Manichandana Roped in For NTR 30: జూనియర్ ఎన్టీఆర్ హీరోగా నటిస్తున్న 30వ సినిమా మీద ప్రత్యేక దృష్టి పెట్టిన సంగతి అందరికీ తెలిసే ఉంటుంది. కొరటాల శివ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమాలో ఇప్పటికే హీరోయిన్గా బాలీవుడ్ నటి జాన్వీ కపూర్ ఎంపికైంది. ఇక విలన్ పాత్రలో సైఫ్ అలీఖాన్ నటిస్తూ ఉండడంతో ఒక్కసారిగా అందరి దృష్టి ఈ సినిమా మీద పడుతుంది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఇక సైఫ్ అలీ ఖాన్ భార్య పాత్రలో సీరియల్ హీరోయిన్ చైత్ర రాయ్ ని ఎంపిక చేసినట్లుగా ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో ఇప్పుడు మరో ఆసక్తికరమైన వార్త తెరమీదకు వచ్చింది. అదేమిటంటే తెలుగు సినీ పరిశ్రమకు చెందిన సీనియర్ నటి మణి చందన ఈ సినిమాలో జాన్వీ కపూర్ తల్లి పాత్రకు ఎంపికైనట్లు తెలుస్తోంది.


Also Read: Rashmika Mandanna Dating: బెల్లంకొండ డేటింగ్ రూమర్స్ పై రష్మిక సైలెన్స్.. ఎందుకబ్బా?


తొలి ప్రేమ సినిమాతో నటిగా ఎంట్రీ ఇచ్చిన మణి చందన ఆ తర్వాత అనేక తెలుగు కన్నడ సినిమాల్లో భాగమయ్యారు. చివరిగా నిజం సినిమాలో రత్తాలు అనే పాత్రలో కనిపించిన ఆమె ఆ తరువాత సినిమాలకు దూరమైంది. ఆ తర్వాత ఉంగరాల రాంబాబు అనే సినిమాతో రీఎంట్రీ ఇచ్చి సపోర్టింగ్ క్యారెక్టర్స్ లో నటిస్తోంది. ఆ తర్వాత ఆచారి అమెరికా యాత్ర, బుర్రకథ వంటి సినిమాల్లో నటించిన ఆమె నాంది సినిమాలో మీనాక్షి తల్లి పాత్రలో కూడా నటించింది. ఇప్పుడు ఆమె జూనియర్ ఎన్టీఆర్ 30వ సినిమాలో జాన్వీ కపూర్ తల్లి పాత్రలో నటిస్తోంది. ఇక ఎన్టీఆర్ 30 సినిమాని యువ సుధా ఆర్ట్స్ బ్యానర్ తో కలిసి ఎన్టీఆర్ ఆర్ట్స్ సంస్థ నిర్మిస్తోంది.


మిక్కిలినేని సుధాకర్, కొసరాజు హరికృష్ణ నిర్మాతలుగా వ్యవహరిస్తున్న ఈ సినిమాకి అనిరుధ్ రవిచంద్రన్ సంగీతం అందిస్తున్నాడు. ఇప్పటికే రెండు షెడ్యూల్స్ షూటింగ్ కూడా పూర్తయిన ఈ సినిమా మీద పాన్ ఇండియా రేంజ్ లో భారీ అంచనాలున్నాయి. కచ్చితంగా ఈ సినిమాతో సూపర్ సక్సెస్ అందుకుంటామని సినిమా యూనిట్ చాలా కాన్ఫిడెంట్ గా ఉంది. అయితే రాజమౌళి సినిమా సెంటిమెంట్ వెంటాడుతూ ఉండడంతో సినిమా మీద చాలా జాగ్రత్తలు అయితే తీసుకుంటూ ముందుకు వెళుతున్నారు. చూడాలి మరి ఏం జరగబోతుంది అనేది.


Also Read: Ileana Dcruz Baby Bump: బేబీ బంప్ వీడియో షేర్ చేసిన ఇలియానా.. ఇంతకీ తండ్రెవరు?


 



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook