Python Monkey Viral Video, Big Python try to Swallow Monkey: కోతులు నిత్యం చిలిపి పనులు చేస్తాయని అందరికి తెలిసిందే. చిలిపి పనులు చేయడమే కాకుండా.. ఐకమత్యంగా కూడా ఉంటాయి. తమ గుంపులోని ఓ కోతిని ఇతర జంతువు లేదా మనిషి దాడి చేస్తే.. అస్సలు ఊరుకోవు. గుంపుగా వచ్చి ఎదురు దాడి చేస్తాయి. ఇక ఏదైనా కోతి ఆపదలో ఉంటే.. గుంపుగా పోరాడతాయి. ఇలాంటి వీడియోనే ఒకటి ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఓ కోతిని మింగడానికి కొండచిలువ ప్రయత్నించగా.. దాన్ని కాపాడేందుకు మిగతా కోతులు విశ్వప్రయత్నాలు చేస్తాయి. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

కొండచిలువ చాల ప్రమాదకరమైన జీవి. దానికి ఆకలి వేస్తే.. ముందర యమునా ఒక్కసారిగా చుట్టేసి మింగేస్తుంది. ఈ క్రమంలోనే ఓ కోతిని కొండచిలువ చుట్టేసి మింగడానికి ప్రయత్నించింది. ఇది చూసిన కోతుల గుంపు మొత్తం కొండచిలువ చుట్టూ చేరుతాయి. గట్టిగా అరుస్తూ కొండచిలువపై దాడి చేస్తాయి. సహచర కోతిని విడిపించడానికి విశ్వప్రయత్నం చేస్తాయి. కొండచిలువ వాటిపై దాడి చేసినా కోతులు మాత్రం వెనక్కి తగ్గవు. 


కోతుల దాడిని తట్టుకోలేని కొండచిలువ చుట్టేసిన కోతిని వదిలి పారిపోతుంది. అయితే ఆ కోతి అప్పటికే చనిపోతుంది. థాయ్‌లాండ్‌లోని ప్రచువాబ్ ఖిరీ ఖాన్ ప్రాంతంలో ఈ ఘటన జరిగినట్టు సమాచారం తెలుస్తోంది. ఇందుకు సంబందించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. కోతి కోసం మిగతా కోతులు చేసిన పోరాటంపై నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు. ఈ ఐకమత్యం మనుషుల్లో ఉండదు అంటూ కామెంట్లు చేస్తున్నారు.
  
కోతిని మింగడానికి ప్రయత్నించిన కొండచిలువ వీడియోని ఈ కింది లింకుపై క్లిక్ చేసి చూడండి:
https://www.india.com/hindi-news/viral/azgar-ka-video-bandar-ka-video-azgar-aur-bandar-ka-video-animal-video-google-trends-python-trying-to-swallowed-monkey-omg-video-went-viral-see-what-happened-next-5714760/


Also Read: ప్రియురాలిని తోటకు పిలిచి.. కోరిక తీర్చుకున్న ప్రియుడు! ఈ స్కూల్ లవర్స్ వీడియో చూస్తే నవ్వాగదు


Also Read: Ram Charan Fans: ఆర్సీ 15ని వదిలేసిన శంకర్.. టెన్షన్లో చెర్రీ ఫాన్స్!


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. 


Android Link https://bit.ly/3P3R74U


Apple Link - https://apple.co/3loQYe 


Twitter , Facebook మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి