Shocking video today: సాధారణంగా సామాజిక మాధ్యమాలలో మనుషులకు సంబంధించిన వీడియోల కంటే వన్యప్రాణులకు సంబంధించిన వీడియోలు ఎక్కువగా వైరల్ అవుతూ ఉంటాయి. నెటిజన్లు కూడా అలాంటి వాటికి ఎక్కువ ఆసక్తి చూపిస్తూ ఉంటారు.. తాజాగా అలాంటి ఒక వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అయింది,  ఆ వీడియో కనుక మీరు చూస్తే మీకు కూడా ఆశ్చర్యం కలుగుతుంది. ఎందుకంటే డైనోసార్ యూఎస్ఏ ఫ్యాన్ క్లబ్ అని ఉన్న ఇంస్టాగ్రామ్ అకౌంట్ నుంచి పోస్ట్ చేయబడిన సదరు వీడియోలో డైనోసార్ లాంటి ఒక జంతువు తన దగ్గరికి వచ్చిన ఒక వ్యక్తిని మింగడానికి ప్రయత్నిస్తూ కనిపించింది. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

అదేమిటి డైనోసార్లు ఎప్పుడో అంతరించిపోయాయి కదా మరి ఇప్పుడు ఒక వ్యక్తిని డైనోసార్ మింగడానికి ఎలా ప్రయత్నించింది అనే విషయం మీద మీకు అనుమానం కలగవచ్చు.. కానీ డైనోసార్ ని పోలివున్న జంతువే అలా చేయడంతో ఇప్పుడు నెటిజెన్లు ఆ వీడియో పై భిన్నంగా స్పందిస్తున్నారు. రోడ్డుపై డైనోసార్ లాంటి ఒక జంతువు కనిపించడంతో దానిని చూడటానికి రోడ్డుకు ఇరు వైపులా కూడా చాలామంది జనం కూర్చుని కనిపిస్తున్నారు. 



అయితే ఈ సమయంలోనే ఒక వ్యక్తి ఆ డైనోసార్ కి ఆహారం అందించడానికి ప్రయత్నిస్తున్న సమయంలో ముందు చేతిని కొరకడానికి తర్వాత వ్యక్తిని మొత్తాన్ని మింగడానికి డైనోసార్ ప్రయత్నించడంతో చుట్టుపక్కల ఉన్న మిగతా వాళ్ళు అతనిని రక్షించే ప్రయత్నం చేస్తున్నారు. ఎన్నో వందల సంవత్సరాల క్రితం అంతరించిపోయిన డైనోసార్లు మళ్లీ బతికి వచ్చాయి అంటే ఎవరు నమ్మరు కానీ ఇదేదో ఎంటర్టైన్మెంట్ షోలో డైనోసార్ వేషం వేసుకున్న మనిషి ఇలా చేసి ఉండి ఉండవచ్చు అంటూ నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు. మరి ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా వీడియో చూసి మీకు ఏమనిపించిందో ఇక్కడ కామెంట్ చేయండి.


Also Read: Upasana Konidela: పిల్లల్ని కనొద్దన్న సద్గురు.. ఉపాసన ఏమన్నారో తెలుసా?


Also Read:  R Narayana Murthy Mother Death: ఆర్‌ నారాయణ మూర్తికి మాతృవియోగం!



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి. Twitter , Facebook