King Kobra Swallowed Underware in Chamarajanagar Karnataka: ఈ భూప్రపంచంలోని అన్ని పాములు మాంసాహారులే. పాములు ప్రధానంగా జీవులను ఆహారం తీసుకుంటాయి. కప్పలు, ఎలుకలు, గుడ్లు, పక్షులను పాములు తమ ఆహారంగా తీసుకుంటాయి. బల్లులు, సాలమండర్లు, టాడ్‌పోల్స్ మరియు ఇతర రకాల చిన్న పాములను కూడా కొన్ని జాతుల పాములు తింటుంటాయి. ఏ పాము అయినా దుస్తులను మాత్రం ఆహారంగా తీసుకోదు. ఇలాంటి ఘటనలు కూడా ఎక్కడా జరగలేదు. అయితే తాజాగా ఓ నాగుపాము అండర్‌వేర్‌ను మింగి అష్టకష్టాలు పడింది. ఇందుకు సంబందించిన వీడియో ఒకటి నెట్టింట వైరల్ అయింది. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

కర్ణాటకలోని చామరాజనగర్ తాలూకా కోటతిట్టు గ్రామానికి చెందిన శివకుమార్ ఇంట్లోకి ఓ భారీ నాగుపాము వచ్చింది. ఇంటి ఆవరణంలో ఉన్న అండర్‌వేర్‌ను చూసి ఎలుక అని అది పొరబడింది. అండర్‌వేర్‌ను మొత్తం పాము మింగేసింది. దాంతో అది పడరాని పాట్లు పడింది. ఇళ్లు పైకి ఎక్కి మరీ అవస్థలు పడింది. ఇది చూసిన శివకుమార్ ఇంటిసభ్యులు దాని చంపకుండా.. స్నేక్ క్యాచర్‌కు కబురు పంపారు. 



స్నేక్ క్యాచర్‌.. శివకుమార్ ఇంటికి చేరుకొని ఇళ్లు పైకి ఎక్కి నాగుపామును పట్టుకుని కిందకు తీసుకొచ్చాడు. స్నేక్ క్యాచర్‌ తోక పట్టుకుని ఉండగా.. పాము తన నోటి నుంచి అండర్‌వేర్‌ను కొద్దికొద్దిగా బయటికి తీసింది. చాలా సమయం తర్వాత నాగుపాము అండర్‌వేర్‌ను మొత్తం బయటికి కక్కింది. అప్పుడు అది పారిపోవడానికి ప్రయత్నించగా.. స్నేక్ క్యాచర్‌ ఓ డబ్బాలో బందించి అడవిలో వదిలేశాడు. ఇందుకు సంబందించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఈ వీడియో చూసిన అందరూ నవ్వులు పోయిస్తున్నారు. 'ఇదేందయ్యో ఇది నేను ఎప్పుడూ చూడలే' అంటూ కామెంట్స్ చేస్తున్నారు. 


Also Read: విజయ్‌, నా గురించి మాట్లాడుకోవడం ఆనందంగా ఉంది.. రష్మిక ఆసక్తికర వ్యాఖ్యలు!


Also Read: కంటెస్టెంట్లతో ఆడుకుంటున్న హోస్ట్.. నాగార్జున ఆన్ ఫైర్


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


Android Link - https://bit.ly/3P3R74U


Apple Link - https://apple.co/3loQYe 


Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి