Crocodile Viral Video: బర్త్ డే సందర్భంగా మొసలికి కేక్ పెడదామనుకుంది.. మూల్యం చెల్లించుకుంది!

Crocodile attacks on Woman trainer. తాజాగా ఓ మొసలికి సంబంధించిన భయానక వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది.  

Written by - P Sampath Kumar | Last Updated : Aug 17, 2022, 01:33 PM IST
  • బర్త్ డే సందర్భంగా మొసలికి కేక్ పెడదామనుకుంది
  • మూల్యం చెల్లించుకుంది
  • 12 లక్షల మందికి పైగా వీక్షించారు
Crocodile Viral Video: బర్త్ డే సందర్భంగా మొసలికి కేక్ పెడదామనుకుంది.. మూల్యం చెల్లించుకుంది!

Crocodile attacks on Woman trainer: సోషల్‌ మీడియాలో నిత్యం ఎన్నో వీడియోలు చక్కర్లు కొడుతుంటాయి. అందులో ఎక్కువగా జంతులకు సంబంధించి వీడియోలు ఉంటాయి. సింహం, చిరుత, మొసలి, ఏనుగు, కుక్క, పాములకు సంబందించినవి నెట్టింట ఎక్కువగా వైరల్ అవుతుంటాయి. వాటిలో కొన్ని ఫన్నీగా ఉంటే.. మరికొన్ని ఆశ్చర్యానికి గురిచేస్తుంటాయి. ఇంకొన్ని వీడియోలు మాత్రం భయానకరంగా ఉంటాయి. తాజాగా ఓ మొసలికి సంబంధించిన భయానక వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఆహరం పెట్టేందుకు ప్రయత్నించిన ట్రైనర్‌కు మొసలి చుక్కలు చూపించింది.

సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియోలో ఓ మహిళ ట్రైనర్ మొసలి వద్దకు వెళ్లి ప్రేమగా లాలిస్తుంటుంది. అక్కడి వచ్చిన ఓ పాప బర్త్ డే సందర్భంగా.. ట్రైనర్ మొసలికి కేక్ పెడదామనుకుంటుంది. మొసలి ఉన్న టబ్ వద్దకు వెళ్లిన మహిళా ట్రైనర్.. ఓ చేత్తో దాని దవడను పట్టుకునే ప్రయత్నం చేస్తుంది. అయితే ఆ మొసలి మూడ్ వేరేలా ఉండడంతో.. ఆ ట్రైనర్ చేతిని నోటితో పట్టుకుంటుంది. ఆపై టబ్‌లోకి గుంజి కిందపడేస్తుంది. దాని నుంచితప్పించుకోవడానికి ఆ మహిళ అది సాధ్యం కాదు

ఇంతలో మరో ట్రైనర్ నీటిలోకి దిగి మహిళను కాపాడే ప్రయత్నం చేస్తాడు. మొసలి మహిళ చేతిని గట్టిగా పట్టుకోవడంతో ఆమె నొప్పితో విలవిలలాడిపోయింది. మరొకరు వచ్చి ఆమెను నీటిలోంచి బయటకు తీసే ప్రయత్నం చేస్తాడు. చాలా సమయం తర్వాత ఆ మహిళ మొసలి బారి నుంచి బయటపడుతుంది. వైల్డ్ యానిమల్స్‌కు సంబంధించిన ఈ వీడియో 'అవుట్‌డోర్ డార్క్‌సైడ్' అనే ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో అప్‌లోడ్ చేయబడింది. ఈ వీడియోను ఇప్పటి వరకు 12 లక్షల మందికి పైగా వీక్షించారు.

Also Read: ఆ హీరోయిన్ అంటే నాకు చాలా ఇష్టం.. కత్రినా, ప్రియాంకతో ఒక్కసారైనా..: నాగ చైతన్య

Also Read: ZIM vs IND: వైరల్ వీడియో.. రిపోర్టర్ అడిగిన ప్రశ్నకు బిక్క మొహం వేసిన శిఖర్ ధావన్!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

 

Trending News