Rs 1 Old Note: భారీ ధరకు పాత రూపాయి నోటు వేలం.. ఎంతో తెలిస్తే మైండ్ బ్లాకే! డిస్కౌంట్ ఆఫర్ కూడా
One Rupee Old Note in Auction. ఓ ఆన్‌లైన్‌లో వెబ్‌సైట్‌లో పాత ఒక్క రూపాయి నోటును వేలల్లో విక్రయిస్తున్నారు. ఇక్కడ విశేషం ఏంటంటే.. ఆ రూపాయి నోటుపై డిస్కౌంట్ ఆఫర్ కూడా ఉంది.
One Rupee Old Note in Auction for huge price: ప్రస్తుత కాలంలో కూడా పాత నోట్ల సేకరణను చాలా మంది ఇష్టపడతారు. చాలా మంది పాత నాణేలు లేదా నోట్లను చాలా జాగ్రత్తగా దాచుకుంటారు. మీకు పాత నోట్లు లేదా నాణేలను సేకరించే అలవాటు ఉంటే.. మీరు ధనవంతులయినట్టే. మీ దగ్గర ప్రత్యేకమైన నోటు ఉంటే.. వేలు, లక్షలకు అమ్మి ధనవంతులు కావొచ్చు. ఓ ఆన్‌లైన్‌లో వెబ్‌సైట్‌లో ఒక్క రూపాయి నోటును వేలల్లో విక్రయిస్తున్నారు. ఇక్కడ విశేషం ఏంటంటే.. ఆ రూపాయి నోటుపై డిస్కౌంట్ ఆఫర్ కూడా ఉంది.
ప్రజలు ప్రత్యేకమైన నోట్లను కొనుగోలు చేయడానికి సిద్ధంగా ఉన్నారు. అందుకే ఇటీవల ఈ ప్రత్యేకమైన నోట్లకు భారీగా డిమాండ్ ఏర్పడింది. Coinbazzar.comలో ఒక్క రూపాయి నోటు వేలంలో ఉంది. ఈ నోటు ధర ప్రస్తుతం రూ. 42 వేల రూపాయలు. రూ.13 వేల తగ్గింపుతో కొనుగోలుదారులకు అందుబాటులో ఉంది. ఈ నోటు అసలు ధర రూ. 55 వేల రూపాయలు. అయితే ఈ నోటుకు ఇంత ఎక్కువ ధర ఎందుకు పలుకుతుందో, దాని వెనుక కారణం ఏమిటో ఓసారి తెలుసుకుందాం.
వాస్తవానికి ఈ నోటు సుమారు 30 ఏళ్ల నాటిది. ఈ ఒక్క రూపాయి నోటు సంఖ్య 786786. దాని ఉపసర్గ సంఖ్య 56S. ఈ నోటుపై అప్పటి ఆర్థిక శాఖ కార్యదర్శి ఎస్.వెంకటరమణన్ సంతకం చేశారు. ఇలాంటి ఫ్యాన్సీ నంబర్ నోట్లను కొనుగోలు చేసేందుకు చాలా మంది పోటీ పడుతున్నారు. అందుకే ఈ ఒక్క రూపాయి నోటుకు భారీ ధర ఉంది. ఇలాంటి నోట్లను పలు వెబ్‌సైట్లలో వేలం వేయగా.. మంచి మొత్తం వస్తోంది. ఓసారి కొన్న తర్వాత మరోసారి ఆ నోటు భారీ ధరకు వేలంలోకి వచ్చినా ఆశ్చర్యపోనక్కర్లేదు.
Also Read: సరికొత్త కథ అని చెప్పను కానీ.. మనందరి ఇంట్లో జరిగేదే ఈ సినిమా: కిరణ్ అబ్బవరం
Also Read: హైదరాబాద్‌లో బాలికపై సామూహిక అత్యాచారం.. రెండు రోజులుగా ఓయో రూంలో..!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook