Venus Saturn Transit 2023: శుక్ర శని గోచారం 2023.. ఈ 5 రాశుల వారు 10 రోజుల పాటు నోట్ల కట్టలతో ఆడుకోవడం పక్కా!

Gemini, Virgo, Capricorn and Aquarius zodiac signs will get immense money due to Venus Saturn Transit 2023. జనవరి 17 వరకు మకర రాశిలో ఉండే శని, శుక్రుల కలయిక ఏ రాశుల వారికి ధనాన్ని, వృత్తిలో విజయాన్ని ఇస్తుందో ఇప్పుడు తెలుసుకుందాం.  

Written by - P Sampath Kumar | Last Updated : Jan 8, 2023, 10:25 AM IST
  • శుక్ర శని గోచారం 2023
  • 10 రోజులు ఈ రాశుల వారికి పండగే
  • నోట్ల కట్టలతో ఆడుకోవడం పక్కా
Venus Saturn Transit 2023: శుక్ర శని గోచారం 2023.. ఈ 5 రాశుల వారు 10 రోజుల పాటు నోట్ల కట్టలతో ఆడుకోవడం పక్కా!

These 4 zodiac sign peoples will get immense money due to Venus Saturn Transit 2023: జ్యోతిష్య శాస్త్రం ప్రకారం... రాబోయే 10 రోజులు కొన్ని రాశుల వారికి అద్భుతంగా ఉండనున్నాయి. ప్రస్తుతం మకర రాశిలో ఉన్న శని, శుక్ర గ్రహాల కలయికే వారికి అదృష్టం వరించనుంది. 2023 జనవరి 17 వరకు మకర రాశిలో శని, శుక్ర గ్రహాలు ఉంటాయి. 30 సంవత్సరాల తర్వాత మకర రాశిని విడిచి పెట్టి కుంభ రాశిలోకి శని సంచరిస్తుంది. జనవరి 17 వరకు మకర రాశిలో ఉండే శని, శుక్రుల కలయిక ఏ రాశుల వారికి ధనాన్ని, వృత్తిలో విజయాన్ని ఇస్తుందో ఇప్పుడు తెలుసుకుందాం.

మిథున రాశి:
మకర రాశిలో శుక్ర, శని కలయిక వలన మిథున రాశి వారికి జనవరి 17 వరకు శుభ ఫలితాలు ఉంటాయి. డబ్బుకు సంబంధించిన అన్ని సమస్యలు తీరుతాయి. ఆర్థిక ఉపశమనం లభిస్తుంది. జీవితంలో సంతోషం, ఐశ్వర్యం పెరుగుతాయి. గతంలో పెట్టిన పెట్టుబడి లాభిస్తుంది. ఆదాయ వనరులు పెరుగుతాయి. ధనం పొందేందుకు కొత్త మార్గాలు తెరుచుకుంటాయి. అన్ని పనుల్లో విజయం ఉంటుంది.

కన్యా రాశి:
శని సంచారానికి ముందు సమయం కన్యా రాశి వారికి చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. ఈ 10 రోజులు కన్యా రాశి వ్యక్తులు చాలా ఆనందంగా ఉంటారు. శుక్రుడు మరియు శని ఈ రాశి వారికి నోట్ల కట్టలు ఇస్తారు. జీవితంలోని సమస్యల నుంచి ఉపశమనం పొందవచ్చు. ఒత్తిడి తగ్గుతుంది. గొప్ప ఉపశమనం పొందుతారు.

మకర రాశి:
శని మరియు శుక్రుల కలయిక మకర రాశిలోనే జరుగుతుంది కాబట్టి ఈ రాశి వారికి గరిష్ట ప్రభావం ఉంటుంది. అధిక ధనం మీ ఇంటికి వస్తుంది. ఆదాయ మార్గాలు పెరుగుతాయి. ఆర్థిక స్థితి బలంగా ఉంటుంది. మీ కెరీర్‌లో మంచి రోజులు మొదలవుతాయి. భవిష్యత్తులో మరిన్ని ప్రయోజనాలు పొందుతారు. 

కుంభ రాశి:
కుంభ రాశిలోకి శని సంచారానికి ముందు కూడా శని మరియు శుక్రులు ఈ రాశి వారికి బలమైన ప్రయోజనాలను ఇవ్వగలరు. కుంభ రాశి వ్యక్తులు వృత్తిలో పురోగతిని పొందవచ్చు. ఆర్థిక రంగంలో కూడా ఈ సమయం లాభదాయకంగా ఉంటుంది. ఈ 10 రోజులు చాలా బాగుంటాయి. జనవరి 17 తర్వాత శని ఈ రాశి వారికి కాస్త ప్రతికూలకంగా ఉండనుంది. 

Also Read: Best SUV in India: మహీంద్రా మాత్రమే ఇలాంటి ఆఫర్ ఇవ్వగలదు.. మారుతి బ్రీజా ధరలో మహీంద్రా ఎక్స్‌యూవీ 700 కార్!

Also Read: Best Electric Scooter: బెస్ట్ ఎలక్ట్రిక్ స్కూటర్ ఇదే.. ఫుల్ ఛార్జ్‌తో 300 కిలోమీటర్లు! కరెంట్ బిల్ తక్కువే

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. 

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook.

 

 

Trending News