Folic Acid: నోరూరించే ఈ కూరల్లో కూడా ఫోలిక్‌ యాసిడ్‌ పుష్కలం.. ప్రతిరోజూ మీ డైట్లో చేర్చుకుంటే ఎంతో ఆరోగ్యకరం..

Folic Acid Rich Curries: ఫోలిక్ ఆసిడ్ అంటే విటమిన్ బి 9 ఇది నీటిలో కరిగే విటమిన్ ముఖ్యంగా ఈ ఫోలిక్ యాసిడ్ ఏరా రక్త కణాల ఉత్పత్తిని పెంచుతాయి. ప్రెగ్నెన్సీ మహిళలకు కూడా పోలిక్ యాసిడ్ ఎంతో అవసరం. డైట్లో ఫోలిక్ ఆసిడ్ అంటే మాత్రల్లో కాదు కొన్ని రకాల కూరల్లో కూడా అందుబాటులో ఉంటాయి

1 /7

ఆరోగ్యంగా ఉండటానికి విటమిన్స్, మినరల్స్ పుష్కలంగా ఉండే ఆహారాలు చేర్చుకోవాలి. ముఖ్యంగా ఫోలిక్ యాసిడ్ కూడా పుష్యం ఎంతో ముఖ్యం.  ఫోలిక్ ఆసిడ్ అంటే విటమిన్ బి 9 ఇది నీటిలో కరిగే విటమిన్ ముఖ్యంగా ఈ ఫోలిక్ యాసిడ్ ఏరా రక్త కణాల ఉత్పత్తిని పెంచుతాయి. ఇవి మహిళలకు ఎంతో ముఖ్యం పీరియడ్ సమయంలో బయటికి వెళ్లే రక్త కణాలను ఇవి మళ్లీ ఉత్పత్తి చేస్తాయి. ప్రెగ్నెన్సీ మహిళలకు కూడా పోలిక్ యాసిడ్ ఎంతో అవసరం.  

2 /7

పోలీస్ ఆసిడ్ లేమి వల్ల నీరసం, అనీమియా, ఇమ్యూనిటీ లోపం వేరే ఇతర ప్రాణాంతక వ్యాధులు వస్తాయి అయితే ఆరోగ్యకరమైన పోలిక్ యాసిడ్ డైట్ లో చేర్చుకోవాలి డైట్లో ఫోలిక్ ఆసిడ్ అంటే మాత్రల్లో కాదు కొన్ని రకాల కూరల్లో కూడా అందుబాటులో ఉంటాయి. ప్రతిరోజు మీ ఆహారంలో ఆకుకూరలు, గింజలు, విత్తనాలు డైట్ లో చేర్చుకోవడం వల్ల ఫోలిక్ యాసిడ్ మీకు లభిస్తుంది. అంతే కాదు కొన్ని భారతీయ వంటల్లో కూడా పోలిక్ యాసిడ్ ఉంటుంది అలాంటి కూరలు ఏంటో తెలుసుకుందాం.  

3 /7

పాలక్ పన్నీర్.. పాలక్ పన్నీర్ పాలకూరతో తయారు చేసుకుంటారు. ఇందులో పోలిక్ యాసిడ్ పుష్కలంగా ఉంటుంది ఒక 100 గ్రాముల పాలకూరలో 50 ఎం సి జి ఫోలేట్  ఉంటుంది. దీన్ని పన్నీర్ తో పాటు డైట్ లో చేర్చుకుంటే ఇందులోని ప్రోటీన్స్ కూడా లభిస్తాయి ఇది పోషకాలు పుష్కలంగా కలిగిన కూర అవుతుంది ఇది ఎంతో రుచికరంగా కూడా ఉంటుంది. ఈ కూరను అన్నం, రోటి లో తీసుకోవచ్చు.

4 /7

చోలే.. చోలేలో కూడా ఫోలిక్ యాసిడ్ పుష్కలంగా ఉంటుంది. ఒక కప్పు చోలేలో 172 mcg ఫోలేట్ ఉంటుంది ఎంతో ప్రఖ్యాతి చెందిన నార్త్ ఇండియన్ డిష్. ఇందులో వాడిన చోలే లో ప్రోటీన్స్ పుష్కలంగా ఉంటాయి. వీటిని టమాటాలు వేసి గ్రేవీ రూపంలో తయారు చేసుకుంటారు. ఇందులో ధనియాలు, జీలకర్ర, గరం మసాలా వేసి చేసుకోవటం వల్ల ప్రోటీన్ పోలేట్ రెండు సమతుల ఆహారంగా మారుతాయి.

5 /7

సాంబార్.. సౌత్ ఇండియన్ లో ప్రఖ్యాతిగాంచిన ఈ సాంబార్లో వివిధ రకాల పప్పులను వేసి కూరగాయలతో తయారు చేసుకుంటారు. ఇందులో చింతపండు కూడా వేస్తారు. పప్పులో ఫోలిక్ యాసిడ్ పుష్కలంగా ఉంటుంది. 480 ఎంసీజీ  ఫోలేట్ ఒక కప్పులో ఉంటుంది ఇందులో ఉపయోగించే క్యారట్, బీన్స్ కూడా పోలిట్ బూస్ట్ చేస్తాయి ఇది ఎంతో రుచికరంగా ఉంటుంది. ఈ సాంబార్  అన్నం లేదా ఇడ్లీలో వేసుకొని తీసుకుంటారు ఇది సమతుల్య ఆహారంగా పనిచేస్తుంది.

6 /7

రాజ్మా.. రాజ్మా కిడ్నీ బీన్స్ తో తయారు చేస్తారు. ఇది ఫోలిక్ యాసిడ్ పుష్కలంగా కలిగి ఉంటుంది. ఒక కప్పు రాజ్మాలో ఫోలిక్‌ యాసిడ్ కలిగి ఉంటుంది. టమాటా తో తయారు చేసుకుంటారు . రాజ్మాను రైస్ , రోటీలో తీసుకుంటారు. ఇందులో ఫైబర్ ప్రోటీన్ ఐరన్ కూడా పుష్కలంగా ఉంటుంది.  

7 /7

మేతి మలై మటర్.. మేతి మలై మటర్ లో రుచికరంగా ఉండటమే కాకుండా వీటిని మెంతి ఆకులతో తయారు చేసుకుంటారు. కాబట్టి ఎంతో రుచిగా ఉంటుంది. ఇందులో గ్రీన్ పీస్ కూడా ఉపయోగిస్తారు. ఇందులో ఫోలెట్‌ పుష్కలంగా ఉంటుంది మన శరీరానికి తగినంత ఫోలెట్ అందిస్తుంది. మన శరీరానికి కావలసిన ఫోలేట్ తీసుకుంటూనే రుచికరమైన ఆహారాన్ని ఆస్వాదించవచ్చు.