Shocking Video: సాంకేతికత పెరిగిన నేపథ్యంలో మనలో చాలా మంది స్మార్ట్ ఫోన్స్ ను వాడుతున్నారు. దీంతో వారి చుట్టుపక్కల జరిగే ఆసక్తికర పరిణామాలను తమ మొబైల్స్ లో చిత్రీకరిస్తున్నారు. అలా కొన్ని షాకింగ్ వీడియోస్ ఇంటర్నెట్ లో నిత్యం వైరల్ గా మారుతున్నాయి. అలాంటి ఒక విచిత్రమైన వీడియో సోషల్ మీడియాలో ఇప్పుడు వైరల్ గా మారింది. ఓ మహిళ ఫోన్ మాట్లాడుకుంటూ ట్రైన్ పట్టాలపై పడుకుంది. కానీ, ఆమెకు ఎలాంటి గాయాలు కాలేదు. అదెలాగో తెలియాలంటే ఈ స్టోరీ చదవాల్సిందే. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

రైల్వే ట్రాక్‌పై ఫోన్ మాట్లాడుతూ..


మొబైల్ మాట్లాడుతూ రోడ్లపై నడవడం లేదా వాహనాలను డ్రైవ్ చేయడం చాలా ప్రమాదకరమని ఎన్నో ప్రమాదాల ద్వారా తెలిసొస్తుంది. కానీ, ఇప్పుడు ఓ విచిత్రమైన సంఘటన ఓ రైల్వే స్టేషన్ లో జరిగింది. ఓ మహిళ రైల్వే ట్రాక్ పై వెళ్తుండగా.. అకస్మాత్తుగా ఆమె పై నుంచి రైలు వెళ్లింది. 


అయితే ఈ ఘటనలో ఆ మహిళ ట్రాక్ మధ్యలో పడుకొని ఉంది. ట్రైన్ వెళ్లిన వెంటనే.. తనకు ఏమి జరగనట్టుగా సరదగా ఫోన్ మాట్లాడుకుంటూ వెళ్లింది. కానీ, ఈ ప్రమాదంలో ఆమెకు ఎలాంటి గాయాలు కాకపోవడం గమనార్హం. ఈ షాకింగ్ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. 



ఈ వీడియోను ఐపీఎస్ అధికారి దీపాంశు కబ్రా తన అధికారిక ట్విట్టర్ ఖాతాలో షేర్ చేశారు. ఈ వీడియోను షేర్ చేస్తున్నప్పుడు.. వీడియోలో ఉన్న మహిళకు ఫోన్ మాట్లాడడం మరింత ముఖ్యంగా ఉందని వ్యంగ్యంగా కామెంట్ చేశారు. ఈ వీడియోను ఇప్పటివరకు 57 వేలకు పైగా వీక్షించారు. 


Also Read: Viral Puzzle: ఈ చిత్రంలో ఎన్ని 3 అంకెలు ఉన్నాయో చెప్పగలరా?


Also Read: Thirsty Monkey Video: వానరానికి దాహార్తి తీర్చిన ట్రాఫిక్ పోలీస్.. నెటిజన్లు ఫిదా!


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook