Snake crawls into sleeping womans hair video: సోషల్ మీడియాలో తరచుగా వెరైటీగా ఉన్న వీడియోలు వైరల్ గా మారుతుంటాయి.. కొంత మంది నెటిజన్లు ఏదైన ఫన్నీ యాక్టివిటీ చేసిన సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తుంటారు. అంతే కాకుండా.. తరచుగా పాములకు చెందని వెరైటీ వీడియోలు ఎక్కువగా ట్రెండింగ్ లో ఉంటాయి. నెటిజన్ లు కూడా పాములకు చెందిన వీడియోలు చూసేందుకు ఎక్కువగా ఆసక్తి చూపిస్తుంటారు. కానీ కొంత మంది మాత్రం పాములు చూడగానే దూరంగా పారిపోతుంటారు.



COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

 


ఆ ప్రదేశానికి మళ్లీ అస్సలురారు. పాములు కన్పిస్తే కొంతమంది స్నేక్ సొసైటీ వాళ్లకు కూడా సమాచారం ఇస్తారు. పాములకు హనీ తలపెట్టకూడదని చెప్తుంటారు. పాములకు చెందని అనేక ఘటనలు తరచుగా వార్తలలో ఉంటాయి. కొన్ని షాకింగ్ కు గురిచేస్తే.. మరికొన్ని ఆశ్చర్యానికి గురిచేసేవిలా ఉంటాయి. ఈ కోవకు చెందిన ఒక వీడియో ప్రస్తుతం వైరల్ గా మారింది.


పూర్తి వివరాలు..
 
కొంత మంది సోషల్ మీడియాలో ఫెమస్ అయ్యేందుకు రకరకాల పైత్యాలు చూపిస్తున్నారు. ఏలాగైన వ్యూస్ రావాలని , వైరల్ అవ్వాలనే ఎంతటి రిస్క్ అయిన చేయడానికి సైతం వెనుకాడటం లేదు. ఈ నేపథ్యంలో కొంత మంది రీల్స్ లు, వీడియోలు తీసుకుంటూ ప్రాణాలు సైతం కోల్పోయిన ఘటనలు వార్తలలో నిలిచాయి. తాజాగా, ఒక మహిళ పడుకుని ఉంది. ఆమె నెలపైన పడుకుని ఉంది. అప్పుడు ఒక పాము వేగంగా ఆమె జుట్టులోకి వెళ్లి దాక్కుంటుంది.


Read more:Viral Video: పాము గుడ్లను కాదు.. నడి రోడ్డుపై ఏకంగా పిల్లల్నే కనింది వీడియో చూస్తేనే ఒళ్లు జలదరిస్తోంది..


పాము స్పీడ్ గా వెళ్లిపోయి ఆమె ఏదో.. పాము పుట్టలోకి దూరిపోయినట్లు, జుట్టులోకి వెళ్లిపోయింది. దీంతో ఆమెకు ఒక్కసారిగా మెళకువ రావడంతో లేచీ కూర్చుంటుంది. అప్పుడు పాము కిందకు దిగి వెళ్లిపోతుంది. kashiyatra user ఇన్ స్టా అకౌంట్ లో ఈ వీడియోను షేర్ చేశారు.  ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. దీన్ని చూసిన నెటిజన్ లు మాత్రం షాక్ కు గురౌతున్నారు. మరికొందరు ఇదేదో.. రీల్స్ కావచ్చంటూ మండిపడుతున్నారు.