Snake Found in toilet seat in maharashtra: పాములంటే చాలా మంది భయంతో వణికిపోతుంటారు. పాము పేరు ఎత్తగానే పారిపోయే వారు కూడా ఉన్నారు. పాములుచెట్లు, అడవులు, చల్లగా ఉండే ప్రదేశాలలోఎక్కువగా ఉంటాయి. గుబురుగా ఉండే ప్రదేశాలు, ఎలుకలు ఉన్న ప్రాంతాలలో ఉంటాయి. ముఖ్యంగా పాములు ఎలుకల కోసం మనుషులు ఆవాసాల్లోకి వస్తుంటాయి.  పాములను చాలా మంది దైవంగా భావిస్తారు. కొందరు పాములను చూడగానే దూరంగా పారిపోతే.. మరికొందరు పాములు కన్పిస్తే స్నేక్ సొసైటీ వారికి సమాచారం ఇస్తారు. అంతేకాకుండా.. పాములను హనీ కల్గించకూడదంటారు. కొందరు పాముల కాటుకు గురవుతుంటారు. దీంతో కరిచిన పాములను పట్టుకుని ఆస్పత్రికి వెళ్లిన ఘటనలు కొకొల్లలు. పాములు కిచెన్ లలో , మిద్దెమీద కన్పిస్తుంటారు. పొలాలలో తిరిగే వారు ఎక్కువ మంది పాముల కాటుకు గురౌతుంటారు. పాములకు చెందిన వార్తలు తరచుగా వార్తలలో ఉంటాయి.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

 



మన దేశంలో దాదాపు మూడు వందల రకాల పాములు ఉంటాయని నిపుణులు చెబుతుంటారు. కొన్నిపాములు భయంకరమైన విషయంను కల్గి ఉంటాయి. మరికొన్ని పాములు అంతగా విషపూరితం కావు. పాములకు చెందిన విషయాలు గురించి తెలుసుకోవడానికి నెటిజన్లు సైతం ఆసక్తి చూపిస్తుంటారు. పాములు వీడియోలు తరచుగా వార్తలలో ఉంటాయి. ప్రస్తుతం మహారాష్ట్రలో ఒక వ్యక్తి టాయ్ లెట్ లో పాము హల్ చల్ చేసింది. ఈ వీడియోవైరల్ గా మారింది.



మహారాష్ట్రంలో జరిగిన ఘటన వార్తలలో నిలిచింది.ఒక వ్యక్తి టాయ్ లెట్ కు వెళ్దామని బాత్రూమ్ కు వెళ్లాడు. ఇంతలో టాయ్ లెట్ బెసీన్ నుంచి ఒక పాము బైటకు రావడం కన్పించింది. వెంటనే ఇంట్లో వాళ్లను అలర్ట్ చేసి, స్నేక్ సొసైటీ వారికి సమాచారం ఇచ్చాడు. దీంతో స్థానికంగా పాములను పట్టడంతో ఫెమస్ అయిన శీతల్ అక్కడకు చేరుకుంది. వెంటనే ఆమె రంగంలోకి దిగి, టాయ్ లెట్ లో ఉన్న పామును చాకచక్యంగా పట్టుకోవడానికి ప్రయత్నించింది.


Read More: Station Master Dozes Off: గుర్రుపెట్టి పడుకున్న స్టేషన్ మాస్టర్.. సిగ్నల్ కోసం లోకోపైలేట్ తంటాలు.. ఎక్కడో తెలుసా..?


ఇంతలో పాము ఆమెను ముప్పు తిప్పలు పెట్టింది. ఆమె ఎంతో నేర్పుగా పామును పారిపోకుండా తన చేతులతో బంధించి, ఇంటి బైటకు తీసుకొచ్చి ఒక బ్యాగులో వేసుకుంది. ఆతర్వాత దాన్ని దగ్గరలోని అడవుల్లోకి వదిలేసింది. యువతి పామును నేర్పుగా పట్టుకున్న వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. దీన్ని చూసిన నెటిజన్లు వావ్..  అంటూ కామెంట్లు పెడుతున్నారు. మరికొందరు ఇంత కూడా భయంలేకుండా భలే పామును పట్టుకుందంటూ ఆమె ధైర్యాన్ని మెచ్చుకుంటున్నారు. 



 


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి FacebookTwitter