Python in scooty: వామ్మో.. స్కూటీ ట్రంక్ లో భారీ కొండ చిలువ.. వీడియో వైరల్..
Python Scooty video: స్కూటీ నుంచి ఏదో వెరైటీగా..బుస్ బుస్ మంటూ సౌండ్ వచ్చింది. ఈ నేపథ్యంలో.. టూవీలర్ ఓనర్ డిక్కీ ఓపెన్ చేసి చూశాడు. అప్పుడు ఒక్కసారిగా దిమ్మతిరిగే ట్విస్ట్ ఎదురైంది. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
Python in scooty video: ప్రస్తుతం వానకాలం సీజన్ స్టార్ట్ అయ్యింది.ఈ క్రమంలో ముఖ్యంగా విషపు కీటకాలు, పాములు ఎక్కువగా బైటకు వస్తుంటాయి. అవి వెచ్చ దనం కోసం, ఆహరం కోసం మనుషుల ఆవాసాలకు వస్తుంటాయి. మన ఇంట్లో సజ్జల మీద, షెల్ఫ్ లలో, బట్టలలో కొన్నిసార్లు పాములు వెళ్లి దూరుతుంటాయి. బూట్లలోను కొన్నిసార్లు పాముల పిల్లలు దూరిన వీడియోలు వైరల్ గా మారిన విషయం తెలిసిందే. కొన్నిసార్లు హెల్మెట్ లలోను, బైక్ ల చక్రాలు, కారులోని డిక్కీలలో పాములు బైటపడిన వీడియోలు గతంలో అనేకం వైరల్ గా మారాయి.
అందుకే వర్షాకాలంలో చాలా జాగ్రత్తగా ఉండాలని నిపుణులు చెబుతుంటారు. ఏమాత్రం అజాగ్రత్తగా ఉన్న ప్రాణాలకు మాత్రం ముప్పు వాటిల్లినట్లే అని చెప్పవచ్చు. ఈ క్రమంలో సోషల్ మీడియాలో ఒక వీడియో ఇప్పుడు ట్రెండింగ్ లో నిలిచింది.
పూర్తి వివరాలు..
సోషల్ మీడియాలో పాములకు చెందిన వీడియోలు తరచుగా వైరల్ అవుతుంటాయి. నెటజిన్లు కూడా వీటిని చూడటానికి ఆసక్తి చూపిస్తుంటారు. కొన్ని భయానకంగా ఉంటే మరికొన్ని మాత్రం ఆశ్చర్యానికి గురిచేసేవిగా ఉంటాయి. ఇటీవల సోషల్ మీడియాలో ఒక వీడియో విపరీతంగా ట్రెండింగ్ లో నిలిచింది. ఒక టూవీలర్ తన స్కూటీ నుంచి బుస్ .. బుస్.. అంటూ శబ్దం వస్తుండటంతో ఏదో అనుమాన పడ్డాడు. వెంటనే ఒక కర్రతో స్కూటీ డిక్కీ ఓపెన్ చేయడానికి ట్రై చేశాడు.
Read more: Deputy CM Pawan kalyan: పవన్ కళ్యాణ్ ఆఫీస్ ముందు మహిళ ఆత్మహత్య యత్నం.. వీడియో వైరల్..
అప్పుడు దానిలో ఒక కొండు చిలువ చుట్టుకుని డిక్కీలో కూర్చుని ఉంది. దీంతో అతను షాక్ కు గురయ్యాడు. వెంటనే చుట్టుపక్కల వారికి సమాచారం ఇచ్చాడు. కొండ చిలువను తన స్కూటీ నుంచి కిందకు వెళ్లేలా..కర్రతో అదిలించాడు. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ ఘటన ఎక్కవ జరిగిందో మాత్రం వివరాలు లేవు.