Snake Viral Video: సోషల్ మీడియాలో పాములకు సంబంధించిన చాలా వీడియోలు వైరల్ అవుతుంటాయి. కానీ షూస్‌లో కోబ్రా దాక్కుని ఉండటం ఎప్పుడైనా చూశారా..వింటేనే ఒళ్లు జలదరిస్తోందా..


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

సోషల్ మీడియాలో వైరల్ అయ్యే వీడియోల్లో కొన్ని షాకింగ్‌గా ఉంటాయి. చూస్తుంటే ఒళ్ళు జలదరింపజేస్తాయి. జంతు జీవాలకు సంబంధించిన వీడియోలు చాలా విస్తృతంగా వైరల్ అవుతుంటాయి. పాములకు సంబంధించి వీడియోలైతే ఇంకా ఆసక్తి రేపుతుంటాయి. అయితే ఈ వీడియో చూస్తే మాత్రం పై ప్రాణాలు పైకే పోయినట్టవుతుంది. ఈ వీడియోలో కోబ్రా ఏకంగా షూస్ లోపల దాక్కుని ఉంటుంది. 


వింటేనే ఒళ్లు జలదరిస్తుంది కదూ..ఇక చూస్తే ప్రాణం పోయినట్టవుతుంది. ఈ వీడియోలో ఒక స్నేక్ రెస్క్యూవర్ ఒక ఇంట్లో వెళ్తాడు. అక్కడొక షూస్ కన్పిస్తాయి. అందులోంచి కోబ్రా ఒకటి తొంగి చూస్తుంటుంది. స్నేక్ క్యాచర్, పాముకీ మధ్య కాస్సేపు సంఘర్షణ నడుస్తుంది. కోబ్రాను షూస్‌లోంచి తీసేందుకు ప్రయత్నిస్తుంటాడు. అటు కోబ్రా పడగ విప్పి కాటేసేందుకు ఎటాక్ చేస్తుంటుంది. మొత్తానికి కోబ్రాను బయటకు తీస్తాడు.



ఈ వీడియోను సోషల్ మీడియో వేదికైన యూట్యూబ్‌లో షేర్ చేయగా..పెద్దఎత్తున వైరల్ అవుతోంది.షేర్ చేసిన కాస్సేపటికే వేలాదిగా వీక్షించారు. ఇప్పటి వరకూ 64 వే మంది ఈ వీడియోను చూశారు. అందుకే చెప్పులు, షూస్ తొడిగే ముందు లేదా హ్యాంగర్‌కు తగిలించిన బట్టలు వేసుకునేముందు 2- 3 సార్లు విదిల్చి..చెక్ చేసి వేసుకోవడం మంచిది. లేదంటే ఒక్క కాటులో ప్రాణాలు పోతాయి.


Also read: Mosquito Repellent Apps: దోమల బెడదకు చెక్ చెప్పే మస్కిటో కిల్లర్ మొబైల్ యాప్స్...<



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


Android Linkhttps://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter , Facebook