King Cobra Attack: సోషల్ మీడియాలో జంతువులు, భయంకరమైన పాముల వీడియోలు ఎక్కువగా వైరల్ అవుతుంటాయి. రెప్పపాటులో భయంకరమైన కింగ్ కోబ్రా పాము నుంచి ఎలా తప్పించుకున్నాడో చూస్తే..ఒళ్లు జలదరించడం ఖాయం..


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

సకల చరాచర లోకంలో భయంకరమైన పాములు, జంతు జీవాలు చాలా ఉంటాయి. భయంకర జీవాలతో మనిషికి ఎంత భయమో..అలాంటి వీడియోలను అంతే ఆసక్తిగా వీక్షిస్తుంటారు. కొన్ని వీడియోలైతే భయం గొలుపుతుంటాయి. ఒళ్లు గగుర్పాటుకు లోనవుతుంది. పదే పదే చూస్తే..రాత్రి కలలో వచ్చి భయపెట్టడం ఖాయం. అంతటి భయంకరమైన పాముల వీడియోలు సహజంగానే వైరల్ అవుతుంటాయి.


అలాంటిదే ఓ షార్ట్ వీడియో వైరల్ అవుతోంది. నడిరోడ్డుపై తిరుగుతున్న 12-13 అడుగుల భారీ కింగ్ కోబ్రా పాముని పట్టుకునే క్రమంలో..రెప్పపాటులో కింగ్ కోబ్రా దాడి నుంచి ఎంత వేగంగా తప్పించుకున్నాడో చూస్తే ఒళ్లు జలదరిస్తుంది. రోడ్డుపై పడగ విప్పి సంచరిస్తున్న భారీ సైజులో ఉన్న కింగ్ కోబ్రాను ఓ స్నేక్ కేచర్ సునిశితంగా పరిశీలిస్తూ..పట్టుకుంటాడు. ఇలా పట్టుకోగానే నేరుగా మెరుపు వేగంతో పడగతో ముఖంపై కాటేసేందుకు ప్రయత్నిస్తుంది. అయితే ఇది ఊహించిన ఆ స్నేక్ కేచర్ అంతే వేగంతో తల భాగాన్ని వెనక్కి వంచి కాటు నుంచి తప్పించుకుంటూనే ఆ పామును నియంత్రిస్తాడు.ఈ వార్త చదువుతుంటేనే భయం గొలుపుతుంటే..వీడియో చూస్తే ఇక చెమట్లు పట్టడం ఖాయం. అతడి గుండె ధైర్యానికి మెచ్చుకోవచ్చు. ఎంత లాఘవంగా కింగ్ కోబ్రాను పట్టుకోవడం, దాడి నుంచి తప్పించుకోవడం అతడికే చెల్లింది. అందుకే ఈ వీడియో ఇప్పుడు వైరల్ అవుతోంది.



Also read: Catching Black Cobra: అత్యంత భయంకరమైన బ్లాక్ కోబ్రాను..ఎంత సులభంగా పట్టేశాడో..అతడి తెగువకు హ్యాట్సాఫ్



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook