Viral Video: ఉదయం లేచి వ్యాయామం చేయడం చాలా మందికి అలవాటు ఉంటుంది. ఓ వ్యక్తి చేసిన వ్యాయామం​ వీడియో ఒకటి ఇప్పుడు వైరల్ అవుతోంది. అదేమిటి వ్యాయామం చేస్తే కూడా వైరల్ అవుతుందా అనేగా మీ సందేహం?


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

అయితే అసలు కథేమిటో తెలుసుకుందాం పదండి..


వ్యాయామం చేస్తే అది సర్వ సాధారణమైన విషయం కాబట్టి అలాంటి వీడియోలు వైరల్ అవకపోవచ్చు. కానీ ఓ వ్యక్తి 12వ అంతస్తు బాల్కనీ బయట రేలింగ్​కు వేలాడుతూ వ్యాయం చేశాడు. దీనితో ఇప్పుడు దీనికి సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది.


బాల్కని బయట.. రేలింగ్​కు ప్రమాదకరంగా వేలాడుతూ కొద్దిసేపు వ్యాయామం చేసిన ఆ వ్యక్తి.. ఫ్లాట్​లోపలి నుంచి వచ్చిన మరో వ్యక్తి అతడిని పిలవగా.. లోపలికి వెళ్లాడు.


ఆ వ్యక్తి వ్యాయామం చేస్తున్న సమయంలో రేలింగ్​ నుంచి చేతుల పట్టు తప్పినా.. కాళ్లు జారినా ఆ వ్యక్తి ప్రాణాలతో ఉండే వాడు కాదు. ఈ తతంగాన్నతా ఎదురు బిల్టింగ్​లో ఓ వ్యక్తి వీడియో తీశాడు.


ఎక్కడ జరిగింది..


హరియానా లోని గ్రేటర్​ ఫరిదాబాద్​, సెక్టార్​-82లో ఉన్న గ్రాండ్యూరా సొసైటీ అపార్ట్​మెంట్స్​ ఈ బ్లాక్​లో ఈ ఘటన చోటు చేసుకున్నట్లు తెలిసింది. ఈ విషయంపై సొసైటీ అధ్యక్షుడు వివరణ కూడా ఇచ్చాడు.


ఆ ప్లాట్​లో ఉంటే 56 ఏళ్ల వ్యక్తి ఇలా చేసినట్లు తెలిపాడు. ఆ వ్యక్తికి మతిస్థిమితం సరిగా లేదని అందుకే ఇలా చేసి ఉంటాడని వివరణ ఇచ్చాడు. ఈ విషయం స్థానిక అధికారుల దృష్టికి వెళ్లడంతో ఆ వ్యక్తి కుటుంబ సభ్యులను హెచ్చరించినట్లు కూడా సమాచారం.



ఇటీవలే ఇలాంటి ఘటన..


ఇటీవలే ఫరిదాబాద్​లోనే ఓ అపార్ట్​మెంట్​లో.. ఓ మహిళ తన చీరకోసం కొడుకుని బెట్​షీట్​తో ప్రమాదకరంగా 10వ అంతస్తు నుంచి తొమ్మిదవ అంతస్తులోకి దించి.. మళ్లీ పైకి లాగిన ఘటన చోటు చేసుకుంది. 9వ ఫ్లోర్​ లాక్​ చేసి ఉండటంతో ఇలా చేసింది.


ఈ ఘటనకు సంబంధించిన వీడియో వైరల్ అవుతుండగా.. మళ్లీ అలాంటి ఘటన ఇంకోటి చోటు చేసుకోవడం ఆందోళనరమైన విషయమంటున్నారు నెటిజన్లు.


Also read: Snake Vs Rabbit Video: పాముతో యుద్ధానికి తలపడిన కుందేలు.. చివరికి ఏం జరిగిందంటే?


Also read: Bike accident: ట్రైన్-బైక్​​ యాక్సిడెంట్ ఒకే ప్రాంతంలో రెండు సార్లు.. వీడియో వైరల్​!


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. 


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook