Speeding Car Hits College Students: రోడ్డుపై ఘర్షణ పడటం ఎంత ప్రమాదకరమో.. రోడ్డుపై వాహనం నడిపేటప్పుడు అతివేగంగా కాకుండా, ముందు చూసుకుని డ్రైవింగ్ చేయడం కూడా అంతే ముఖ్యమని చెప్పే ఘటన ఇది. ఉత్తర్ ప్రదేశ్‌లోని ఘజియాబాద్‌లో చోటుచేసుకున్న ఈ రియల్ సీన్‌కి సంబంధించిన ఘటన ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. మసూరి ప్రాంతంలో కాలేజ్ స్టూడెంట్స్ మధ్య ఒక విషయంలో ఘర్షణ తలెత్తింది. ఒకరిపై మరొకరు దూషణలకు దిగుతూ, ఘర్షణ పడుతూ రోడ్డుపైకి చేరుకున్నారు. విద్యార్థులంతా పరస్పరం గొడవపడుతుండగానే ఒక కారు రయ్యుమంటూ అటువైపుగా దూసుకొచ్చింది. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

అప్పటికే కారు హై స్పీడ్ మీద ఉండటం.. ఊహించని విధంగా కారుకు విద్యార్థులు అడ్డు రావడంతో అనుకోని పరిణామానికి షాక్ అయిన కారు డ్రైవర్.. కారు వేగాన్ని అదుపు చేయలేకపోయాడు. అదే సమయంలో విద్యార్థులు సైతం ఊహించని పరిణామానికి ఒక్కసారిగా షాకయ్యారు. కీసుమని శబ్ధం చేసుకుంటూ తమవైపే ఒక కారు దూసుకురావడం గమనించిన విద్యార్థులు అక్కడి నుంచి చెల్లాచెదురై తప్పించుకునే ప్రయత్నం చేశారు. కానీ కారు వేగం ముందు వారి వేగం పనిచేయలేకపోయింది. దీంతో కారు ఇద్దరు విద్యార్థులను ఢీకొట్టింది. కారు ఢీకొట్టిన వేగానికి ఇద్దరు విద్యార్థులు గాల్లోకి చెంగున ఎగిరిపడ్డారు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.  



కారు ప్రమాదం ఘటనపై స్పందించిన ఘాజియాబాద్ పోలీసులు.. కారును సీజ్ చేశామని, ఈ ఘటనకు బాధ్యులైన వారిపై చట్టరీత్యా చర్యలు తీసుకుంటామని తెలిపారు. రోడ్డుపై న్యూసెన్స్ క్రియేట్ చేసిన నేరం కింద కొంతమంది కాలేజీ విద్యార్థులను సైతం పోలీసులు అదుపులోకి తీసుకున్నట్టుగా ఎన్డీటీవీ కథనం పేర్కొంది. 23 సెకన్ల నిడివి కలిగిన ఈ కారు ప్రమాదం వీడియో ప్రస్తుతం వైరల్ గా మారగా.. నెటిజెన్స్ ఆ వీడియో కింద రకరకాల కామెంట్స్ పోస్ట్ చేస్తున్నారు. ఈ ఘటనలో రోడ్డుపై తగవులాడిన విద్యార్థులదే తప్పని కొంతమంది కామెంట్ చేస్తే.. రోడ్డుపై వేగంగా కారు నడిపిన వ్యక్తిది కూడా తప్పేనని ఇంకొంత మంది కామెంట్స్ పోస్ట్ చేస్తున్నారు.


Also Read : King Cobra Nagamani Stone: నాగమణిని కాపాడుతున్న కింగ్ కోబ్రా.. కెమెరాలో చిక్కిన అరుదైన దృశ్యం! అస్సలు నమ్మలేరు


Also Read : Snake Nagamani Pearl: నాగుపాము తల నుంచి 2 నాగమణులను తీసిన వ్యక్తి.. వీడియో చూస్తే షాక్ అవ్వకుండా ఉండలేరు!



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


Android Link https://bit.ly/3P3R74U


Apple Link - https://apple.co/3loQYe 


Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి