Shiva lingam appeared in sky: సూర్యాపేట: జిల్లాలోని నేరేడుచర్లలో బుధవారం ఉదయం ఆకాశంలో ఓ అద్భుత దృశ్యం ఆవిష్కృతమైనట్టు వాట్సాప్‌లో ఫేస్‌బుక్, ట్విటర్ వంటి సామాజిక మాథ్యమాల్లో ఓ ఫోటో వైరల్ అవుతోంది. బుధవారం తెల్లవారుజామున సూర్యోదయం సమయంలో నేరేడుచర్లలోని సోమప్ప సోమేశ్వర స్వామి ఆలయం వద్ద నల్ల మబ్బులన్నీ ఒక్కచోట చేరి శివ లింగం (Shiva lingam) ఆకారంలో ఏర్పడినట్టుగా ఆ ఫోటోలో కనిపిస్తోంది.  


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

అమావాస్య అంటేనే శివుడికి ప్రీతిపాత్రమైన రోజుల్లో ఒకటిగా చెబుతుంటారు. అమావాస్య నాడు శివుడిని దర్శించుకున్నా (Shiva puja on Amavasya day), శివాలయంలో నిద్ర చేసినా మంచి ఫలితాలు కనిపిస్తాయనేది భక్తుల బలమైన విశ్వాసం. అందుకే అమావాస్య నాడు ఇలా ఆకాశంలో మబ్బులు శివ లింగం ఆకారంలో ఏర్పడటం, ఆ దృశ్యాన్ని చూసే భాగ్యం రావడం అదృష్టం అంటూ నెటిజెన్స్ కామెంట్స్ పెడుతున్నారు. 


Also read : Navratri 2021: దేవీ నవరాత్రుల ఉపవాసంలో పొరపాటున కూడా ఈ తప్పులు చేయకండి


మొదట ఆ దృశ్యాన్ని చూసిన ఓ ఆలయ పూజారి (Temple priest) ఆ విషయం నలుగురికి తెలిజేయడంతో ఆ దృశ్యాన్ని చూసేందుకు భక్తులు పోటీపడినట్టు సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. అయితే, దీనిని ఫోటోమార్ఫింగ్ అని కొట్టిపారేస్తున్న వాళ్లు కూడా లేకపోలేదు.


Also read : Bathukamma 2021 festival: బతుకమ్మ పండగ సంబరాలు షురూ


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook