MLA Crying Video Goes Viral ​: ఆ ఎమ్మెల్యే మొత్తం అసెంబ్లీలోనే అత్యంత నిరుపేద ప్రజాప్రతినిధి. ఇప్పటికీ 2 గదులు మాత్రమే ఉన్న ఇంట్లో 12 మంది కుటుంబసభ్యులు ఉన్న ఉమ్మడి కుటుంబంతో జీవితం గడిపేస్తున్నాడు. ఆ ఇల్లు కూడా 2004 లో ఇందిరా ఆవాస్ యోజన కింద అప్పటి ప్రభుత్వం కట్టించి ఇచ్చిందే. 2020 ఎన్నికలప్పుడు ఎన్నికల సంఘానికి ఆ ప్రజా ప్రతినిధి సమర్పించిన అఫిడవిట్ ప్రకారం ఆయనకున్న మొత్తం ఆస్తుల విలువ కూడా రూ. 70 వేలు మాత్రమే.  


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఏంటిదంతా నిజమేనా అని ఆశ్చర్యపోతున్నారా ? ఇవాళ రేపు అంత నిజాయితీపరులు ఉన్నారా అని అవాక్కవుతున్నారా ? ఒక ఊరి సర్పంచ్ కూడా నీతి, నిజాయితీలు పక్కనపెట్టి భారీ మొత్తంలో వెనకేసుకుంటూ లేనిపోని ఆడంబరాలకు పోతున్న ఈ రోజుల్లో ఇలాంటి సాదాసీదా నేతలు కూడా ఉన్నారంటే గొప్ప విషయమే అని అనుకుంటున్నారా ? అవును.. ఉన్నారు.. నూటికో, కోటికో ఒక్కరు అన్నట్టుగా ఎక్కడో ఓ చోట నీతి, నిజాయితీ, విలువలకే కట్టుబడి ఉన్న ప్రజాప్రతినిధులు ఇంకా ఉన్నారు. అలాంటి వారు అభినందనీయులు కూడా. ఇంతకీ ఆ ఎమ్మెల్యే ఎవరు, ఏ నియోజకవర్గానికి ప్రాతినిథ్యం వహిస్తున్నారు అనే కదా మీ సందేహం. అయితే, అక్కడికే వస్తున్నాం. 


ఆ ఎమ్మెల్యే గతం ఆయన మాటల్లోనే..
మనం చెప్పుకుంటున్నది బీహార్‌లో ఆర్జేడీ ఎమ్మెల్యే రామ్‌వ్రిక్ష్ సద గురించి. 1995 లో తాను ఓ ఇటుక బట్టీలో పనిచేసే సమయంలో ఆర్జేడీ చీఫ్ లాలూ ప్రసాద్ యాదవ్ ఓ ఎన్నికల ర్యాలీకి వచ్చినప్పుడు ఆయన్ని చూడ్డానికి వెళ్లాను. అప్పుడే తొలిసారిగా రాజకీయాల్లోకి రావాలని నిర్ణయించుకున్నాను. 2000 సంవత్సరంలో అలౌలి నియోజకవర్గం నుంచి పశుపతి కుమార్‌పై ఆర్డేడీ అభ్యర్థిగా పోటీ చేసి ఓటమిపాలయ్యాను. 2005 లో కూడా పోటీ చేసి ఓడిపోయాను. అయినా పట్టు వదలని విక్రమార్కుడిలా పోరాడి 2020 సంవత్సరంలో ఎట్టకేలకు ఎమ్మెల్యేగా గెలిచాను. 


2020 నాటి ఎన్నికల అఫిడవిట్ ప్రకారం రామ్‌వ్రిక్ష్ సద పేర్కొన్న రూ. 70 వేల విలువైన ఆస్తుల్లో 25 వేలు నగదు తనవి, తన భార్య వద్ద ఉన్న మరో రూ. 5 వేల నగదు, సొంతూరైన రౌన్ గ్రామంలో రూ. 30 వేల విలువ చేసే తను ఉంటున్న 2 గదుల ఇల్లు, రూ. 10 వేల విలువ చేసే కొద్దిపాటి వ్యవసాయ భూమి.. అన్నీ కలిపి మొత్తం రూ. 70 వేలే అతడి ఆస్తి. 


2000 లో తను తొలిసారిగా పోటీ చేసినప్పటి నుంచీ ఆర్జేడీ తనకు అండగా ఉంటూ వస్తోందంటున్నారు రామ్‌వ్రిక్ష్ సద. 10 వ తరగతి వరకు మాత్రమే చదువుకున్న తాను ఉపాన్యాసాలు ఇవ్వడంలో దిట్ట అని తనకు తానే కితాబిచ్చుకున్నాడు. 2020లో మూడో ప్రయత్నంలో జనతా దళ్ (యునైటెడ్) నాయకురాలు సాధనా దేవిపై విజయం సాధించిన రామ్ వ్రిక్ష్.. ఈ ఎన్నికల్లో గెలిచిన తర్వాతే తొలిసారిగా తన ఇంటిని కొద్దిపాటి రెనోవేట్ చేయించారట. 


రామ్‌వ్రిక్ష్ సద కళ్లలో ఆనందం, కన్నీళ్లు
బీహార్ అసెంబ్లీలోనే అత్యంత నిరుపేద ఎమ్మెల్యేగా పేరొందిన రామ్‌వ్రిక్ష్ సదకు తాజాగా బీహార్ సర్కారు మూడంతస్తుల భవనం ఇంటి తాళాలు అందించి ఆశ్చర్యంలో ముంచెత్తింది. అది కూడా పాట్నాలోని బీహార్ అసెంబ్లీకి కూతవేటు దూరంలోనే ఉన్న బీర్ చంద్ పటేల్ పథ్ ప్రాంతంలో. రాష్ట్ర ప్రభుత్వం ఎమ్మెల్యేలకు కట్టించి ఇస్తున్న హౌజింగ్ ప్రాజెక్టులో ఇల్లు పొందిన 8 మంది లక్కీ ఎమ్మెల్యేల్లో రామ్ వ్రిక్ష్ కూడా ఒకరు. ఎస్సీలో ముశహర్ సామాజిక వర్గానికి చెందిన రామ్ వ్రిక్ష్.. తాను ఇంతటి భాగ్యానికి నోటుకుంటానని కల్లో కూడా అనుకోలేదని చెబుతూ ఉద్వేగానికి గురయ్యారు. 

బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ ఓ బహిరంగ సభలో రామ్ వ్రిక్ష్ సదకు ఇంటి తాళంచెవి అందిస్తుండగా ఆయన కంట్లో ఆనందబాష్పాలు రావడం అందరినీ ఆశ్చర్యపరిచాయి. ఇప్పుడా వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఒక పేదోడికి సొంతిల్లు రావడం అనేది దీపావళి పండగలాంటేది అని తన ఆనందాన్ని వ్యక్తపరిచారు. ఒక నిరుపేద జీవికి ఎప్పుడైనా ఏదైనా ఆశించినదానికంటే ఎక్కువ లభిస్తే.. అది వారికి దీపావళి పండగ కంటే ఎక్కువ ఆనందాన్ని ఇస్తుందని రామ్‌వ్రిక్ష్ అభిప్రాయపడ్డారు. ఇప్పటికీ తన కళ్లను తను నమ్మలేకపోతున్నానని రామ్‌వ్రిక్ష్ మీడియాకు తెలిపారు. కొత్తింట్లోకి ఎవరెవరు వస్తున్నారు అని మీడియా అడగ్గా.. తన కుటుంబం కూడా ఎంతో ఎగ్జైటింగ్‌గా ఉందని, నవంబర్ 3 తర్వాత ఉప ఎన్నికలు ముగిశాకే నిర్ణయం తీసుకుంటానని చెబుతున్న రామ్ వ్రిక్ష్ లాంటి నిరుపేద ప్రజాప్రతినిధులను మీరు ఎప్పుడైనా చూశారా ? చూస్తే మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.


Also Read : TRS MLAs Trap Case: టీఆర్ఎస్ ఎమ్మెల్యేలతో బేరసారాల కేసు.. రిమాండ్ రిపోర్టులో సంచలన విషయాలు


 


Also Read : TRS MLAS BRIBE: పోలీసుల దగ్గర ముడున్నర గంటల వీడియో.. కేసీఆర్ చేతిలో బీజేపీ పెద్దల చిట్టా?


Also Read : TRS MLAs Case: టీఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో పోలీసులకు షాకిచ్చిన ఏసీబీ కోర్టు



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


Android Link https://bit.ly/3P3R74U


Apple Link - https://apple.co/3loQYe 


Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి