వియాత్నాం నుంచి ఇస్తాంబుల్ వెళ్తూ.. ఢిల్లీ ఎయిర్‌పోర్టులో చిక్కుకున్నాడు
లాక్ డౌన్ ( Lockdown ) సమయంలో అంతకు ముందెప్పుడూ చూడని ఎన్నో ఆసక్తికరమైన వింతలు, విశేషాలు మన కంటపడ్డాయి. అందులో జర్మనీకి చెందిన ఎడ్గార్ జీబట్ లాక్ డౌన్ కహానీ కూడా ఒకటి. లాక్ డౌన్ తెచ్చిన తంటా అతడికి దాదాపు 2 నెలల పాటు సినిమా చూపించింది. వియాత్నాం రాజధాని హనోయి నుంచి ఇస్తాంబుల్ ( Hanoi to Istambul ) వెళ్తూ మార్గం మధ్యలో ఫ్లైట్ మారే క్రమంలో అనుకోకుండా ఇండియాలో చిక్కుకుపోయిన జీబట్‌కి మే 12వ తేదీ వరకు విమానాశ్రయమే ఇల్లుగా మారింది. అయితే, అంతకంటే ముందు ఏం జరిగిందో తెలియాలంటే ఈ స్టోరీ చదవాల్సిందే.
లాక్ డౌన్ ( Lockdown ) సమయంలో అంతకు ముందెప్పుడూ చూడని ఎన్నో ఆసక్తికరమైన వింతలు, విశేషాలు మన కంటపడ్డాయి. అందులో జర్మనీకి చెందిన ఎడ్గార్ జీబట్ లాక్ డౌన్ కహానీ కూడా ఒకటి. లాక్ డౌన్ తెచ్చిన తంటా అతడికి దాదాపు 2 నెలల పాటు సినిమా చూపించింది. వియాత్నాం రాజధాని హనోయి నుంచి ఇస్తాంబుల్ ( Hanoi to Istambul ) వెళ్తూ మార్గం మధ్యలో ఫ్లైట్ మారే క్రమంలో అనుకోకుండా ఇండియాలో చిక్కుకుపోయిన జీబట్‌కి మే 12వ తేదీ వరకు విమానాశ్రయమే ఇల్లుగా మారింది. అయితే, అంతకంటే ముందు ఏం జరిగిందో తెలియాలంటే ఈ స్టోరీ చదవాల్సిందే.
ఎడ్గర్ జిబట్ స్టోరీ చూస్తే.. 2004లో స్టీవెన్ స్పీల్బెర్గ్ డైరెక్షన్‌లో టాం హంక్స్ నటించిన `ది టెర్మినల్` అనే సినిమా గుర్తుకొస్తుంది. అప్పట్లో అందరినీ బాగా ఆకట్టుకున్న ఆ సినిమాలో స్టోరీ తరహాలోనే ఎడ్గార్డ్ జీబట్ అనే జర్మనీ పౌరుడు గత మార్చి 18న వియాత్నాం రాజధాని హానోయ్ నుంచి ఇస్తాంబుల్ వెళుతూ కనెక్టింగ్ ఫ్లైట్ కోసం న్యూఢిల్లీలోని ఇందిరా గాంధీ ఎయిర్ పోర్ట్‌లో దిగాడు. ఢిల్లీ నుంచి ఇస్తాంబుల్ వెళ్లే కనెక్టింగ్ ఫ్లైట్ కోసం ఎదురు చూస్తుండగా కోవిడ్-19 కారణాలతో టర్కీకి విమానాల రాకపోకలు రద్దయ్యాయనే ఎనౌన్స్‌మెంట్ వినబడింది. అలా టర్కీ వెళ్లే ఫ్లైట్ కోసం ఎదురు చూస్తుండగానే.. మరో 4 రోజుల్లోనే కోవిడ్-19 వ్యాప్తి నివారణ చర్యల్లో భాగంగా అన్ని విదేశీ ప్రయాణాలకు తెరదించుతూ ఇండియన్ గవర్నమెంట్ మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఇంకేముంది జీబట్ సహా మరో అయిదుగురు ఇందిరా గాంధీ విమానాశ్రయంలోనే ఇరుక్కుపోయారు. అయితే మిగిలిన వారు తమ తమ ఎంబసీలతో మాట్లాడుకుని వెళ్లిపోయారు. జీబట్‌ను జర్మనీ వెళ్లే ఫ్లైట్‌లో వెళ్లిపోవాల్సిందిగా అధికారులు సూచించినప్పటికీ.. జర్మనీలో అతడిపై కొన్ని క్రిమినల్ కేసులు పెండింగ్‌లో ఉండటంతో అక్కడికి వెళ్లేందుకు జీబట్ ఆసక్తిచూపలేదు. అలా జీబట్‌కు అప్పటి నుంచి ఎయిర్ పోర్టే ఇల్లయింది.
వాష్ రూంలలో స్నానాలు కానిస్తూ.. ట్రాన్సిట్‌లోని కుర్చీలు, నేలపై నడుం వాలుస్తూ.. మధ్యమధ్యలో ఫోన్‌లో బంధువులు, మిత్రులతో మాట్లాడుకుంటూ రోజులు గడిపేశాడు. భారత్ విసా లేకపోవడంతో విమానాశ్రయం దాటి బయటకు కూడా రాలేని పరిస్థితుల్లో చిక్కుకుపోయాడు. దీంతో పాపం పోనీ అనుకున్న ఎయిర్ పోర్ట్ అథారిటి వాళ్లే పెద్ద మనసు చేసుకుని అతడికి రోజూ మూడుపూటల భోజన సౌకర్యం అందించారు. ట్రాన్సిట్ ఏరియాలోనే ఉంటున్న జీబట్‌కి దోమల బెడద లేకుండా ఓ దోమ తెర కూడా ఇచ్చారు. అధికారులు, సిబ్బంది, నిత్యం ఆ ఒక్కడిని సీసీ టీవీల్లో ఓ కంట కనిపెడుతూ ఉండిపోయారు. ఈయన క్రైం రికార్డ్‌పై జర్మనీ మన దేశాన్ని ఏ విధమైన రిక్వెస్ట్ చేయలేదు కనుక మనకేం అతడు నేరస్థుడు కాడు.. కేవలం లాక్ డౌన్ బాధితుడు మాత్రమే.
అయితే, అలాగని ట్రాన్సిట్ పీరియడ్ దాటిన తర్వాత కూడా బయటి దేశస్తుడు మన దేశంలో ఉండటానికి రూల్స్ ఒప్పుకోవు కనుక ఇందిరా గాంధీ ఎయిర్ పోర్టు అథారిటి వాళ్లు జీబట్‌కి లీవ్ ఇండియా నోటీసు సర్వ్ చేశారు. అంటే... ఇండియా విడిచివెళ్లిపొమ్మని అర్థమన్న మాట. అదే సమయంలో ఢిల్లీ నుంచి ఆమ్‌స్టర్‌డ్యామ్‌కి కేఎల్ఎం ఎయిర్ లైన్స్‌కి చెందిన విమానం ఇండియాలో చిక్కుకున్న వారిని ఎవాక్యూయేట్ చేస్తుండటంతో జీబట్ ఆ విమానంలో ఆమ్‌స్టర్‌డ్యామ్ టికెట్ బుక్ చేసుకుని ఎంచక్కా ఫ్లైట్ ఎక్కేశాడు. అలా ఎప్పుడెప్పుడు ఫ్లైట్ ఎక్కుదామా అని ఎదురుచూసిన జీబట్‌కి మే 12వ తేదీ ఎన్నాళ్లో వేచిన ఉదయంలా వచ్చింది. జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here..