Goose Bumps Video Snake Catcher Dragged the Huge King Cobra: ప్రస్తుతం నెట్టింట్లో పాములకు సంబంధించిన వీడియోలే ఎక్కువగా వైరల్ అవుతున్నాయి. వీటిని జనాలు ఆసక్తిగా చూడడం వల్ల షేర్ చేసిన గంటలోపే సోషల్ మీడియాలో ట్రెండింగ్ గా మారుతున్నాయి. ఈ పాముల వీడియోల్లో కొన్ని స్నేక్ క్యాచర్లు షేర్ చేసినవి ఉంటే మరికొన్ని మాత్రం వైల్డ్ లైఫ్ ఫోటోగ్రాఫర్లు తీసిన వీడియోలు ఉంటున్నాయి. ప్రపంచవ్యాప్తంగా ఎన్నో జాతుల పాములు ఉన్నప్పటికీ నెటిజన్లు ఆసక్తిగా ఉండే కింగ్ కోబ్రాలకు సంబంధించిన వీడియోలు మాత్రమే చూస్తున్నారు. ఇటీవలే నెట్టింట్లో వైరల్ అవుతున్న ఓ వీడియో అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తుంది. ప్రపంచంలో పొడవు గల పాములు కూడా ఉంటాయనే ప్రశ్నకు ఈ వీడియోని జవాబు..
వీడియో వివరాల్లోకి వెళ్తే.. ఓ భారీ కింగ్ కోబ్రా జనావాసాల్లోకి సంచారం చేయడం గుర్తించి.. ఓ స్నేక్ క్యాచర్ కు సమాచారం అందిస్తారు. సమాచారం అందుకున్న స్నేక్ క్యాచర్ వెంటనే పాము సంచారం చేసిన ప్రదేశంలోకి చేరుకుంటాడు. ఇలా చేరుకున్న అతను పామును వెతుకుతూ ఉండగా.. ఓ ప్రదేశంలో పాము కనిపిస్తుంది. ఇలా కనిపించిన పామును ఆ స్నేహితుడు స్నేక్ క్యాచర్ ఎంతో చాకచక్యంగా పట్టుకుంటాడు. ఆ భారీ కింగ్ కోబ్రా తలను పట్టుకొని సంచారం చేసిన ప్రదేశం నుంచి రోడ్డుపైనకి లాక్కొని వస్తాడు.
ఆ పామును చూసి అక్కడ ఉన్న స్థానికులు తెగ భయాందోళనలు చెందుతారు. అంతేకాకుండా మరికొందరైతే అక్కడ నుంచి పరుగులు పెడతారు. ఆ పామును ఓ సంచిలో బంధించి ఓ సురక్షిత ప్రాంతానికి తరలిస్తారు. ఈ పాము దాదాపు 15కు అడుగులు ఉండొచ్చని స్నేక్ క్యాచర్ తెలిపారు. అంతేకాకుండా ఇది కాటేయడం వల్ల మనిషి అక్కడికక్కడే మరణించే అవకాశాలు కూడా ఉన్నాయని ఆయన అన్నారు.
ఇలాంటి పాములకు ఎంత దూరంగా ఉంటే అంత మంచిదని సూచించారు. ఈ వైరల్ అవుతున్న వీడియోను ఓ టీవీ ఇంగ్లీష్ అనే న్యూస్ ఛానల్ నుంచి పోస్ట్ చేశారు. ప్రస్తుతం ఈ వీడియోను చాలామంది వీక్షించినట్లు సమాచారం. పాములంటే ఆసక్తి గలవారు ఈ వీడియోను షేర్ కూడా చేస్తున్నారు. అంతేకాకుండా సోషల్ మీడియా వినియోగదారులు పాములు రక్షించే స్నేక్ క్యాచర్ ను అభినందిస్తున్నారు. మరికొందరైతే అడుగంటుకు పోతున్న జీవరాశులను రక్షించడానికి కృషి చేసే ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు అంటూ కామెంట్స్ కూడా పెడుతున్నారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి