Snake Giving Birth Viral Video: పాములు విష సరిసృపం. కానీ, ముఖ్యంగా మన హిందూ సంప్రదాయంలో నాగదేవతగా కొలుస్తారు. పూజలు నిర్వహిస్తారు. పాములు ఎన్నో రకాల జాతులు కలిగి ఉంటాయి. ఇందులో భయానకమైన పాములు ఉంటాయి. మాములు పాములు కూడా ఉంటాయి. ఏది ఏమైనా ఏటా ఎన్నో లక్షల మంది పాము కాటుకు గురై చనిపోతున్నారు. కొన్ని పాములకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతాయి. కొంతమంది పాములకు సంబంధించిన వీడియోలను ఆసక్తిగా చూస్తారు. బాగా వైరల్ కూడా అవుతాయి. ఇలాంటి వీడియోలు సోషల్ మీడియాలో షేర్ చేయడం, కామెంట్లు పెట్టడం వంటివి చేస్తారు.
అలాంటి ఓ పాము వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో మళ్లీ వైరల్‌గా మారింది. ఈ పాము వీడియో చూస్తేనే ఒళ్లు జలదరిస్తోంది. మీరు ఎన్నో సార్లు పాము గుడ్లను పెట్టడం విని ఉంటారు.కానీ, ఓ పాము ఈ వైరల్ వీడియోలో నడిరోడ్డుపై ఏకంగా పాము పిల్లల్నే కనింది. ఈ పాముకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. పాములను చూసే ఔత్సాహికులు ఎగబడి మరీ ఈ వీడియోను చూస్తున్నారు.
ఈ వీడియోలో నడిరోడ్డుపై వెళ్తున్న పాము పిల్లల్ని పెడుతోంది. అక్కడే మెలికలు తిరుగుతుంది. దాని తోక కింది భాగం నుంచి పాము పిల్లలు బయటకు వస్తున్నాయి. మీరు ఎప్పుడైనా ఇలాంటి వీడియో చూశారా? ఈ దృశ్యం చూసిన స్థానికులు ఆశ్చర్యానికి గురవుతున్నారు. మరికొంత మంది తమ కెమెరాల్లో ఈ పాము వైరల్ వీడియోను బంధించారు. దాన్ని సోషల్ మీడియాలో షేర్ చేశారు. దీనికి కోట్లలో వ్యూస్ రాగా, వేలల్లో లైకులు కూడా కొట్టారు.
ఇదీ చదవండి: కేంద్రం బంపర్ ఆఫర్.. ప్రతినెలా రూ.3000 పొందే సూపర్ హిట్ స్కీమ్..!
ఈ మధ్య కాలంలో బాగా వర్షాలు పడటంతో కూడా పాములు ఇంటి బాల్కనీ, ఇళ్లలో చొరబడిన వీడియోలు కూడా ఈ మధ్య బాగా వైరల్ అయ్యాయి. మొన్న ఒకరి ఇంట్లో ఏకంగా ఇంటి అల్మారాలో దూరింది. దీంతో స్నేక్ క్యాచర్ వెంటనే సమాచారం అందించడంతో పట్టుకుని దగ్గర్లోని అడవిలో వదిలేశారు. అంతేకాదు మరో ఘటనలో ముంబై ట్రైన్‌లో కూడా పాము దూరింది. దీంతో ప్రయాణీకులు ఒక్కసారిగ్గా ఉలిక్కిపడ్డారు.
విషయం తెలుసుకున్న రైల్వే సిబ్బంది వెంటనే పామును బయటకు తీశారు. మరో ఘటనతో క్లాస్ రూమ్‌లో పాఠాలు జరుగుతున్న సమయంలో ఏసీ విండో నుంచి పాము క్లాస్ రూమ్‌లోకి వచ్చింది. ఈ ఘటనలో కూడా ఎవరికీ ప్రాణాపాయం జరగలేదు. కానీ, పాములకు సంబంధించిన కొన్ని వీడియోలు సోషల్ మీడియాలో మాత్రం తెగ వైరల్ అవుతుంటాయి. వీటిని ఆసక్తి చూసేవారు కోకొల్లలు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.