Video of Crocodile attack on Man: ఇంటర్నెట్, సోషల్ మీడియా లేని రోజుల్లో డిస్కవరీ, నేషనల్ జియోగ్రఫీ, యానిమల్ ప్లానెట్ వంటి టీవీ ఛానెళ్లలో మాత్రమే జంతువుల వీడియోలు వీక్షించేందుకు అవకాశం ఉండేది. ఎప్పుడైతే ఇంటర్నెట్ విస్తృతి పెరిగి.. సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చిందో.. నిత్యం బోలెడన్నీ వీడియోలు దర్శనమిస్తున్నాయి. తాజాగా ఓ మొసలి (Crocodile) మనిషిపై దాడికి యత్నించిన వీడియో ఇంటర్నెట్‌లో వైరల్‌గా మారింది. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఆ వీడియోను గమనిస్తే... మొసలి నీళ్లలో ఉండగా... ఓ వ్యక్తి ఒడ్డున నిలబడి దానికి ఆహారాన్ని అందించేందుకు ప్రయత్నిస్తున్నాడు. మొసలి ఒక్కసారిగా నీళ్లల్లో నుంచి పైకి లేచి.. దాన్ని అందుకోవడానికి ప్రయత్నించడంతో.. జడుసుకుని అతను కిందపడిపోయాడు. వెంటనే ఆ మొసలి అతని కాలిని అందుకునేందుకు ప్రయత్నించింది. అయితే ఎలాగోలా మొత్తానికి అతను దాని దాడి నుంచి తప్పించుకోగలిగాడు. చేతిలో పట్టుకున్న ఆహారాన్ని మొసలికి విసిరేసి.. అతను దాని నుంచి దూరం జరిగాడు.


డిస్కవర్ షార్క్స్ అనే ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ద్వారా ఈ వీడియో (Viral Video) అప్‌లోడ్ అయింది. ఇప్పటివరకూ 8లక్షల పైచిలుకు మంది వీడియోను వీక్షించారు. వీడియోపై నెటిజన్లు రకరకాల కామెంట్స్ చేస్తున్నారు. 'చావును దగ్గరగా చూశాడు...' అని ఓ నెటిజన్ కామెంట్ చేయగా... 'ఇదేం పిచ్చి పని... కొంచెమైతే మొసలి చేతిలో చనిపోయేవాడు..' అని మరో నెటిజన్ కామెంట్ చేశాడు. కొంతమంది అతని సాహసానికి ఆశ్చర్యం వ్యక్తం చేయగా... మరికొందరు ఇలాంటి దుస్సాహాసాలు ప్రాణాల మీదకు తెస్తాయని హెచ్చరించారు.



 


Also Read: NeoCov Virus: నియోకోవ్ అన్ని కరోనా వేరియంట్స్ కంటే ప్రాణాంతకమా?.. శాస్త్రవేత్తలు ఏమంటున్నారంటే?


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. 


 


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook