Cobra snake Video: ఇదో పాముల లవ్ స్టోరీ..?.. ప్రియుడు చనిపోతే.. పక్కనే ఉండిపోయిన మరో పాము.. వీడియో ఇదే..
Snake video viral: శివపురిలో జేసీబీ తవ్వకాలలో ఒక పాము చనిపోయింది. దీంతో డ్రైవర్ పామును దూరంగా పాడేద్దామని అక్కడికి వెళ్లి చూడగా.. మరొక పాములు బసలు కొడుతూ పైకి వచ్చింది. ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారింది.
Snake viral video: సాధారణంగా ప్రేమ, ఎమోషన్ లు మనుషులకే కాదు.. నోరు లేనీ జీవాలకు సైతం ఉంటాయంటారు. చాలా సార్లు నోరులేనీ జీవాలు సైతం.. తమ జోలికి లేదా.. తమ పిల్లల జోలికి ఇతరులు లేదా క్రూర జంతువులు వస్తే ఎంతకైన తెగిస్తాయి. దైర్యంగా పోరాడతాయి. అదే విధంగా క్రూర జంతువులు, సాధుజంతువులు అని తేడాలేకుండా.. వాటికి కూడా కొన్ని ఫీలింగ్స్ ఉంటాయంట. అవి ఆడజీవులతో ప్రేమల పడతాయి. సంభోగం చేస్తాయంటారు.
అయితే.. కొన్నిసార్లు తమ తోటి ఉన్న జీవికి ఏమైన జరిగితే.. మరోక జీవి విలవిల్లాడిపోతుంది. మనం రోడ్డు మీద లేదా అడవుల్లో తరచుగా చూస్తుంటాం. ఏదైన గుంపులోని జీవులు.. ఒకదానికి ఏమైన జరిగితే.. అన్ని అక్కడే ఉండిపోయి.. కన్నీళ్లు సైతంపెట్టుకుంటాయి.
ఈ క్రమంలో ప్రస్తుతం... ఒక పాము.. తనతో ఉన్న మరో పాము చనిపోవడంతో అక్కడే కదకుండా గంటల పాటు ఉండిపోయిందంట. ఈ ఘటన ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
పూర్తి వివరాలు..
మధ్య ప్రదేశ్ లోని శివపురి జిల్లాలో ఇటీవల షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. అక్కడ నార్వార్ అనే గ్రామంలో పొలంలో జేసీబీతో పనులు చేస్తున్నారంట. అయితే.. అక్కడ జేసీబీ వీల్స్ కు చిక్కుకుని ఒక పాము గాయపడి విలవిల్లాడుతూ చనిపోయింది. ఈ క్రమంలో.. జేసీబీ డ్రైవర్ గమనించి దాన్ని పక్కకు తీద్దామని అక్కడికి వెళ్లడంట. ఇంతలో మరోపాము అక్కడికి వచ్చి.. దాన్ని ముట్టకుండా.. డ్రైవర్ మీదకు బసులు కొడుతూ వెళ్లిందంట.
చాలా సేపు మరో పాము అక్కడే ఉండిపోయిందంట. అయితే.. అక్కడికి గ్రామస్తులు, స్నేక్ క్యాచర్ లు చేరుకున్నారంట. చనిపోయింది.. మగ పాము అని.. అది ఆడపాము అని అతను చెప్పాడంట.
సాధారణంగా ఈ పాముల ఏళ్ల పాటు కలిసి ఉండవచ్చని.. వింటర్ లో ఇలా బైటకు వస్తాయని.. అనుకొకుండా.. ఇది జరిగిందని కూడా బాధపడ్డారంట. ప్రస్తుతం ఆ పాముల్ని అడవిలోకి తీసుకెళ్లి వదిలేశారంట. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. దీన్ని చూసిన నెటిజన్లు మాత్రం పాముల్ని చూసి ఎమోషల్ అవుతున్నారంట. మనుషుల కన్నా.. నోరులేనీ జీవాలు బెటర్ అని కొందరు కామెంట్లు చేస్తున్నారంట.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Facebook, Twitter