Realme GT Neo 2 mobile specs: రియల్‌మి  మొబైల్స్ నుంచి కొత్తగా మరో స్మార్ట్ ఫోన్ లాంచ్ కాబోతోంది. అక్టోబర్ 13న.. అంటే రేపే ఈ స్మార్ట్ ఫోన్ మార్కెట్‌లోకి రానుందన్నమాట. రేపు మధ్యాహ్నం 12.30 గంటలకు రియల్‌మి జిటి నియో టు మొబైల్‌ని లాంచ్ చేయనున్నట్టు రియల్‌మి కంపెనీ ప్రకటించింది. రియల్‌మి కంపెనీకి చెందిన సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్స్‌తో పాటు యూట్యూబ్ ఛానెల్లో ఈ ఈవెంట్ లైవ్ స్ట్రీమింగ్ (Realme GT Neo 2 mobile launching live streaming) చేయనున్నట్టు రియల్‌మి మొబైల్స్ వెల్లడించింది. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

రియల్‌మి కంపెనీ నుంచి వచ్చిన రియల్‌మి జీటీ, రియల్‌మి జిటి మాస్టర్ ఎడిషన్‌కి (Realme introduced the GT and GT Master Edition) కొనసాగింపుగా ఈ రియల్‌మి జిటి నియో 2 మొబైల్ లాంచ్ అవుతోంది. మొబైల్ లాంచింగ్‌కి సమయం సమీపిస్తున్న తరుణంలో తాజాగా కంపెనీ తమ యూజర్స్‌ని ఊరిస్తూ తమ కొత్త స్మార్ట్‌ఫోన్‌కి సంబంధించిన పలు స్పెసిఫికేషన్స్‌ని వెల్లడించింది.


Realme GT NEO 2 5G specs- రియల్‌మి జిటి నియో 2 మొబైల్ ఫీచర్స్:
ఇప్పటికే తక్కువ ధరలో 5G మొబైల్స్‌తో పాటు ప్రీమియం రేంజ్ స్మార్ట్ ఫోన్స్‌లోనూ ఫ్లాగ్‌షిప్ మొబైల్స్ లాంచ్ చేసి 5జి మొబైల్ మార్కెట్‌లో దూసుకుపోతున్న రియల్‌మి ఈ మొబైల్‌తో తామేంటో మరోసారి నిరూపించుకోవాలని అనుకుంటోంది. 


Also read : Facebook live Audio feature: లైవ్ ఆడియో రూమ్స్ ఫీచర్‌తో పాటు Soundbites కూడా రెడీ చేస్తోన్న ఫేస్‌బుక్


5G processor - 5G ప్రాసెసర్: క్వాల్కామ్ స్నాప్‌డ్రాగాన్ 870 5G
Display and refresh rate - డిస్‌ప్లే: 120Hz రిఫ్రెష్ రేటుతో అమోల్డ్ డిస్‌ప్లే
Charging speed - చార్జింగ్ స్పీడ్ : 65 వాట్స్ డార్ట్ చార్జర్ (65W Dart Charge) ఈ మొబైల్‌తో వస్తోంది. అంటే ఫుల్ స్పీడ్ చార్జింగ్ అన్నమాట.
Battery capacity - బ్యాటరీ కెపాసిటీ: చార్జింగ్‌తో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా పెద్ద బ్యాటరీని అందిస్తున్నట్టి ప్రకటించిన రియల్‌మి.. ఆ బ్యాటరీ కెపాసిటి ఎంతనే వివరాలను మాత్రం సస్పెన్స్‌లోనే పెట్టింది. ఏదేమైనా పవర్ ఫుల్ ఫాస్ట్ చార్జర్ సౌకర్యం ఉంది ఒకవేళ బ్యాటరీ త్వరగా డ్రై అయినా... మళ్లీ అంతే వేగంతో చార్జింగ్ చేసుకునే వెసులుబాటు కూడా ఉంటుంది.


Realme GT NEO 2 5G mobile rear cameras - వెనుక భాగంలో ఉండె కెమెరాలు: ఈ స్మార్ట్ ఫోన్ వెనుక భాగంలో మొత్తం మూడు కెమెరాలు రానుండగా అందులో ఒకటి 64MP ప్రైమరీ కెమెరా ఉండనుంది. మిగతా రెండింటిలో ఒకటి వైడ్ యాంగిల్ కెమెరా కానుండగా మరొకటి మ్యాక్రో కెమెరా అమర్చారు.


Realme GT NEO 2 5G mobile front camera - సెల్ఫీ కెమెరా : రియల్‌మి యూజర్స్‌ని, స్మార్ట్‌ఫోన్ లవర్స్‌ని ఉత్కంఠకు గురిచేసేందుకు జిటి నియో 2 మొబైల్ ఫ్రంట్ కెమెరా వివరాలను కంపెనీ ఇంకా వెల్లడించలేదు. రేపటి మొబైల్ లాంచింగ్ ఈవెంట్‌లో ఈ వివరాలు తెలుస్తాయి.


Also read : WhatsApp users jumped to Telegram: వాట్సాప్‌కి షాక్ ఇస్తూ టెలిగ్రామ్‌లో చేరిన 70 మిలియన్ల మంది యూజర్స్


LED flash - ఎల్ఇడి ఫ్లాష్: రియల్‌మి జిటి నియో 2 మొబైల్ వెనుక భాగంలో నైట్ ఫోటోగ్రఫీ షాట్స్ (Night photography) సైతం అద్భుతంగా వచ్చేలా ఎల్ఇడి ఫ్లాష్‌లైట్‌ని అమర్చారు. 


రియల్‌మి జిటి నియో 2 మొబైల్ స్పెసిఫికేషన్స్, ధర వంటి పూర్తి వివరాలు (Realme GT NEO 2 5G price in India) ఏంటో తెలియాలంటే.. రేపు మొబైల్ లాంచ్ అయ్యే వరకు వేచిచూడాల్సిందే. Realme 5G smartphones: భారత్‌లో అత్యంత చవకైన 5G స్మార్ట్‌ఫోన్ Realme Narzo 30 Pro విక్రయాలు ప్రారంభం


Also read : Snakes viral videos: రెండేళ్ల పిల్లాడు రెండు మీటర్ల పాము తోక పట్టుకుని.. వైరల్ వీడియో


Also read : Oneplus offers on smart phones, TVs: వన్‌ప్లస్‌ నుంచి అదిరిపోయే ఆఫర్లు..స్మార్ట్‌ఫోన్స్‌, టీవీలపై భారీ డిస్కౌంట్‌


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook