GHMC 5K Run: కాంగ్రెస్‌ ఏడాది పాలన పూర్తయిన సందర్భంగా నిర్వహిస్తున్న తెలంగాణ ప్రజా పాలన వారోత్సవాల్లో ఒక ఫ్లెక్సీ కలకలం రేపింది. రేవంత్‌ రెడ్డికి సంబంధించిన బ్యానర్‌లో చేయి దయ్యం చేయిలాగా కనిపించడం చర్చనీయాంశంగా మారింది. దానికి సంబంధించిన వీడియో, ఫొటో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. వెంటనే తప్పును గ్రహించిన అధికారులు బ్యానర్‌ను తొలగించారు. ఈ ఫ్లెక్సీ వివాదం రాజధాని హైదరాబాద్‌లో చర్చనీయాంశంగా మారింది.

COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Also Read: Congress Party: కాంగ్రెస్‌ డబుల్‌ షాక్‌.. హస్తం గూటికి బీఆర్‌ఎస్‌, బీజేపీ నాయకులు


తెలంగాణ ప్రజా పాలన వారోత్సవాల్లో భాగంగా హైదరాబాద్‌లోని ఉప్పల్ జీహెచ్‌ఎంసీ సర్కిల్ కార్యాలయంలో 2కే రన్‌ గురువారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఏర్పాటుచేసిన ఫ్లెక్సీలో రేవంత్ రెడ్డి ఫ్లెక్సీ దయ్యం చేతిలాగా కనిపించడంతో అందరూ ఆసక్తిగా గమనించారు. చేతులు సాగదీసి వేలాడుతూ రేవంత్‌ రెడ్డి చేయి కనిపించడంతో స్థానికంగా చర్చనీయాంశమైంది. అందరూ ఫ్లెక్సీలు ఆసక్తిగా గమనిస్తుండడంతో జీహెచ్‌ఎంసీ సిబ్బంది గుర్తించారు.

Also Read: KTR Harish Rao Arrest: రేవంత్‌ రెడ్డి నీ పిట్ట బెదిరింపులకు భయపడం.. ప్రశ్నిస్తే కేసులా?


ఈ ఫ్లెక్సీ ఏర్పాటుపై సర్కిల్ కార్యాలయానికి వచ్చే సందర్శకులు, కాంగ్రెస్‌ పార్టీ నాయకులు, కాలనీవాసులు అసహనం వ్యక్తం చేశారు. అధికారుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో ఆరోపణలు చేయడంతో హుటాహుటిన ఉప్పల్ జీహెచ్‌ఎంసీ సర్కిల్ సిబ్బంది ఫ్లెక్సీని తొలగించారు. సీఎం ఫొటోని సరిగా చూడకుండా ఫ్లెక్సీ ఏర్పాటుచేసి దయ్యం చేతిని పోలి ఉండడాన్ని చూడకపోవడంపై సిబ్బంది నిర్లక్ష్యానికి అద్దం పడుతుందని పలువురు పేర్కొంటున్నారు. కాగా ఫ్లెక్సీ ఏర్పాటుచేసిన అధికారులపై శాఖపరమైన చర్యలు తీసుకునేందుకు సిద్ధమైనట్లు తెలుస్తోంది.



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. 


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.