏకంగా బుల్లెట్ ట్యాంక్ ఓపెన్ చేయించి తీసుకొచ్చేశాడు. ఆ వీడియో మీరు కూడా చూడండి..



ఇతని పేరు సుశీల్ కుమార్. ఓ మాజీ కౌన్సిలర్. ఇతని స్నేహితుడికి యాక్సిడెంట్ అయింది. అదే సమయంలో బైక్ పెట్రోల్ కూడా అయిపోయింది. బాటిల్‌లో కొట్టించుకుందామంటే నిబంధనల కారణంగా ఏ బంకులోనూ పెట్రోల్ కొట్టలేదు. దాంతో ఏకంగా బుల్లెట్ ట్యాంక్ ఓపెన్ చేసి తీసుకొచ్చేశాడు. అదే విషయం బంకులో అడిగినవారికి చెప్పడం ప్రారంభించాడు. ఈ వీడియో ఇప్పుడు అందర్నీ ఆకట్టుకుంటోంది. అందరూ తలోరీతిగా కామెంట్లు అందుకున్నారు. 


Also read: Robotic legs snake: పాముకి రోబోటిక్ కాళ్లు.. ఇదెక్కడి విడ్డురం.. ??



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook