Dolphin Jumping over a Beautiful Rainbow, Funny Video Trending in Google: టెక్నాలజీ అభివృద్ది చెందడంతో.. సోషల్ మీడియా ప్రతి ఒక్కరికి అందుబాటులోకి వచ్చింది. ప్రపంచంలో ఏమూల ఏం జరిగినా.. సోషల్ మీడియా ద్వారా క్షణాల్లో తెలిసిపోతోంది. యువతే కాదు పెద్దవారికి కూడా ఉదయం నిద్రలేవగానే వాట్సప్, ఫేస్ బుక్, ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్‌ చూడనిదే రోజు మొదలవ్వదు. నెట్టింట చక్కర్లు కొట్టే జంతువులు, మనుషుల వీడియోస్ చూసి అందరూ తెగ ఎంజాయ్ చేస్తుంటారు. అయితే సోషల్ మీడియాలో కొన్ని వీడియోస్ ప్రతి ఒక్కరిని మంత్రముగ్దులను చేస్తాయి. తాజాగా అలాంటి వీడియోనే ఒకటి నెట్టింట చక్కర్లు కొడుతోంది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

తెలివితేటలు, ఉల్లాసభరితమైన స్వభావం మరియు మానవుల పట్ల స్నేహపూర్వకతకు డాల్ఫిన్‌లు ప్రసిద్ధి చెందాయి. డాల్ఫిన్‌లు మనుషులతో ఎంతో సరదాగా ఆడుకుంటాయి. చిన్న పిల్లలు కూడా సముద్రపు ఒడ్డున డాల్ఫిన్‌లతో ఆడుకుంటారు. ఇప్పటికే డాల్ఫిన్‌లకు సంబందించిన సరదా వీడియోస్ ఎన్నో సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. అయితే ప్రస్తుతం ట్రెండ్ అవుతున్న వీడియో మాత్రం అంతకు మించి ఉంది. 


సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియో ప్రకారం... బలమైన సముద్ర కెరటాలలో ఓ డాల్ఫిన్ సరదాగా ఆడుకుంటుంది. నీటిలో జంప్స్ చేస్తూ తెగ ఎంజాయ్ చేస్తుంటుంది. అదే సమయంలో ఆకాశంలో ఇంద్రధనస్సు ఏర్పడుతుంది. సముద్రం పైన కనిపించే ఇంద్రధనస్సుపై నుంచి డాల్ఫిన్ జంప్ చేస్తుంది. ఈ అద్భుత దృశ్యం పశ్చిమ ఆస్ట్రేలియా తీరంలో చోటుచేసుకుంది. ఫోటోగ్రాఫర్ జైమెన్ హడ్సన్ ఈ వీడియోను చిత్రీకరించారు.



ఈ వీడియోను ఫోటోగ్రాఫర్ జైమెన్ హడ్సన్ గత సంవత్సరం (అక్టోబర్ 2022) షేర్ చేశారు. నిజానికి ఈ వీడియో పాతదే అయినా ఇప్పుడు మరోసారి ట్రెండింగ్ అవుతోంది. ఈ క్లిప్ షేర్ చేసినప్పటినుంచి 1.2 మిలియన్ కంటే ఎక్కువ వ్యూస్ వచ్చాయి. అంతేకాదు ఈ వీడియోకి లైక్‌ల మరియు కామెంట్ల వర్షం కురుస్తోంది. 16 సెకండ్ల నిడివి గల ఈ వీడియోను మీరు చూసి ఎంజాయ్ చేయండి.


Also Read: Venus Saturn Transit 2023: శుక్ర శని గోచారం 2023.. ఈ 5 రాశుల వారు 10 రోజుల పాటు నోట్ల కట్టలతో ఆడుకోవడం పక్కా!  


Also Read: Suryakumar Yadav: సూర్య భాయ్ పేరు కాదు.. ఇట్స్‌ ఏ బ్రాండ్.. ఒక్క సెంచరీతో మూడు రికార్డులు  


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. 


ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 


ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook.