Facebook live Audio feature: లైవ్ ఆడియో రూమ్స్ ఫీచర్‌తో పాటు Soundbites కూడా రెడీ చేస్తోన్న ఫేస్‌బుక్

Facebook live Audio feature: టిక్ టాక్ యాప్ (Tik tok app) తరహాలోనే షార్ట్ ఆడియో క్లిప్స్ ఆఫర్ చేసేందుకు సౌండ్‌బైట్స్ పేరుతో మరో యాప్‌ని (soundbites) లాంచ్ చేసేందుకు ఫేస్‌బుక్ ప్లాన్ చేస్తోంది. టిక్ టాక్ తరహాలోనే కాంటెంట్ క్రియేటర్స్‌కి ఈ సౌండ్ బైట్స్ (Facebook's soundbites app) ఉపయోగపడనుంది.

Written by - ZH Telugu Desk | Last Updated : Oct 12, 2021, 05:33 PM IST
Facebook live Audio feature: లైవ్ ఆడియో రూమ్స్ ఫీచర్‌తో పాటు Soundbites కూడా రెడీ చేస్తోన్న ఫేస్‌బుక్

Facebook live Audio feature: ఫేస్‌బుక్ లైవ్ ఆడియో రూమ్ ఫీచర్‌ను యావత్ ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఫేస్‌బుక్ యూజర్స్‌కి అందుబాటులోకి తీసుకొచ్చేందుకు ఫేస్‌బుక్ ప్రణాళికలు రచిస్తోంది. అమెరికాలో ఉన్న పబ్లిక్ ఫిగర్స్, సెలబ్రిటీల కోసం ఇదే ఏడాది జూన్‌లో ఫేస్‌బుక్ లైవ్ ఆడియో రూమ్స్ లాంచ్ చేసింది. తాజాగా ఫేస్‌బుక్ ఏం చెబుతోందంటే.. అమెరికాతో పాటు ప్రపంచవ్యాప్తంగా ఉన్న పబ్లిక్ ఫిగర్స్, కాంటెంట్ క్రియోటర్స్ కోసం ఫేస్‌బుక్ లైవ్ ఆడియో రూమ్స్ ఫీచర్స్‌ని వరల్డ్ వైడ్ లాంచ్ చేయాలనేది తమ ఆలోచనగా చెబుతోంది. 

తొలుత ఫేస్‌బుక్ లైవ్ ఆడియో రూమ్స్‌ని ఐఓఎస్ యూజర్స్‌కే పరిమితం చేసిన ఫేస్‌బుక్ తాజాగా ఆ ఫీచర్‌ని ఆండ్రాయిడ్ యూజర్స్‌కి (Android users) కూడా అందుబాటులోకి తీసుకొచ్చింది. డెస్క్‌టాప్‌పై లైవ్ ఆడియో ఫీచర్ (Live audio feature on facebook) ఉపయోగించుకునే అవకాశం కల్పించిన ఫేస్‌బుక్.. క్రియేట్ చేయడానికి మాత్రం మొబైల్ యాప్‌ని ఇన్‌స్టాల్ చేసుకోవడం తప్పనిసరి చేసింది.

ఫేస్‌బుక్ గ్రూప్స్‌లో పబ్లిక్, ప్రైవేట్ ఆప్షన్స్‌తో ఫేస్‌బుక్ లైవ్ ఆడియో రూమ్ ఫీచర్ (Facebook live audio room feauture) ఉపయోగించుకోవచ్చు. అలాగే గ్రూప్‌లో ఎవరెవరు లైవ్ ఆడియో రూమ్స్‌లోకి ప్రవేశిస్తున్నారనేది గ్రూప్ అడ్మిన్ మానిటర్ చేసేందుకు వీలు ఉంటుంది. 

Also read : viral Wedding Dance: అదిరిపోయిన బావ-మరదలు డ్యాన్స్.. నెటిజన్లతో ఈల వేయిస్తున్న వీడియో

ఇదిలావుంటే, టిక్ టాక్ యాప్ (Tik tok app) తరహాలోనే షార్ట్ ఆడియో క్లిప్స్ ఆఫర్ చేసేందుకు సౌండ్‌బైట్స్ పేరుతో మరో యాప్‌ని (soundbites) లాంచ్ చేసేందుకు ఫేస్‌బుక్ ప్లాన్ చేస్తోంది. టిక్ టాక్ తరహాలోనే కాంటెంట్ క్రియేటర్స్‌కి ఈ సౌండ్ బైట్స్ (Facebook's soundbites app) ఉపయోగపడనుంది. 

అంతేకాకుండా ఫేస్‌బుక్ కమ్యునిటీ స్టాండర్డ్స్, రూల్స్‌కి (Facebook Community Standards) విరుద్ధంగా ఉండే వీడియోలు, ఆడియోలు, పోస్టులను గుర్తించేందుకు ఇంకొన్ని కొత్త టూల్స్ లాంచ్ చేసేందుకు ఫేస్‌బుక్ టెక్నికల్ టీమ్ ప్రయత్నాలు చేస్తోంది.

Also read : Weird wedding rituals, variety gifts: ఛత్తీస్‌గఢ్‌లో వింత ఆచారం..వరుడికి గిఫ్ట్‌గా 21 విషపూరిత పాములు

Also read: Man Gave water to King Cobra: బాప్రే.. ఈడు మగాడ్రా బుజ్జి.. కింగ్ కోబ్రాకే నీళ్లు తాగించాడు..!!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News