King Cobra Snake At Tomatoes: టమాటాలకు నాగు పాము కాపలా.. చేయి పెడితే కాటేస్తున్న శ్వేత నాగు

King Cobra Snake At Tomatoes: టమాటాల గురించి ఇన్ని వీడియోలు వైరల్ అవుతున్న ప్రస్తుత తరుణంలోనే సోషల్ మీడియాలో తాజాగా మరొక వీడియో వైరల్ అవడం ప్రారంభించింది. ఈసారి టమాటాలకు కాపలా కాస్తోంది మరెవరో కాదు.. కింగ్ కోబ్రా.. అదేనండి నాగు పాము. అవును.. మీరు మీ కళ్లతో చూస్తోంది.. మీరు చదువుతోంది అంతా నిజమే. ఆ కథాకమామిషు ఏంటో తెలుసుకుందాం రండి.

Written by - Pavan | Last Updated : Jul 15, 2023, 09:10 AM IST
King Cobra Snake At Tomatoes: టమాటాలకు నాగు పాము కాపలా.. చేయి పెడితే కాటేస్తున్న శ్వేత నాగు

King Cobra Snake At Tomatoes: టమాట ధరలు ఆకాశాన్నంటుతున్నాయి అనే వార్తలు మనం నిత్యం న్యూస్ హెడ్‌లైన్స్‌లో చూస్తూనే ఉన్నాం. అంతేకాదు.. కొన్ని చోట్ల భారీ మొత్తంలో టమాటాలు సైతం చోరీకి గురవుతున్నాయి. ఒక ఘటనలో రైతు పంట పండిస్తున్న తోట వద్దే రూ. 2.5 లక్షల విలువైన టమాటా పంట చోరీ కాగా ఇంకో ఘటనలో మార్కెట్ యార్డులో అమ్మకం కోసం ఒక వ్యాపారి కొనిపెట్టిన టమాట చోరీ అయింది. ఇవన్నీ చూసిన మరో టమాటా వ్యాపారి ఏకంగా అతడి దుకాణం ముందు టమాటాలకు, అతడికి రక్షణగా బౌన్సర్లను కూడా నియమించుకున్న వీడియో వైరల్ అయిన సంగతి కూడా తెలిసిందే. 

టమాటాల గురించి ఇన్ని వీడియోలు వైరల్ అవుతున్న ప్రస్తుత తరుణంలోనే సోషల్ మీడియాలో తాజాగా మరొక వీడియో వైరల్ అవడం ప్రారంభించింది. ఈసారి టమాటాలకు కాపలా కాస్తోంది మరెవరో కాదు.. కింగ్ కోబ్రా.. అదేనండి నాగు పాము. అవును.. మీరు మీ కళ్లతో చూస్తోంది.. మీరు చదువుతోంది అంతా నిజమే. కాకపోతే బౌన్లర్లను వ్యాపారి నియమించుకోగా.. ఇక్కడ మాత్రం నాగు పాము స్వయంగానే వచ్చి టమాటాలకు కాపలా కాస్తోంది. 

టమాటాల ధరలు ఏరోజుకు ఆ రోజు నింగిని తాకుతున్నాయి. అలాంటి సమయంలోనే ఇలా ఒక నాగు పాము టమాటాలకు కాపలా కాస్తుండటం అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది. అది కూడా  టమాటాలపై పడగ విప్పి మరీ టమాటాలకు గొడుగు పట్టింది. అక్కడ ఎవ్వరు చేయి పెట్టేందుకు ట్రై చేసినా వారిని అదే పడగతో కసుక్కున కాటేసేందుకు వెనుకాడటం లేదు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో అందరి దృష్టిని ఆకర్షిస్తోంది.

సాధారణంగా బంగారం, వజ్రవైడూర్యాలు ఉన్న నిధిని కాపాడేందుకు ఏర్పాటు చేసే అష్టదిగ్భందనాల్లో పాముల కోన కూడా ఒకటిగా ఉంటుంది అని పాతకాలం నాటి సినిమాల్లో చూసేవాళ్లం. హీరో ఎంతో రిస్క్ చేసి సప్త సముద్రాలు దాటి నిధి కోసం వెళ్తే అక్కడ నిధి చుట్టూ పాములు కాపలా కాస్తుండటం కనిపించేది. ఇక్కడ టమాటాలకు కాపలా కాస్తున్న పామును చూస్తే కూడా మళ్లీ అలాంటి సీన్స్ గుర్తుకొస్తున్నాయి అంటున్నారు ఈ దృశ్యం చూసిన నెటిజెన్స్.

ఇది కూడా చదవండి : Side Effects of Maggi: మ్యాగీ తింటే వచ్చే సైడ్ ఎఫెక్ట్స్‌లో ప్రాణాంతకమైన జబ్బు ?

రెండు నెలల క్రితం వరకు కిలో రూ.20కి లభించిన టమాటాలు ఇప్పుడు ఏకంగా రూ.150 మార్కు పైకి ఎగబాకాయి. వేసవి సీజన్లో మామిడికాయల ధరల కంటే ఎక్కువ ధర పలుకుతోంది. పెరుగుతున్న ధరలతో టమాటా కొనలేక ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. సోషల్ మీడియాలో ఇప్పుడు ఇదొక హాట్ టాపిక్ అయింది. ఎంతో మంది టమాటా కొనలేకపోతున్నాం అంటూ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మీమ్ మేకర్స్ సైతం ఇదే సరైన అవకాశంగా భావిస్తూ రకరకాల మీమ్స్ చేసి సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారు.

ఇది కూడా చదవండి : Rs 20 per day to Rs 100 Cr Business: ఒకప్పుడు రూ. 20 కూలీ.. ఇప్పుడు రూ. 100 కోట్ల వ్యాపారానికి యజమాని

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , FacebooK

Trending News