Black King Cobras Viral Video: అతి భయంకరమైన పాముల్లో కింగ్ కోబ్రాలు ఒకటి. అవి ఒక్కసారి మనుషుల్ని కాటేస్తే  చనిపోయే అవకాశాలు కూడా ఉన్నాయి. కాబట్టి చాలామంది వాటిని చూసి దూరంగా పారిపోతుంటారు. కింగ్ కోబ్రాల కంటే అతి భయంకరమైన పాములు కూడా ఉన్నాయి. అందులో అతి ప్రమాదకరమైన పాము బ్లాక్ కింగ్ కోబ్రా. దీనిలో ఉండే విషయం చాలా హానికరమైనది. ఇది దాని కోరాల్లో నుంచి నేరుగా విషాన్ని చిమ్మి దాడి చేస్తుంది. కాబట్టి వీటికి పది అడుగుల దూరంలోనే ఉండడం చాలా మంచిది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

కింగ్ కోబ్రాలో నుంచి తీసిన విషాన్ని శాస్త్రవేత్తలు వారి పరిశోధనలు కూడా వినియోగిస్తారు. ముఖ్యంగా వీటి విషాన్ని ఔషధ తయారీలో వాడుతూ ఉంటారు. ప్రస్తుతం చాలామంది వీటిని ఇళ్లల్లో పెంచుకుంటున్నారు. వీటివల్ల హాని ఉన్నప్పటికీ కోబ్రాలను పెంపుడు జంతువుల పెంచుకుంటున్నారు. మరికొందరైతే వాటికి ముద్దులు కూడా పెడుతున్నారు.


సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చినప్పటి నుంచి నెట్టింటా ఈ కింగ్ కోబ్రాలకు సంబంధించిన వీడియోలే వైరల్ గా మారుతున్నాయి. అయితే ఇటీవల వైరల్ గా మారిన వీడియల్లో ఈ పాముల వైరల్ వీడియో కూడా ఉండడం చాలా విశేషం. మీరు ఈ వైరల్ వీడియోని గమనిస్తే ముగ్గురు స్నేక్ చేసి ఉంటారు. వారికి అందిన సమాచారం మేరకు ఓ పాత గృహానికి వెళ్లి అక్కడ ఉన్న పాము పట్టుకునేందుకు ప్రయత్నిస్తారు.



ఇంతలోనే వారికి ఊహించని సంఘటన ఎదురవుతుంది. అయితే నల్ల కింగ్ కోబ్రా పట్టుకునే క్రమంలో అక్కడే దాని పిల్లలు కూడా ఉంటాయి. దీంతో స్నేక్ క్యాచర్స్ ఆ నల్ల కింగ్ కోబ్రాతో పాటు దాని పిల్లల్ని కూడా పట్టుకునేందుకు ప్రయత్నిస్తారు. అంతేకాకుండా వారికి ఆ నల్ల కింగ్ కోబ్రా సులభంగానే పట్టుబడుతుంది. ఇలా వారంతా ఆ పాముల్ని పట్టుకుని సురక్షిత ప్రదేశంలో వదిలేస్తారు.


ఈ వీడియోను KingCobra Hunter అనే యూట్యూబ్ ఛానల్ లో పోస్ట్ చేశారు. ప్రస్తుతం ఈ వీడియోను లక్షకు పైగా వీక్షించారు. అంతేకాకుండా నెటిజన్లు సన్నివేశాలపై భిన్నాభిప్రాయాలు తెలుపుతున్నారు. స్నేక్‌క్యాచార్స్ అందరూ శిక్షణ పొంది పాములను పట్టుకుంటారు. మీరు కూడా పట్టుకునేందుకు ప్రయత్నిస్తే కాటేసే ప్రమాదం ఉంది కాబట్టి జాగ్రత్తగా ఉండండి.


Also Read: Kaala Bhairava: శత్రువులను జయించేందుకు కాలభైరవ పూజ చేయండి.. శనివారం పూజ చేస్తే విజయం మీదే..


Also Read: Team India: ఒకే ఏడాదిలో 8 మంది కెప్టెన్లు.. కేఎల్ రాహుల్ ఫ్లాప్‌ షో.. సెలక్టర్లు ఇలా చేసినందుకే..



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


Android Link https://bit.ly/3P3R74U


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Facebook