Watch How Wild Snake are Eating Food: కింగ్ కోబ్రా లు ఎంత ప్రమాదకరమైనవో అందరికీ తెలిసిందే. వీటిని పట్టుకునేవారు ఎంతో రేర్ గా ఉంటారు. నాగుపాములు చిమ్మే విషం ద్వారా ఎన్ని రకాల ఔషధాలు తయారవుతాయి. దీర్ఘకాలిక వ్యాధులకు ఉపయోగించే ఔషధాలు ఎక్కువగా ఈ పాము విషంతో  తయారవుతాయని ఇప్పటికీ మనం విని ఉంటాం. అయితే కొంతమంది పాములను పెంచుతూ విషాన్ని సేకరించి విక్రయిస్తూ ఉంటారు. పాములంటే ప్రేమ ఉన్నవారు సాధ జంతువుల వాటిని పెంచుకుంటున్నారు. సోషల్ మీడియా వేదికగా తరచుగా పాములకు సంబంధించిన వీడియోలు వైరల్ గా మారుతున్నాయి. ఇటీవలే ఓ వ్యక్తి భారీ విషపూరితమైన పాములకు మేతవేస్తూ వీడియో సోషల్ మీడియాలో షేర్ చేశాడు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

వీడియో వివరాల్లోకి వెళ్తే.. పాములు అంటే ఇష్టం ఉండే వ్యక్తి.. వివిధ ప్రాంతాల్లో సంచారం చేసే పాములన్నిటిని సేకరించి వాటికి సపరేట్గా గాజు గ్లాసుతో తయారుచేసిన పెట్టెలో బంధిస్తాడు. అందులోనే వాటికి కావాల్సిన ఆహార పదార్థాలను వేస్తూ పెంచుతూ ఉంటాడు. ఇదిలా ఉండగా భారీ కింగ్ కోబ్రాలను మాత్రం గార్డెన్ లో వదిలేస్తాడు. అయితే తను వదిలేసిన ఓ కింగ్ కోబ్రా.. తన పై చర్మం అయిన కుసాన్ని విడిచినట్లు గమనిస్తాడు. అంతేకాకుండా మిగిలి ఉన్న ఆ పాము పై చర్మాన్ని అతనే తొలిచివేస్తాడు. ఇలా తొలగించే క్రమంలో ఆ పాము కాటేసే ప్రయత్నం చేస్తుంది. అయినప్పటికీ ఎంతో జాగ్రత్తగా ఉన్నా అతను దానిని గమనించి పక్కకు తప్పుకుంటాడు.



Also Read: Huge Dangerous King Cobra: పడగ విప్పిన పాముకే కూర్చోబెట్టి పాఠాలు చెబుతున్న మొనగాడు!


అంతేకాకుండా తను పెంచుకుంటున్న దాదాపు 25 పాములకు ఆహారాన్ని కూడా అందిస్తాడు. ఒక్కొక్క దానికి ఒక్కొక్క పూట చొప్పున వైట్ రాట్ ఆహారంగా అందిస్తాడు. ఇలా పూట పూటకు ఒక్కొక్క ఎలుక చొప్పున అన్ని పాములకు మూడు పూటలుగా అందిస్తాడని సమాచారం. పాములకు ఎలుకలు అంటే చాలా ఇష్టం అందుకే ఆహారంగా వీటిని అందిస్తారు. ముఖ్యంగా తెల్ల కింగ్ కోబ్రాలు, నల్ల త్రాచు పాములు తెల్ల ఎలుకలను తినేందుకు తెగ ఇష్టపడతాయట. అంతేకాకుండా పాముల ఆరోగ్యానికి ఎలుకలు కూడా మంచి పోషకాహారంగా పనిచేస్తాయని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.


ప్రస్తుతం వైరల్ అవుతున్న ఈ వీడియోను @Chandlers Wildlife అనే యూట్యూబ్ ఛానల్ నుంచి పోస్ట్ చేశారు. ఇప్పటికీ ఈ వీడియోను ఒక లక్ష పైగా సోషల్ మీడియా వినియోగదారులు వీక్షించగా.. వారి అభిప్రాయాలను కామెంట్ల రూపంలో వ్యక్తం చేస్తున్నారు. అంతేకాకుండా పాములంటే ఇష్టపడేవారు ఈ వీడియోను షేర్ కూడా చేస్తున్నారు.


Also Read: Huge King Cobra Viral Video: బాప్రే..15 అడుగుల కింగ్ కోబ్రాను గొర్ర గొర్ర ఎలా గుంజుకొచ్చిండో చూశారా?.. గూస్ బంప్స్ వైరల్ వీడియో..  



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe


TwitterFacebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి