Python Viral Video: సాధారణంగా చిన్న పాములను చూస్తేనే ఆమడ దూరం పారిపోతుంటారు కొందరు.. అలాంటిది అకస్మాత్తుగా పెద్దపాము కనిపిస్తే ఇంకేమైనా ఉందా.. గుండెల్లో రైళ్లు పరుగెత్తాల్సిందే. ఉత్తరప్రదేశ్‌లో ఇలాంటి ఘటనే ఆదివారం చోటు చేసుకుంది. ఓ స్కూలు బస్సులో మనుషులతో పాటు జంతువులను కూడా అమాంతం మింగేసే కొండచిలువ (Python) నక్కి ఉండటం స్థానికంగా కలకలం రేపింది. ఇప్పుడు ఈ వీడియో (Python Video) సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

వివరాల్లోకి వెళ్తే.. యూపీలోని రాయ్‌బరేలీలో ర్యాన్ పబ్లిక్ స్కూలుకు చెందిన ఓ బస్సులో భారీ కొండ చిలువ బస్సు కింద ఉన్న రంధ్రంలో నుంచి లోపలకు వెళ్లింది. దీంతో బస్సు సిబ్బంది ఈ సమాచారాన్ని ఫారెస్ట్ అధికారులకు అందజేశారు. వెంటనే అటవీశాఖ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని బస్సులోని పామును బయటకు తీశారు. ఈ కొండచిలువ 12 అడుగుల పొడవు, 80 కిలోల బరువు ఉంటుందని అటవీ శాఖ అధికారులు వెల్లడించారు.అయితే ఆదివారం కావడంతో స్కూలు బస్సు డ్రైవర్ తన వాహనాన్ని యథావిధిగా తన ఇంటి దగ్గర పార్క్ చేశాడు. 


ఆ సమయంలో మేక పిల్లలను తినేందుకు వచ్చిన కొండచిలువ బస్సులోకి చొరబడింది. అయితే బస్సులోకి పైతాన్ వెళ్లిన విషయాన్ని స్థానికులు గమనించి బస్సు డ్రైవర్‌ను అప్రమత్తం చేశారు. అతడు వెంటనే ఫారెస్ట్ అధికారులకు సమాచారం ఇవ్వడంతో పెద్ద ప్రమాదం తప్పింది. ఫారెస్ట్ అధికారులు అరగంట పాటు రెస్క్యూ ఆపరేషన్ (Rescue Operation) చేసి కొండచిలువను పట్టుకుని అటవీ ప్రాంతంలో వదిలిపెట్టారు. 



కాగా ఆదివారం కావడంతో స్కూల్ బస్సులో విద్యార్థులు ఎక్కలేదని.. ఒకవేళ చిన్నారులు బస్సులో ఎక్కి ఉంటే ప్రాణనష్టం జరిగేదని అధికారులు అభిప్రాయపడ్డారు. బస్సులోకి పైతాన్ వెళ్లిన విషయాన్ని గమనించి అధికారులను వెంటనే అప్రమత్తం చేసిన స్థానికులను పలువురు అభినందించారు. మొత్తానికి బస్సులో పైతాన్ నక్కిన వీడియోను చూసిన నెటిజన్‌లు భయాందోళన వ్యక్తం చేస్తున్నారు.
 Also Read: White king Cobra: 20 అడుగుల రేర్ వైట్ కింగ్ కోబ్రాని చూసారా..? చూస్తే గూస్ బంప్స్ పక్కా..


Also Read: Cow vs Man: గెలికితే ఊరుకుంటుందా.. కాలితో తన్నిన వ్యక్తిపై పగ తీర్చుకున్న ఆవు!



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


Android Link https://bit.ly/3P3R74U


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook