Spy Camera In Washroom: చిన్నారులకు ఆటాపాటలతో విద్యాబుద్ధులు బోధించే ప్లేస్కూల్‌లో అత్యంత దారుణ సంఘటన చోటుచేసుకుంది. పాఠశాల మహిళా ఉపాధ్యాయులకు ఘోర పరాభవం ఎదురైంది. వారు వినియోగించే బాత్రూమ్‌లలో రహాస్య కెమెరాలు వెలుగులోకి వచ్చాయి. వాటిని చూసి టీచర్లు తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యారు. వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేయగా కేసు నమోదుచేసి విచారణ చేపట్టగా దర్యాప్తులో విస్తుగొలిపే విషయాలు వెలుగులోకి వచ్చాయి. పాఠశాల నిర్వాహకులే ఆ కెమెరాలు ఉంచారని తెలియడంతో టీచర్లు నిర్ఘాంతపోయారు. పోలీసుల కథనం ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి..


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Also Read: Insta Reel: వ్యూస్‌ కోసం రోడ్డుపై రూ.25 వేలు.. 'మనీ హంటింగ్‌‌' ఆట కట్టించిన పోలీసులు


ఉత్తరప్రదేశ్‌లోని నోయిడా సెక్టార్‌ 70 ప్రాంతంలో లర్న్‌ విత్‌ ఫన్‌ పేరిట ప్లే స్కూల్‌ ఉంది. డిసెంబర్‌ 10వ తేదీ పాఠశాలలోని ఓ టీచర్‌ వాష్‌రూమ్‌కు వెళ్లింది. అక్కడ పని ముగించుకుని తిరిగి వస్తుండగా బాత్రూమ్‌లోని బల్బ్‌ అనుమానాస్పదంగా కనిపించింది. బల్బును తీక్షణంగా చూడగా ఏదో వస్తువు కనిపించింది. మొత్తం బల్బూ తీసి చూడగా ఆ బల్బులోని సాకెట్‌లో రహాస్య కెమెరా కనిపించింది. నిర్ఘాంతపోయి వెంటనే సెక్యూరిటీ గార్డును పిలవగా అది రహాస్య కెమెరా అని నిర్ధారించాడు.


Also Read: Sabarimala: శబరిమల క్షేత్రంలో అయ్యప్ప స్వామి ఆత్మహత్య.. విచారణలో సంచలన విషయాలు


 


వెంటనే సమాచారం అందుకున్న పోలీసులు టీచర్‌ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు. బల్బు సాకెట్‌లో ఉంచిన రహాస్య కెమెరాను గుర్తించారు. విచారణ చేపట్టిన అనంతరం పాఠశాల డైరెక్టర్‌ నవనీష్‌ సహాయ్‌, స్కూల్‌ కో ఆర్డినేటర్‌ పరూల్‌పై అనుమానం వ్యక్తమైంది. వెంటనే వారిని అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టగా దిగ్భ్రాంతికర విషయాలు బయటపడ్డాయి. వాటిని తామే పెట్టామని అంగీకరించారు.


నోయిడీ డీసీపీ శక్తి మోహన్‌ అవాస్తీ కీలక విషయాలను బయటపెట్టారు. నవనీశ్‌ సహాయ్‌ ఆన్‌లైన్‌లో రూ.22 వేలు ఖర్చుచేసి రహాస్య కెమెరాను కొనుగోలు చేసి తెప్పించుకున్నారు. అనంతరం పాఠశాల బాత్రూమ్‌లోని బల్బ్‌ సాకెట్‌లో కెమెరా ఉంచి యథావిధిగా లైట్‌ బిగించాడు. అనంతరం ఆ కెమెరాను నేరుగా తన కంప్యూటర్‌తోపాటు మొబైల్‌ ఫోన్‌కు అనుసంధానం చేసుకున్నాడు. ఎవరైనా వాష్‌రూమ్‌కు వెళ్లిన సమయంలో సీసీ కెమెరా ఆన్‌ అయ్యేలా చేసుకున్నాడు. స్పై కెమెరా లైవ్‌ టెలికాస్ట్‌ చేస్తుంది. రికార్డింగ్‌ సదుపాయం లేదని పోలీసులు గుర్తించారు. ఇంతటి నీచానికి పాల్పడిన నవీనీశ్‌తోపాటు పరూల్‌ను కూడా పోలీసులు రిమాండ్‌కు తరలించారు.



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.