Cobra Snake Spitting Venom: దూరం నుంచే విషం చిమ్ముతున్న పెద్ద నాగు పామును బంధించిన ఘనుడు

Cobra Snake Spitting Venom: మామూలుగానే నాగుపామును చూస్తే ప్రాణం గడగడలాడిపోతుంది. భయంతో ఒళ్లు గజగజ వణికిపోతుంది. అలాంటిది దాదాపు పది నుంచి పదిహేను అడుగుల పొడవున్న పెద్ద నల్ల త్రాచు పామును ధైర్యంగా బంధించాడు ఈ యువకుడు.

Written by - ZH Telugu Desk | Last Updated : Jul 12, 2023, 11:48 PM IST
Cobra Snake Spitting Venom: దూరం నుంచే విషం చిమ్ముతున్న పెద్ద నాగు పామును బంధించిన ఘనుడు

Cobra Snake Spitting Venom : మామూలుగానే నాగుపామును చూస్తే ప్రాణం గడగడలాడిపోతుంది. భయంతో ఒళ్లు గజగజ వణికిపోతుంది. అలాంటిది దాదాపు పది నుంచి పదిహేను అడుగుల పొడవున్న పెద్ద నల్ల త్రాచు పామును ధైర్యంగా బంధించాడు ఈ యువకుడు. ఇంటి ముందు ఆవరణలోకి పెద్ద నాగు పాము దూరింది అని ఒక కుటుంబం అందించిన సమాచారంతో అక్కడికి చేరుకున్న స్నేక్ క్యాచర్స్.. ఆ పామును చూసి ఏ మాత్రం జడవకుండా ధైర్యం చేసి ఆ పామును బంధించాడు. 

అయితే, ఆ పామును పట్టుకోవడానికి ముందు అతడు ఆ పాముతో చాలాసేపు ఆడుకోవడం ఒక్కటే స్నేక్స్ లవర్స్‌కి నచ్చని విషయం. ఎందుకంటే కావాలంటే వెంటనే వాళ్లు ఆ పామును బంధించి తీసుకెళ్లి అడవిలో విడిచిపెట్టొచ్చు. కానీ ఈ వీడియోలో ఉన్న స్నేక్ క్యాచర్ మాత్రం అలా కాకుండా చాలాసేపు ఈ పాముతో ఆడుకోవడం చూడొచ్చు. చాలాసేపు పామును చికాకు పెట్టించాడు. మామూలుగానే ఇలాంటి పెద్ద పామును పట్టుకోవడం అంత ఈజీ కాదు.. అలాంటిది ఈ వ్యక్తి పామును బందించే పని పక్కకుపెట్టి చాలాసేపు దానితో ఆడుతూ కనిపించాడు. కొద్దిసేపు ఆ పాము తోకను పట్టుకుని ఆడించాడు. ఇంకొద్దిసేపు పాము పడిగపై తన చేతిలో ఉన్న కర్రతో నొక్కుతూ కనిపించాడు.

స్నేక్ క్యాచర్ తనతో ఆడుకుంటున్న తీరు చూసి ఆ నాగు పాముకు కూడా చిర్రెత్తుకొచ్చినట్టుంది.. అందుకే కోపంతో బుసలు కొడుతూ విషం కక్కేసింది. అతి కొన్ని సర్పాలకు మాత్రమే ఇలా కాటేయకుండానే దూరం నుంచే విషం చిమ్మే శక్తి ఉంటుంది. ఇక్కడ మీరు చూస్తున్న పాము కూడా అలాంటి డేంజరస్ కోబ్రా స్నేక్. బహుషా పాము కాటేయడమే చాలా మంది చూసి ఉండొచ్చు కానీ విషం కక్కడం ఎప్పుడూ చూసి ఉండకపోవచ్చు. నిజంగా అలాంటి దృశ్యం చూడటం అంటూ జరిగితే చాలామందికి ఇదే మొదటిసారి కావొచ్చు. 

వియాత్నాంకు చెందిన స్నేక్ క్యాచర్స్ కింగ్ కోబ్రా హంటర్ పేరిట ఉన్న యూట్యూబ్ చానెల్లో పోస్ట్ చేసిన ఈ వీడియో రోజుల వ్యవధిలోనే వైరల్ గా మారింది. వేల సంఖ్యలో లైక్స్ సొంతం చేసుకున్న ఈ వీడియో ఇంటర్నెట్లో భారీ సంఖ్యలో నెటిజెన్స్ దృష్టిని ఆకర్షిస్తోంది. ఇలాంటి మరిన్ని వైరల్ వీడియోల కోసం జస్ట్ కీప్ వాచింగ్ ఆర్ సోషల్ సెక్షన్.

Trending News