WhatsApp users jumped to Telegram: వాట్సాప్‌కి షాక్ ఇస్తూ టెలిగ్రామ్‌లో చేరిన 70 మిలియన్ల మంది యూజర్స్

WhatsApp users jumped to Telegram app after global outage: వాట్సాప్ సర్వర్లు డౌన్ కావడం అనేది ఆ మెసేజింగ్ యాప్ సంస్థకు నష్టం అయితే, టెలిగ్రామ్‌ యాప్‌కి భారీ లాభాన్ని చేకూర్చింది. వాట్సాప్ డౌన్ అవడంతో చాలా మంది వాట్సాప్ యూజర్లు (Whatsapp users) ఇబ్బంది పడ్డారు. వాట్సాప్‌తో అత్యవసరం ఉన్న వాళ్లు తీవ్ర అసహనానికి గురయ్యారు.

Written by - Pavan | Last Updated : Oct 7, 2021, 01:35 PM IST
  • ఇటీవల మొరాయించిన వాట్సాప్, ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్ సర్వర్లు.
  • వాట్సాప్ పనిచేయకపోవడంతో ఆగ్రహం చెందిన యూజర్స్
  • టెలిగ్రామ్‌కి భారీగా కలిసొచ్చిన వాట్సాప్ గ్లోబల్ ఔటేజ్ (Whatsapp global outage)
WhatsApp users jumped to Telegram: వాట్సాప్‌కి షాక్ ఇస్తూ టెలిగ్రామ్‌లో చేరిన 70 మిలియన్ల మంది యూజర్స్

WhatsApp users jumped to Telegram app after global outage: వాట్సాప్‌కి 70 మిలియన్ల మంది వాట్సాప్ యూజర్స్ గట్టి షాక్ ఇచ్చారు. ఇటీవల వాట్సాప్ సర్వర్లు డౌన్ అయిన కారణంగా కొన్ని గంటల పాటు వాట్సాప్ సేవలకు అంతరాయం ఏర్పడిన సంగతి తెలిసిందే. సోమవారం రాత్రి 9 గంటల నుంచి మరునాడు తెల్లవారిజామున 3 గంటలు దాటే వరకు.. అంటే దాదాపు 6 గంటలకు పైగా సమయం వాట్సాప్ పనిచేయలేదు. వాట్సాప్‌తో పాటు ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్ కూడా సర్వర్స్ డౌన్ అయి మొరాయించిన సంగతి తెలిసిందే. 

అయితే, వాట్సాప్ సర్వర్లు డౌన్ కావడం అనేది ఆ మెసేజింగ్ యాప్ సంస్థకు నష్టం అయితే, టెలిగ్రామ్‌ యాప్‌కి భారీ లాభాన్ని చేకూర్చింది. వాట్సాప్ డౌన్ అవడంతో చాలా మంది వాట్సాప్ యూజర్లు (Whatsapp users) ఇబ్బంది పడ్డారు. వాట్సాప్‌తో అత్యవసరం ఉన్న వాళ్లు తీవ్ర అసహనానికి గురయ్యారు. అలా వాట్సాప్‌పై ఆగ్రహం చెందిన వారిలో కొంత మంది కోపంతో సరిపెట్టుకుంటే.. ఇంకొంత మంది వాట్సాప్‌ని పక్కనపెట్టి టెలిగ్రామ్‌కి షిఫ్ట్ అయ్యారట. 

టెలిగ్రామ్‌కి షిఫ్ట్ అయిన వాళ్ల సంఖ్య ఏ ఒక్కరో, లేక ఇద్దరో అయితే వాట్సాప్ పెద్దగా ఫీలయ్యేది కాదు.. కానీ ఏకంగా 70 మిలియన్ల మంది యూజర్స్ టెలిగ్రామ్ యాప్‌కి మారడం వాట్సాప్‌కి కోలుకోలేని షాక్ ఇచ్చింది. సర్వర్లు డౌన్ (Whatsapp servers down) అవడం వల్ల ఇంత పెద్ద నష్టం జరుగుతుందని ఊహించలేకపోయిన వాట్సాప్.. యూజర్స్ ఇచ్చిన షార్ నుంచి ఇంకా కోలుకోలేకపోతోంది.

Also read : Snakes viral videos: రెండేళ్ల పిల్లాడు రెండు మీటర్ల పాము తోక పట్టుకుని.. వైరల్ వీడియో..

టెలిగ్రామ్‌కి కొత్తగా 70 మిలియన్ల మంది యాడ్ కావడంపై టెలిగ్రామ్ సీఈఓ పవెల్ దురోవ్ (Telegram CEO Pavel Durov) స్పందిస్తూ.. ''అనుకోకుండా అంత మంది యూజర్స్ వచ్చి చేరినప్పటికీ ఆ ట్రాఫిక్‌ని హ్యాండిల్ చేయడంలో టెలిగ్రామ్ టీమ్ సక్సెస్‌ఫుల్‌గా పనిచేసింది'' అని తమ సిబ్బందిని అభినందించారు. ''అనుకోకుండా అంత భారీ సంఖ్యలో యూజర్స్ టెలిగ్రామ్ యాప్ (Telegram app) ఇన్‌స్టాల్ చేసుకోవడం వల్ల అమెరికాలో కొంత మంది యూజర్స్‌కి ఎప్పటికంటే కొంత స్లోగా పనిచేసి ఉండొచ్చు. అంతకు మించి ఇంకెలాంటి ఇబ్బంది ఎదురవలేదు'' అని దురోవ్ స్పష్టంచేశారు. 

ఏదేమైనా వాట్సాప్, ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్ గ్లోబల్ ఔటేజ్ (Whatsapp, facebook, instagram global outage) ఘటన నుంచి ఫేస్‌బుక్ సంస్థ పెద్ద గుణపాఠమే నేర్చుకుని ఉండి ఉంటుంది అని నెటిజెన్స్ సెటైర్లు వేస్తున్నారు. ఇదిలావుంటే, ఫేస్‌బుక్‌కి యూజర్స్ సేఫ్టీ కంటే మనీనే ముఖ్యం అని ఫైర్ అవుతున్న వాళ్లు కూడా లేకపోలేదు.

Also read : Viral Videos: రెండు చక్రాలతో ఆటో నడిపాడు..గిన్నిస్ రికార్డు సాధించాడు..

Also read : Shiva lingam: అమావాస్య నాడు ఆకాశంలో అద్భుతం.. మబ్బులతో దర్శనమిచ్చిన శివ లింగం

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News

By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.

x