Smartphone Battery Killer Apps: స్మార్ట్‌ఫోన్‌ మన జీవితంలో ఓ ముఖ్యమైన భాగంగా మారింది. ఇప్పుడు ప్రతి విషయం స్మార్ట్‌ఫోన్ నుంచి తెలుసుకోవచ్చు. అయితే విషయానికి అనుగుణంగా ప్రతిదానికీ ఒక యాప్ కనిపెట్టారు. ప్రస్తుతం రైలు టిక్కెట్ల‌ నుంచి డేటింగ్ వరకు యాప్‌లు అందుబాటులోకి వచ్చాయి. ఈ యాప్‌లు ఫోన్‌లో పని చేయాలంటే స్టోరేజ్,  బ్యాటరీ  ఎంతో ముఖ్యం. ఫోన్‌లో అన్ని యాప్‌లు ఒక్కసారిగా వినియోగిస్తే.. బ్యాటరీ త్వరగా ఖాళీ అవుతుంది. pcloud అందించిన నివేదిక ప్రకారం..ప్రతి ఫోన్‌లో బ్యాటరీని ఖాళీ అయ్యేందుకు 20 యాప్‌లు కారణమని చెబుతుంది. ఇందులో చాలా డేటింగ్ యాప్స్ ఉన్నాయి. ఇప్పుడు వాటి గురించి తెలుసుకుందాం...


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ప్రస్తుతం ఈ యాప్‌లకు ఎక్కువ డిమాండ్ ఉంది:


Facebook, Instagram, Snapchat, YouTube, WhatsApp, LinkedIn యాప్స్‌ పని చేయడానికి ఫోటోలు, WiFi, లొకేషన్, మైక్రోఫోన్ వంటి 11 అదనపు ఫీచర్‌ల కోసం ఫోన్‌
బ్యాక్‌గ్రౌండ్‌లో మనం వీటిని అనుమతిస్తాం. ఈ యాప్‌లు పనిచేయడానికి ఎక్కువ బ్యాటరీ అవుతుంది. వీటన్నింటిలో ఇన్‌స్టాగ్రామ్ మాత్రమే డార్క్ మోడ్ ఆప్షన్‌ అందుబాటులో ఉంది. కావున దీనితో పెద్దగా  బ్యాటరీ త్వరగా తగ్గిపోదు.


ఆన్‌లైన్ డేటింగ్ యాప్‌లు:


ఆన్‌లైన్ డేటింగ్ యాప్‌లు ఫోన్‌లోని బ్యాటరీని చాలా త్వరగా ఖాళీ చేస్తున్నాయని pcloud అధ్యయనం వెల్లడించింది. టిండెర్, బంబుల్, గ్రైండర్ వంటి ఆన్‌లైన్ డేటింగ్ యాప్‌లలో 15శాతం బ్యాటరీని వినియోగిస్తాయని తెలిపింది. ఈ మూడు డేటింగ్ యాప్‌ల్లో డార్క్ మోడ్ అందుబాటులో లేనందున వా టిని ఉపయోగిస్తున్నప్పుడు ఎక్కువ బ్యాటరీ అవసరమవుతుంది. దీని వల్ల బ్యాటరీ త్వరగా తగ్గిపోతోంది.



ఈ 20 యాప్‌లు ఎక్కువ బ్యాటరీని లాగేస్తున్నాయి:


pcloud అధ్యయనం ప్రకారం.. ఫోన్‌లో ఈ 20 యాప్‌లు ఎక్కువ బ్యాటరీని తగ్గిస్తున్నాయి. ఆ యాప్‌లు ఇవే.. Fitbit, Verizon, Uber, Skype, Facebook, Airbnb, Bigo Live, Instagram, Tinder, Bumble, Snapchat, WhatsApp, Zoom, YouTube, Booking.com, Amazon, Telegram, Grinder, Like, LinkedIn.


Also Read: Rain Alert: తెలుగు రాష్ట్రాల వెదర్ అలర్ట్.. రాబోయే రెండు రోజులు భారీ వర్షాలు!


Also Read: Hyderabad MMTS: ఎంఎంటీఎస్ ప్రయాణికులకు గుడ్ న్యూస్.. నేటి నుంచి టికెట్ ధరల తగ్గింపు...


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్.. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe


Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.