Viral News: పరీక్షల కోసం విద్యార్థులకు హాల్‌ టికెట్లు ఇచ్చారు. విద్యార్థులందరూ పరీక్షల కోసం సిద్ధమయ్యారు. పరీక్ష రోజు రావడంతో పరీక్ష కేంద్రానికి వెళ్లగా అక్కడ మూసి ఉన్న తలుపులు కనిపించాయి. అక్కడ పరీక్షకు సంబంధించిన ఏర్పాట్లు ఏమీ జరగలేదు. విద్యార్థులు వెళ్లి నిలదీసే దాకా పరీక్షలు ఉన్నాయనే విషయం అధికారులకు గుర్తు రాలేదు. వాళ్లు ఏకంగా పరీక్షలు నిర్వహించడమే మరచిపోవడం గమనార్హం. ఈ వింత ఘటన మధ్యప్రదేశ్‌లో చోటుచేసుకుంది. ఈ వార్త సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది.

COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Also Read: NIA Reward: బాంబ్‌ పెట్టినోడిని పట్టిస్తే అక్షరాల రూ.10 లక్షల నగదు బహుమతి మీ సొంతం


మధ్యప్రదేశ్‌లోని జబాల్‌పూర్‌లో రాణి దుర్గావతి విశ్వవిద్యాలయం ఉంది. ఈ విశ్వవిద్యాలయంలో ఎమ్మెస్సీ కంప్యూటర్‌ సైన్స్‌ మొదటి సెమిస్టర్‌ పరీక్షల నిర్వహణకు షెడ్యూల్‌ విడుదల చేశారు. 20 రోజుల కిందటే పరీక్ష షెడ్యూల్‌ విడుదల చేయగా.. దీనికి సంబంధించి హాల్‌ టికెట్లు కూడా పంపిణీ చేశారు. ఇక మార్చి 5వ తేదీ నుంచి పరీక్షలు ప్రారంభం కావాల్సి ఉంది. పరీక్షలు రాసేందుకు వివిధ ప్రాంతాల నుంచి విద్యార్థులు విశ్వవిద్యాలయానికి చేరుకున్నారు. పరీక్ష కేంద్రానికి చేరుకోగా అక్కడ పరీక్ష ఏర్పాట్లు ఏమీ చేయలేదు. పరీక్ష ఎక్కడ రాయాలని విద్యార్థులు ప్రశ్నించారు.

Also Read: River Metro: దేశంలోనే తొలిసారిగా జలమార్గంలో మెట్రో రైలు.. నదిలో రైలు విశేషాలు ఇలా


విశ్వవిద్యాలయ వైస్‌ చాన్స్‌లర్‌ను విద్యార్థులు నిలదీయగా అసలు విషయం బయటపడింది. పరీక్షలు నిర్వహించాల్సిన విషయాన్ని పరీక్ష విభాగం మరచిపోయింది. ఇది తెలిసి విద్యార్థులు అవాక్కయ్యారు. విధుల్లో నిర్లక్ష్యంగా వ్యవహరించడంపై విద్యార్థులు, విద్యార్థి సంఘాల నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. పరీక్షల కోసం దూరప్రాంతాల నుంచి వచ్చిన విద్యార్థులు అధికారుల తీరుపై మండిపడ్డారు. విచారణ చేసిన వీసీ సిబ్బంది తీరును ఆక్షేపించారు. ప్రస్తుతానికి పరీక్షలను వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు. పరీక్ష నిర్వహణ మరచిన ఘటనపై వీసీ మండిపడ్డారు. వెంటనే విచారణ కమిటీని ఏర్పాటుచేశారు. అయితే వాయిదా పడిన పరీక్షలకు షెడ్యూల్‌ విడుదల చేశారు. 'జరిగిన పరిణామానికి క్షమాపణలు. పరీక్షల నిర్వహణకు కొత్త టైమ్‌టేబుల్‌ జారీ చేశాం. ఎమ్మెస్సీ కంప్యూటర్‌ సైన్స్‌ మొదటి సెమిస్టర్‌ పరీక్షలు మార్చి 7 నుంచి 15వ తేదీ వరకు నిర్వహిస్తాం' అని వర్సిటీ రిజిస్ట్రార్‌ డాక్టర్‌ దీపేశ్‌ మిశ్రా వెల్లడించారు.



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


 Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి