Gurugram SUV Bike Accident Video:  పెరిగిన రోడ్డు ప్రమాదాల దృష్ట్యా ఎన్నో హెచ్చరికలు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చేస్తూనే ఉన్నాయి. సోషల్‌ మీడియాలో కూడా మనం భయానక యాక్సిడెంట్‌ దృశ్యాలు చూస్తూనే ఉంటాం. అయినా కానీ, యాక్సిడెంట్‌ ఘటనలు మన దేశంలో ఆగటం లేదు. మొన్న ఆ మధ్య కాలంలో పూనే పోర్షే కారు ఘటన వైరల్‌ అయిన సంగతి తెలిసిందే. అయితే, ఆ కారు ప్రమాదానికి కారణమైన మైనర్‌ను రక్షించడానికి కుటుంబ సభ్యులు ఎన్నో ప్రయత్నాలు చేశారు. ఇదిలా ఉండగా తాజాగా ఓ ఎస్‌యూవీ బైకర్‌ను రాంగ్‌రూట్లో వచ్చి ఢీకొట్టడంతో అతడు ప్రాణాలు వదిలాడు. ఈ భయంకరమైన దృశ్యం సోషల్‌ మీడియాలో ప్రస్తుతం వైరల్‌గా మారింది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఈ ఎస్‌యూవీ బైకర్‌ యాక్సిడెంట్‌ గత వారం ఆదివారం సాయంత్రం బెల్వదరే పార్క్‌, డీఎల్‌ఎఫ్‌ ఫేజ్‌ II గురుగ్రామ్‌లో చోటుచేసుకుంది. ఈ వీడియోలో రాంగ్‌ రూట్‌లో వస్తున్న ఎస్‌యూవీ కారు, అతివేగంతో బైక్‌పై వేళ్తున్న అక్షత్‌ గార్గ్‌ అనే యువకుడిని ఢీకొట్టింది. దీంతో అతడు కారుకు వెనుకవైపు ఎగిరి పడ్డాడు. అతని వెనుకే వస్తున్న స్నేహితులు వెంటనే ఆస్పత్రికి తీసుకెళ్లారు కానీ, అతడు ప్రాణాలు కోల్పోయాడు. ఈ వీడియోను అతని వెనుక మరో బైక్‌పై ఉన్న తోటి స్నేహితులు తమ గోప్రో కెమెరాలో షూట్‌ చేశారు, సోషల్‌ మీడియాలో షేర్‌ చేశారు. ప్రస్తుతం ఆ వీడియో వైరల్‌ అయింది. ఈ భయానక వీడియో చూసిన నెటిజన్లు రకరకాలుగా కామెంట్లు కూడా పెడుతున్నారు.


ఇదీ చదవండి: ఎయిర్‌టెల్ రూ.84 ప్లాన్ తో మీ స్మార్ట్ ఫోన్ టీవీలా మారిపోనుంది.. ఉచితంగా 22 ఓటీటీ యాప్స్‌..  


ఆదివారం హరియాణాలోని గురుగ్రామ్‌లో జరిగిన ఈ ఘటనలో మహీంద్రా 3XO SUV గా గుర్తించారు. ఈ యాక్సిడెంట్ సమయంలో కారులో ఇద్దరు వ్యక్తులు ఉన్నారు. యాక్సిడెంట్‌ జరిగిన వెంటనే వెనకే ఉన్న బైకర్‌ స్నేహితులు వెంటనే అతడిని రక్షించడానికి తీవ్ర ప్రయత్నాలు చేశారు. అయినా అతని ప్రాణాలు దక్కలేదు. యాక్సిడెంట్‌ చూసిన వెంటనే స్థానికులు కూడా అక్కడికి చేరుకున్నారు గార్డ్‌ను లేపడానికి అతని స్నేహితులు ఏడుస్తూ ఎంతగానో ప్రయత్నించారు. స్థానికులు వెంటనే అంబులెన్స్‌, పోలీసులకు ఫోను కూడా చేశారు. వెంటనే ఆస్పత్రికి తరలించారు కానీ, జరగాల్సిన ఘోరం జరిగిపోయింది. అతివేగం, రాంగ్‌ రూట్‌ వెరసి ఓ యువకుడి ప్రాణం ఖరీదుగా మారింది.


 


 



 


ఇదీ చదవండి: నోరూరించే ఈ కూరల్లో కూడా ఫోలిక్‌ యాసిడ్‌ పుష్కలం.. ప్రతిరోజూ మీ డైట్లో చేర్చుకుంటే ఎంతో ఆరోగ్యకరం..


ఇక ఈ వీడియోలో చూస్తే బైకర్‌ అయిన అక్షత్‌ గార్గ్‌ కూడా అతివేగంతో బైక్‌ నడుపుతున్నాడు. కానీ, అదే సమయంలో రాంగ్‌ సైడ్‌ నుంచి ఎస్‌యూవీ వచ్చి అక్షత్‌ను ఢీకొట్టింది. అయితే, ఆ యువకుడిని ఢీకొట్టిన కారు ఓ ప్రధాన పార్టీకి చెందినదిగా, ఆ పార్టీ గుర్తు స్టిక్కర్‌ కారుపై ఉన్నట్లు పోలీసులు గుర్తించారు.
 



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


TwitterFacebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.