Python Eating Cobra Snake: నాగు పామును తింటున్న పైథాన్.. భయంకరమైన వీడియో
Python Eating Cobra Snake: మనం చూస్తున్నదంతా ఒక జంతువును మరో జంతువు వేటాడి తినే ఆకలి ప్రపంచం అనే విషయం తెలిసిందే. ఇది ఇప్పుడు కొత్తగా చూస్తున్న సంస్కృతి కాదు.. అనాదిగా వస్తున్నదే. అలాగే పాముల విషయంలోనూ అదే సూత్రం వర్తిస్తుంది. ఒక పెద్ద పాము మరో చిన్న పామును అతి సునాయసంగా హోంఫట్ అనిపిస్తుంది.
Python Eating Cobra Snake: మనం చూస్తున్నదంతా ఒక జంతువును మరో జంతువు వేటాడి తినే ఆకలి ప్రపంచం అనే విషయం తెలిసిందే. ఇది ఇప్పుడు కొత్తగా చూస్తున్న సంస్కృతి కాదు.. అనాదిగా వస్తున్నదే. అలాగే పాముల విషయంలోనూ అదే సూత్రం వర్తిస్తుంది. ఒక పెద్ద పాము మరో చిన్న పామును అతి సునాయసంగా హోంఫట్ అనిపిస్తుంది. ఒక పెద్ద పాముకు బాగా ఆకలిగా ఉన్నప్పుడు తనకంటే కొంచెం చిన్నగా ఉన్న ఏ పాము కంటపడినా ఇక అంతే సంగతి.
అవును, ఒక పాము మరో పామును తింటుంది. ఈ విషయం మీరు ఎక్కడో ఓ చోట వినే ఉంటారు.. లేదంటే సోషల్ మీడియాలో చూసే ఉంటారు. కానీ ఒక పెద్ద కొండచిలువ పాము మరో పెద్ద కింగ్ కోబ్రాను మింగేయడం ఎప్పుడైనా చూశారా ? అది కూడా ఏమంత సమయం తీసుకోకుండా క్షణాల వ్యవధిలోనే పెద్ద నాగు పామును మింగేసింది. మైసూరుకి చెందిన ఈ రేర్ వీడియో ఇప్పుడు సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్స్ లో వైరల్ అవుతోంది.
లోకల్ మీడియా రిపోర్ట్స్ ప్రకారం, సాధారణంగా అయితే, అడవిలో మాత్రమే కనిపించే ఈ రేర్ సీన్.. ఆదివారం కర్ణాటకలోని మైసూరులో అక్కడి నగరవాసులకు కంటపడింది. భారీ కొండచిలువ మరో భారీ నాగు పామును ఆవురావురుమని మింగుతున్న దృశ్యం చూసి వాళ్లు షాకయ్యారు. ఇంకొంతమంది ఆ దృశ్యాన్ని నేరుగా చూసే ధైర్యం లేక హడలిపోయారు.
సోషల్ మీడియాలో నిత్యం ఇలాంటి వైరల్ వీడియోలు ఎన్నో దర్శనం ఇస్తుంటాయి. కానీ ఏ వీడియోకు ఉండే ప్రత్యేకత ఆ వీడియోకు ఉంటుంది. మనం ఎన్ని వీడియోలు వీక్షించినా.. ఒక వీడియోను మరో వీడియోతో ముడిపెట్టి చూడలేనంత ప్రత్యేకతను సొంతం చేసుకుని ఉంటాయి. అందుకే సోషల్ మీడియాలో ఎన్ని స్నేక్స్ వీడియోలు ఉన్నా.. అవన్నీ వైరల్ అవుతూనే ఉంటాయి.. నెటిజెన్స్ దృష్టిని ఆకర్షిస్తూనే ఉంటాయి.
ఇది కూడా చదవండి : Rabbit vs Cobra Snake Fighting: కుందేలు vs పెద్ద నాగు పాము మధ్య వీరోచిత పోరాటం.. ఎవరు గెలిచారో తెలుసా ?
ఉదాహరణకు గతంలోనూ ఇలా ఒక పామును మరో పాము మింగుతున్న దృశ్యాలు ఎన్నో సోషల్ మీడియాలో ప్రత్యక్షం అయ్యాయి. కానీ ఇలా రెండు డేంజరస్ స్నేక్స్ ఒకదానినొకటి తినడం మాత్రం నిజంగానే ఆశ్చర్యం వేయకమానదు. అది కూడా ఏకంగా అత్యంత విషపూరితమైన నాగు పామును కొండచిలువ తినడం ఇంకా విడ్డూరంగా ఉంది కదూ .. మిమ్మల్ని అబ్బూరపరిచే ఇలాంటి మరిన్ని వైరల్ వీడియోస్ కోసం జీ తెలుగు న్యూస్ వెబ్‌సైట్‌ని క్రమం తప్పకుండా వీక్షిస్తూ ఉండండి.
ఇది కూడా చదవండి : King Cobra Snake At Tomatoes: టమాటాలకు నాగు పాము కాపలా.. చేయి పెడితే కాటేస్తున్న శ్వేత నాగు
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3P3R74U
Apple Link - https://apple.co/3loQYe
Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి