Viral Video: ఇప్పుడంటే కొత్త కొత్త మిఠాయిలు అందుబాటులో ఉన్నాయి. కానీ ఒకప్పుడు మిఠాయిలు అంటే బూందీ, జిలేబీ, బాదుషాతోపాటు సోన్‌ పాపిడి ఉంటుంది. పాత తరం కొత్త తరానికి తీపి అందించే అతి పురాతన మిఠాయి సోన్‌ పాపిడి అంటే చాలా మందికి ఇష్టం. అతి తక్కువ ధరకు అందుబాటులో ఉండే సోన్‌ పాపిడిని చిన్నా పెద్దా అందరూ తినడానికి ఇష్టపడతారు. ఎంతో తీయగా ఉండే సోన్‌ పాపిడికి సంబంధించిన ఒక వీడియో నెట్టింట్లో చక్కర్లు కొడుతోంది. ఈ వీడియో చూస్తే మాత్రం సోన్‌ పాపిడిని ముట్టను కూడా ముట్టరు.

COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Also Read: Chandrababu Kiss: సీఎం చంద్రబాబుకు ప్రేమతో ముద్దు పెట్టిన మహిళ.. వీడియో వైరల్‌


తయారీ ఇలా..
సోన్‌ పాపిడి తయారీకి సంబంధించిన వీడియో ఒకటి తిరుగుతోంది. సోన్‌ పాపిడిని మైదా లేదా ఒక రకమైన పిండితో చేస్తారు. ఆ పిండిని నెయ్యి లేదా నూనెలో ఉడికిస్తారు. అనంతరం చక్కెర పాకంలో వేస్తారు. అనంతరం ఆ మిశ్రమాన్ని బాగా కలుపుతారు. కొన్ని గంటల పాటు కలిపిన అనంతరం ఒక తీగలాగా ఆ మిశ్రమం అవుతుంది. అనంతరం ఆ మిశ్రమాన్ని తీసుకుని డబ్బాలో వేసి జాగ్రత్తగా కట్‌ చేసి ఉంచుతారు.

Also Read: Diwali 2024: దీపావళికి 200 ఏళ్లుగా ఆ గ్రామం దూరం.. మన ఆంధ్రప్రదేశ్‌లోనే ఎక్కడో తెలుసా?


చెప్పులు వేసుకుని..
అయితే తయారీ చేయాల్సిన విధానంలో కొందరు అత్యంత దారుణంగా చేశారు. అపరిశుభ్రంగా సోన్‌ పాపిడిని తయారు చేస్తున్నారు. సోన్‌ పాపిడిని అపరిశుభ్ర పరిస్థితుల్లో తయారు చేయడమే కాకుండా గోడలను వాడుకుంటారు. అపరిశుభ్రమైన చేతులతో వారు తయారు చేయడం కలచివేస్తోంది. మిశ్రమం తయారుచేసిన అనంతరం ఒక ప్లేటులాంటి దానిలో వేసి దానిపై మూత ఉంచారు. అనంతరం చెప్పులు వేసుకుని ఆ మూతపై తొక్కుతారు. ఒకసారి పరిశీలించి మళ్లీ తొక్కుతారు. తొక్కిన అనంతరం ఆ రాడ్‌లాంటి కర్రతో కొడతారు. ఆ తర్వాత మళ్లీ స్కేల్‌ లాంటి పరికరంతో ముక్కలు ముక్కలుగా కోశారు.


ఎలా తింటారు?
ఇలా అపరిశుభ్రంగా సోన్‌ పాపిడిని తయారుచేస్తున్న వీడియో మనుగుప్తా ఫిట్‌నెస్‌ అనే సోషల్‌ మీడియా అకౌంట్‌ ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ వీడియోను పోస్టు చేసింది. ఈ వీడియోను చూసిన నెటిజన్లు ఇలా తయారు చేస్తారా? అంటూ విస్మయం వ్యక్తం చేస్తున్నారు. ఇలా తయారు చేస్తే ఎలా తింటారు? అని ప్రశ్నిస్తున్నారు. అపరిశుభ్ర పరిస్థితుల్లో.. ఇష్టమొచ్చినట్టు చేస్తే ఎలా తింటారని నిలదీస్తున్నారు. అలా చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేస్తున్నారు. ఆ వీడియోను పది మిలియన్లకు పైగా నెటిజన్లు చూడగా.. వేలల్లో లైక్‌లు.. కామెంట్లు వస్తున్నాయి.






స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.