King Kobra Video: జంతువుల్లో విషపూరితమైనది పాములు. అయితే పాముల్లో చాలా రకాలు ఉంటాయి. కొన్ని విషం లేని పాములు కూడా ఉంటాయి. అంతేకాకుండా రంగురంగుల పాములు కూడా ఉంటాయి. ఇవి చాలా అరుదైనవి. వాటిలో ఎరుపు రంగు పాముల ప్రత్యేకంగా కనిపించేవి. అలాంటి పాము తాజాగా దర్శనమిచ్చింది. ఎరుపు రంగులో హొయలు లొలుకుతూ కనిపించిన ఆ పామును చూసి ప్రజలతోపాటు సామాజిక మాధ్యమాల్లో నెటిజన్లు వావ్‌ అంటున్నారు.

COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Also Read: Bengaluru Ambulance: ఫ్లైఓవర్‌పై అంబులెన్స్‌ బీభత్సం.. అచ్చం సినిమాలో చూసినట్టే దృశ్యాలు


ఒక ఎరుపు రంగు పాముకు సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో హల్‌చల్‌ చేస్తోంది. గతంలో ఇలాంటి పామును ఏనాడూ చూడని ప్రజలు, నెటిజన్లు ఆసక్తిగా తిలకిసతున్నారు. ఓ పాడుబడిన ఇంట్లో దూరిన ఎరుపు రంగు పామును అక్కడి స్థానికులు జాగ్రత్తగా పట్టుకున్నారు. పట్టుకుంటున్న సమయంలో ఆ పాము పడగ విప్పింది. బుసలు కొడుతూ బెదిరింపులకు దిగింది. అయితే అత్యంత జాగ్రత్తగా ఆ పామును స్థానికులు బంధించారు. అయితే ఆ పాము నాగుపాము అని తెలుస్తోంది. నాగుపాము ఇతర రంగుల్లో ఉండడం చాలా అరుదు. ఎరుపు రంగులో కనిపించడం అత్యంత అరుదైన విషయం. దీనిని రెడ్‌ కోబ్రా స్నేక్‌గా పిలుస్తారని నెటిజన్లు చెబుతున్నారు.

Also Read: Snake video: వామ్మో.. ఇదేక్కడి మాస్ రా మావా... షర్ట్ లో దూరిన భారీ సర్పం.. వైరల్ గా మారిన వీడియో..


అయితే నెట్టింట్లో వైరలవుతున్న వీడియోపై నెటిజన్లు పెద్ద ఎత్తున కామెంట్లు చేస్తున్నారు. పాము సాధారణంగా బంగారు రంగులో ఉన్న పామేనని నెటిజన్లు చెబుతున్నారు. సాధారణ నాగుపాముకు ఎరుపు రంగును కొందరు వేశారని కామెంట్లు పెడుతున్నారు. సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ కావడానికే ఇలా చేసి ఉంటారని పేర్కొంటున్నారు. ఏది ఏమైనా ఎరుపు రంగులో కనిపించిన పాము వీడియో హల్‌చల్‌ చేస్తోంది. ఈ పాము ఎక్కడ కనిపించిదనేది తెలియదు. (గమనిక: ఈ పాము సంఘటన ఎక్కడ జరిగిందనేది జీ మీడియా నిర్ధారణ చేయడం లేదు. సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారడంతో ఈ వార్తను ప్రచురణ చేస్తున్న విషయం తెలుసుకోండి)
 



 



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.   


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


 Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి