Huge King Cobra In Kitchen Viral Video: తరచుగా మనం సోషల్ మీడియాలో సరిస్కృపాలు, ఇతర జంతువులకు సంబంధించిన వీడియోలే ఎక్కువగా చూస్తూ ఉంటాము. ఇందులో భాగంగా ఎవరు పాముల వీడియోలు షేర్ చేసిన కొన్ని నిమిషాల్లోనే వైరల్ అవుతున్నాయి. ముఖ్యంగా కొంతమంది స్నేక్ క్యాచేర్స్ వారు పట్టుకునే పాములను వీడియోల రూపంలో చిత్రీకరించి పోస్ట్ చేసిన వీడియోలు విపరీతంగా సోషల్ మీడియాలో కనిపిస్తూ ఉంటున్నాయి. అలాగే కొంతమంది అనుకోకుండా పాములను చిత్రీకరించి సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన కొన్ని వీడియోలు కూడా అప్పుడప్పుడు కనిపిస్తున్నాయి. ఇలా పాములకు సంబంధించిన ఏ వీడియోలైనా సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతున్నాయి. వీటినే జనాలు ఎక్కువగా చూసేందుకు ఆసక్తి చూపుతున్నారని సమాచారం. అయితే ఇటీవల ఓ కింగ్ కోబ్రా కు సంబంధించిన వీడియో విపరీతంగా సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

సాధారణంగా పాములు అడవుల్లోని చిత్తడి ప్రదేశాల్లో ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి. అయితే కాలుష్యం పెరుగుతున్న కొద్దీ అడవులు తగ్గడంతో పాములు ఇతర జంతువులు మనుషులు జీవించే ప్రదేశాల్లోకి సంచారం చేస్తున్నాయి. ఇందులో భాగంగానే ఇటీవలే పాము అడవి పరివాహక ప్రాంతంలో ఉండే ఓ ఇంట్లోకి చొరబడింది. అంతేకాకుండా ఇంట్లో ఉండే వంట గదిలోకి వెళ్లి పప్పు డబ్బాల పక్కన నతికింది. 


అయితే ఇంతలోనే దీనిని గమనించిన ఆ ఇంటి యజమానులు వెంటనే స్నేక్ క్యాచర్స్ కి ఇన్ఫర్మేషన్ అందించారు. వారు అక్కడికి చేరుకొని ఆ పామును పట్టుకునే ప్రయత్నం చేశారు. కొద్దిసేపు పాము వారికి చిక్కకుండా పారిపోయే ప్రయత్నం కూడా చేసిందట. అయితే స్నేక్ క్యాచర్స్‌ ఎంతో కష్టపడి ఆ పాముని పట్టుకున్నట్లు సమాచారం. దీనికి సంబంధించిన ఓ వీడియో క్లిప్ ఇప్పుడు సోషల్ మీడియాలో ఊహించని స్థాయిలో వైరల్ అవుతుంది. 





వీడియోలు ఆ పాము పప్పు డబ్బాల వెనక అటు ఇటు చూస్తూ బుసలు కొట్టడం మీరు గమనించవచ్చు. అంతేకాకుండా ఆ పాము పారిపోయే ప్రయత్నం కూడా చేసింది. అయితే ఆ ఇంటికి సంబంధించిన కుటుంబీకులు అక్కడే ఉండడంతో పాము ఎక్కడికి పారిపోకుండా ఉండిపోవాల్సి వచ్చింది. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియోను వైల్డ్ ఇండియా అనే ఇంస్టాగ్రామ్ ఖాతా నుంచి షేర్ చేశారు. 


ఇది కూడా చదవండి :: King Cobra Shed Video: 5 అడుగుల కింగ్‌ కోబ్రా కుబుసాన్ని తొలిచేసిన యువకుడు.. వీడియో చూస్తే ఆశ్చర్యపోతారు!


ఇప్పటికీ ఈ వీడియోను రెండు మిలియన్లకు పైగా నెటిజన్స్ లైక్ చేసినట్లు చేశారు.. అంతేకాకుండా కొన్ని లక్షల మంది ఈ వీడియోను వీక్షించినట్లు తెలుస్తోంది. ఈ వీడియోకు "మార్నింగ్ 5:30 Am రెస్క్యూ" అని కొటేషన్ రాసి పోస్ట్ చేశారు. ఇప్పటికీ ఈ వైరల్ అవుతున్న వీడియోను 43,000 మందికి పైగా ఇతరులకు షేర్ చేశారు. అంతేకాకుండా కొంతమంది సోషల్ మీడియా వినియోగదారులు "హరహర మహాదేవ్" అంటూ కామెంట్లు కూడా చేస్తున్నారు.


ఇది కూడా చదవండి :: King Cobra Shed Video: 5 అడుగుల కింగ్‌ కోబ్రా కుబుసాన్ని తొలిచేసిన యువకుడు.. వీడియో చూస్తే ఆశ్చర్యపోతారు!



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.