RBI New Rules: బ్యాంకుల్లో ఇకపై ఆటోమేటెడ్ మనీ కటింగ్ ఉండదు. ఆర్బీఐ కొత్త నిబంధనలు ప్రవేశపెట్టింది. హ్యాకింగ్, ఆన్‌లైన్ మోసాలు, ఇంటర్నెట్ బ్యాంకింగ్ దొంగతనాల్ని అరికట్టేందుకు కొత్త విధానం ప్రవేశపెట్టనుంది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

బ్యాంకు లావాదేవీల(Bank Transactions) విషయంలో ఇప్పటి వరకూ మీకు సంబంధించిన ఈఎమ్ఐలు, ఓటీటీ రెన్యువల్ ప్లాన్స్ ఇతర ఆన్‌లైన్ చెల్లింపులన్నీ ఆటోమేటిక్‌గా నిర్ణీత తేదీ వచ్చేసరికి ఎక్కౌంట్ నుంచి డబ్బు కట్ అవుతుంటోంది. ఇకపై బ్యాంకుల్నించి ఆటోమేటిక్‌గా మనీ కట్ అవడం అనేది జరగదు. ఈ విషయంలో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కీలక నిర్ణయం తీసుకుంది. ఎక్కౌంట్ హోల్డర్ నుంచి అదనపు అనుమతి తీసుకున్న తరువాతే డబ్బులు ఎప్పటికప్పుడు కట్ అవుతాయి. దీనికోసం బ్యాంకుల్నించి ఖాతాదారుడు రిజిస్ట్రేషన్ చేసుకోవడం తప్పనిసరి. ఆర్బీఐ ప్రవేశపెడుతున్న ఈ కొత్త విధానం అక్టోబర్ 1 నుంచి అమల్లో రానుంది. తొలి దశలో ఓటీటీ ప్లాట్‌ఫామ్స్(OTT Platforms) విషయంలో నిబంధన అమలు కానుంది.


అడిషనల్ ఫ్యాక్టర్ ఆఫ్ అథెంటిఫికేషన్(Additional Factor Authentification). అంటే యూజర్ ప్రమేయం లేకుండా నెల నెలా ఆటోమేటిక్‌గా డబ్బులు కట్ కావు. సాధారణంగా అమెజాన్, నెట్‌ఫ్లిక్స్, హాట్‌స్టార్ వంటి ఓటీటీ ప్లాట్‌ఫామ్స్ సబ్‌స్క్రిప్షన్ నెలవారీ ప్యాకేజీ పూర్తయిన వెంటనే..ఆటోమేటిక్‌గా డబ్బులు కట్ అయి..ప్యాకేజ్ రెన్యువల్ అవుతుంటుంది. ఆర్బీఐ కొత్త నిబంధన ప్రకారం ఇకపై అలా జరగదు. ఆన్‌లైన్ మోసాలు, ఇంటర్నెట్ బ్యాంకింగ్ దొంగతనాలు, హ్యాకింగ్‌లను నిలువరించేందుకు ఆక్టోబర్ 1 నుంచి ఆర్బీఐ కొత్త నిబంధనలు అమలు చేయనుంది. దీనికోసమే కొత్తగా ఏఎఫ్ఏ నిబంధన ప్రవేశపెట్టింది. ఆటోమేటిక్‌గా పేమెంట్ డిడక్ట్ అయ్యే సమయంలో మోసాలు, ఆన్‌లైన్ దొంగతనాలకు ఆస్కారం తప్పనిసరిగా ఉంది. అందుకే అడిషనల్ ఫ్యాక్టర్ ఆఫ్ అథెంటిఫికేషన్(AFA) పద్ధతి అమలవ్వాలని బ్యాంకులకు ఆర్బీఐ సూచించింది. కార్డుతో పాటు యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్‌ఫేస్, ప్రీపెయిడ్ పేమెంట్స్ ఇన్‌స్ట్రుమెంట్స్ చెల్లింపులకు వర్తించనుంది. ఏఎఫ్ఏ పద్ధతిలో చెల్లింపులతో భద్రతాపరమైన డిజిటల్ చెల్లింపులకు ఆస్కారం ఉంటుందని ఆర్బీఐ చెబుతోంది. అదే విధంగా రిజిస్ట్రేషన్ సమయంలో మొదటి ట్రాన్‌జాక్షన్, ప్రీ ట్రాన్‌జాక్షన్, విత్‌డ్రా కోసం ఏఎఫ్ఏ తప్పనిసరి కానుంది. ఈ కొత్త నిబంధన(RBI New Rules) కేవలం యూజర్ భద్రత కోసమేనని ఆర్బీఐ(RBI) అంటోంది. త్వరలో ఈ పద్ధతిని అతర అన్ని విషయాలకూ వర్తించనున్నారని తెలుస్తోంది. 


Also read: Bank Loan Interest Reduced: అద్భుతమైన పండగ ఆఫర్.. లోన్​లపై వడ్డీ రేట్ల తగ్గింపు


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి