Penalty on Social Media: ప్రముఖ సోషల్ మీడియా వేదికలు ఫేస్‌బుక్, ట్విటర్‌లకు రష్యాలో గట్టి షాక్ తగిలింది. నిషేధిత కంటెంట్ తొలగించని కారణంగా ఆ రెండు సంస్థలకు భారీగా జరిమానా విధించింది రష్యా. ఆ జరిమానాలకు కారణమేంటో తెలుసుకుందాం.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

అమెరికా దిగ్గజ టెక్ కంపెనీలు ఫేస్‌బుక్, ట్విటర్‌లకు రష్యా(Russia) మరోసారి గట్టి షాక్ ఇచ్చింది. గత కొద్దికాలంగా రష్యా ప్రభుత్వం విదేశీ టెక్ కంపెనీలకు జరిమానాలు విధిస్తూ వస్తోంది. ఈసారి నిషేధిత కంటెంట్ తొలగించని కారణంగా ఫేస్‌బుక్, ట్విట్టర్ సంస్థలపై జరిమానా విధించింది. యూఎస్ ఆధారిత టెక్ కంపెనీలపై రష్యా ప్రభుత్వం నియంత్రణ రానురానూ కఠినమవుతోంది. ఆ దేశ పార్లమెంట్ ఎన్నికల్లో ఫేస్‌బుక్ జోక్యం చేసుకుందనేది రష్యా ఆరోపణగా ఉంది. 


ఫేస్‌బుక్(Facebook) సంస్థకు మాస్కో కోర్టు 2.12 కోట్ల రూపాయల జరిమానా విధించగా..ట్విట్టర్‌కు 50 లక్షల జరిమానా విధించింది. రష్యాలో ఫేస్‌బుక్‌కు ఇప్పటి వరకూ 9 కోట్ల జరిమానా, ట్విట్టర్‌కు(Twitter) 4.5 కోట్ల జరిమానా పడింది. చట్ట విరుద్ధమైన కంటెంట్‌లను కారణంగా చూపిస్తూ..రష్యా తరచూ ఇంటర్నెట్ ప్లాట్‌ఫామ్‌లపై చర్యలు తీసుకుంటూ వస్తోంది. ఆ దేశ ప్రభుత్వానికి వ్యతిరేకంగా అమెరికన్ టెక్ కంపెనీలు ప్రవర్తిస్తున్నందున ఎప్పటికప్పుడు చర్యలు చేపడుతోంది. చట్ట విరుద్ధంగా లేబుల్ చేసిన కంటెంట్‌లపై అశ్లీల అంశాలు, డ్రగ్స్ ఆధారిత పోస్ట్‌లపై రష్యా ప్రభుత్వం ఉక్కుపాదం మోపుతోందని తెలుస్తోంది. రష్యన్ వినియోగదారుల డేటాను దేశంలో నిల్వ చేయడంలో విఫలమైందనే కారణంతో గూగుల్‌పై(Google) కూడా రష్యా ప్రభుత్వం జరిమానా విధించింది. 


Also read: Viral Video: ఖబర్దార్ హస్బెండ్స్.. అక్రమ సంబంధం పెట్టుకుంటే ఇదే జరుగుతుంది!


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి