Rashmika Mandanna Slammed: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా నటించిన 'పుష్ప' మూవీ సూపర్ డూపర్ హిట్ గా నిలిచింది. దీంతో ఈ సినిమాలో పనిచేసిన ప్రతి ఒక్కరికీ మంచి గుర్తింపు లభించింది. ఇన్ని రోజులు నేషనల్ క్రష్ గా పాపులర్ అయిన హీరోయిన్ రష్మిక పేరు కూడా ప్రపంచవ్యాప్తంగా మారుమోగిపోయింది. దీంతో ఇటీవలీ వార్తల్లో తరచూ నిలుస్తోంది ఈ భామ. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

రష్మిక ప్రస్తుతం ముంబయిలో ఉంది. ఓ బాలీవుడ్ సినిమా షూటింగ్ కోసం అక్కడుంటున్న ఆమె అనుకోని సంఘటన ఎదురైంది. బిక్షాటనకు వచ్చిన ఓ బాలికకు దానం చేయకుండా వెళ్లింది. అందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఆ బాలికకు దానం చేయడం పట్ల పలువురు నెటిజన్లు రష్మికపై ట్రోలింగ్ చేస్తున్నారు. 


ఏం జరిగిందంటే?


ప్రస్తుతం ముంబయిలో ఉన్న రష్మిక.. అనేక సినిమాల్లో నటిస్తూ బిజీగా ఉంది. ముంబయిలోని ఓ రెస్టారెంట్ నుంచి రష్మిక బయటకు రాగానే కొందరు బిక్షాటన చేసే బాలికలు ఆమె దగ్గరకు వచ్చారు. ఆమెను డబ్బు సహాయం చేయాలని బాలిక కోరగా.. అందుకు రష్మిక సహాయం చేయకుండా వెళ్లిపోయింది. 


అందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఆ వీడియో చూసిన కొందరు నెటిజన్లు రష్మికపై ట్రోలింగ్ చేస్తున్నారు. కనీసం ఆ బిక్షాటన చేసే బాలికకు కనీసం సాయం చేయోచ్చు కదా అని ట్రోలింగ్ చేస్తున్నారు. 



సినిమాలతో బిజీ..


'పుష్ప ది రైజ్' సినిమాతో సూపర్ హిట్ ను అందుకున్న రష్మిక.. త్వరలోనే ఆ సినిమాకు సంబంధించిన సెంకడ్ పార్ట్ షూటింగ్ లో పాల్గొననుంది. దీంతో పాటు బాలీవుడ్ లో అనేక సినిమాల్లో నటిస్తోంది. సిద్ధార్థ్ మల్హోత్రాతో పాటు 'మిషన్ మజ్ను' సినిమాలో హీరోయిన్ పాత్ర పోషిస్తుంది. మరోవైపు 'గుడ్ బై' అనే చిత్రంలో అమితాబ్ బచ్చన్ తో పాటు రష్మిక నటించనుంది.  


Also Read: Ashu Reddy Dubai Visit: అషు రెడ్డి వెనకున్న ఆ బాలీవుడ్ హీరో ఎవరో గుర్తుపట్టారా?


Also Read: David warner Video: శ్రీ వల్లి పాటకు స్టెప్పులేసిన డేవిడ్ వార్నర్​- వీడియో వైరల్​


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. 


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook