TRS MLAS BRIBE: పోలీసుల దగ్గర ముడున్నర గంటల వీడియో.. కేసీఆర్ చేతిలో బీజేపీ పెద్దల చిట్టా?

TRS MLAS BRIBE: ఎమ్మెల్యేలకు బేరసారాల కేసు రిమాండ్ నివేదికలో కీలక అంశాలు పేర్కొన్నారు పోలీసులు. టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని అస్థిరపరిచేందుకు కుట్ర చేశారని.. ఎమ్మెల్యేలకు ప్రలోభాలు చూపారని చెప్పారు. ఈ ఆపరేషన్ కోసం నాలుగు రహస్య కెమెరాలు, రెండు వాయిస్ రికార్డర్లు వాడినట్లు కోర్టుకు తెలిపారు పోలీసులు.

Written by - Srisailam | Last Updated : Oct 29, 2022, 08:17 AM IST
  • ఎమ్మెల్యేల బేరసారాల కేసులో సంచలనం
  • రిమాండ్ రిపోర్టులో బీజేపీ పెద్దల పేర్లు
  • ఇవాళ మరిన్ని ఆడియో, వీడియోలు లీక్?
TRS MLAS BRIBE:  పోలీసుల దగ్గర ముడున్నర గంటల వీడియో.. కేసీఆర్ చేతిలో బీజేపీ పెద్దల చిట్టా?

TRS MLAS BRIBE:  తెలంగాణతో పాటు దేశ వ్యాప్తంగా ప్రకంపనలు రేపుతున్న ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో ట్విస్టుల మీద ట్విస్టులు వెలుగు చూస్తున్నాయి. శుక్రవారం రెండు ఆడియోలు బయటికి వచ్చాయి. 14 నిమిషాల మొదటి ఆడియోలో  ఎమ్మెల్యే రోహిత్ రెడ్డితో  రామచంద్ర భారతి, నందు మాట్లాడుకున్నారు. 27 నిమిషాల రెండో ఆడియోలో ఫాంహౌజ్ లో పోలీసులకు పట్టుబడిన రామచంద్ర భారతి, సింహయాజులు, నందకుమార్ లు డీల్ గురించి చర్చించుకున్న విషయాలు ఉన్నాయి. రెండో ఆడియోలో డబ్బుల ప్రస్తావన ఉంది. బీజేపీ ఆర్గనైజింగ్ సెక్రటరీ బీఎల్ సంతోష్ పేరును రామచంద్ర భారతి పలుసార్లు ప్రస్తావించారు. నెంబర్ 1, నెంబర్ 2 అంటూ పదేపదే మాట్లాడారు. డీల్ కు సంబంధించి మరిన్ని ఆడియో, వీడియోలు ఉన్నాయని.. అవి కూడా బయటికి వస్తాయనే ప్రచారం సాగుతోంది.

ఇక ఎమ్మెల్యేలకు బేరసారాల కేసు రిమాండ్ నివేదికలో కీలక అంశాలు పేర్కొన్నారు పోలీసులు. టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని అస్థిరపరిచేందుకు కుట్ర చేశారని.. ఎమ్మెల్యేలకు ప్రలోభాలు చూపారని చెప్పారు. ఈ ఆపరేషన్ కోసం నాలుగు రహస్య కెమెరాలు, రెండు వాయిస్ రికార్డర్లు వాడినట్లు కోర్టుకు తెలిపారు పోలీసులు. మీటింగ్ జరిగిన హాల్ లో రహస్య కెమెరాలతో పాటు ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి కుర్తా జేబుల్లో రెండు వాయిస్ రికార్డర్లు ఉంచామని రిమాండ్ రిపోర్టులో పొందు పరిచారు పోలీసులు. ఫాంహౌజ్ హాళ్లో మధ్యాహ్నం 3.05కి రహస్య కెమెరాలు ఆన్ చేశామని తెలిపారు.  3.10కి నిందితులతో కలిసి హాళ్లోకి రోహిత్ రెడ్డి వచ్చారన్నారు. సాయంత్రం 4.10కి ఎమ్మెల్యేలు గువ్వల బాలరాజు, హర్షవర్దన్ రెడ్డి, రేగా కాంతరావు ఫాంహౌజ్ కి వచ్చారని వెల్లడించారు.

సుమారు మూడున్నర గంటల పాటు నిందితులతో ఎమ్మెల్యేలు చర్చించారని రిమాండ్ రిపోర్టులో పోలీసులు తెలిపారు. మీటింగ్ పూర్తి కాగానే కొబ్బరి నీళ్లు తీసుకురా అని సిగ్నల్ ఇవ్వాలని రోహిత్ రెడ్డికి చెప్పామని..  కొబ్బరినీళ్లు తీసుకురా అని పైలట్ రోహిత్ రెడ్డి  అనగానే తాము హాల్ లోపలికి వెళ్లామని వెల్లడించారు. ఎమ్మెల్యేకు  50 కోట్ల రూపాయలు ఇస్తామన్న సంభాషణ వాయిస్ రికార్డర్లలో నమోదైందన్నారు. కర్ణాటక, ఢిల్లీ, ఇతర ప్రాంతాల్లోనూ ఇలాగే చేశామన్న రామచంద్రభారతి సంభాషణ రికార్డయిందని కోర్టుకు వెల్లడించారు.తుషార్ కు రామచంద్రభారతి ఫోన్ చేసినట్లు వాయిస్ రికార్డర్లు రికార్డయిందని తెలిపారు. తెలంగాణకు సంబంధించి ముఖ్య విషయం మాట్లాడాలని సునీల్ కుమార్ బన్సల్ కు రామచంద్రభారతి ఎస్ఎంఎస్ పంపారంటూ.. అందుకు సంబంధించిన ఎస్ఎంఎస్ స్క్రీన్ షాట్ ను రిమాండ్ నివేదికలో పొందుపరిచారు పోలీసులు. రామచంద్ర భారతి, నందు వాట్సప్ సంభాషణ స్క్రీన్ షాట్లు పొందుపరిచారు పోలీసులు. 25 మంది ఎమ్మెల్యేలు చేరేందుకు సిద్ధంగా ఉన్నారంటూ సంతోష్ బీజేపీ పేరుతో ఉన్న నంబరుకు రామచంద్ర భారతి వాట్సప్ మెసేజ్ చేసిన స్క్రీన్ షాట్ ను రిమాండ్ రిపోర్టులో పొందుపరిచారు. ఈ డీల్ లో కీలక పాత్ర పోషించిన నందు డైరీలో 50 మంది టీఆర్ఎస్, కాంగ్రెస్ ఎమ్మెల్యేల వివరాలు ఉన్నాయని కోర్టుకు తెలిపారు. మిగతా ముగ్గురు ఎమ్మెల్యేలు రోహిత్ రెడ్డికి సహకరించేందుకు వెళ్లారని స్పష్టం చేశారు.

నలుగురు ఎమ్మెల్యేల బేరసారాలకు సంబంధించి రిమాండ్ రిపోర్టులో పోలీసులు తెలిపిన వివరాలు సంచలనంగా మారాయి. జాతీయ స్థాయిలో బీజేపీలో కీలక నేతలుగా ఉన్న బీఎల్ సంతోష్, సునీల్ బన్సల్ పేర్లు ఉండటం కమలం పార్టీలో కలకలం రేపుతోంది. ఈ డీల్ కు సంబంధించి ఆడియో, వీడియోలు బయటకి వస్తాయన్న ప్రచారంతో... అందులో ఏముందన్న ఉత్కంఠ పెరుగుతోంది.

Also Read : Chiranjeevi-Garikapati : మళ్లీ వివాదం షురూ.. గరికపాటి మీద చిరంజీవి పరోక్ష సెటైర్లు.. వీడియో వైరల్

Also Read : Jagadish Reddy: మంత్రి జగదీశ్ రెడ్డికి ఈసీ ఝలక్

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

Android Link https://bit.ly/3P3R74U

Apple Link - https://apple.co/3loQYe 

Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

Trending News

By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.

x