Snake Monkey: జాతుల మధ్య వైరం అనేది ఉండదు. బద్ద శత్రువులైనా ఆపత్కాలంలో కలిసిపోతాయి. ఈ విషయంలో మనుషుల కన్నా జంతువులు ముందుంటాయి. పరస్పరం విరుద్ధమైన జాతులు స్నేహంగా మసలుకుంటాయి. పాము- ముంగిస, పిల్లి-ఎలుక కలిసిపోయిన సంఘటనలు చాలా చూశాం. తాజాగా పాము కోతి కలిశాయి. కలవడమే కాదు ఎంచక్కా ఆడుకున్నాయి. పరమశివుడి మెడలో ఉన్నట్టు పాము కోతి మెడ చుట్టూ అల్లేసుకుంది.

COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Also Read: Viral Video: బార్‌లో పెద్దావిడ 'యానిమల్‌' స్టెప్పులు.. విజిల్స్‌, కెవ్వు కేకలతో అవ్వ వావ్వా


ఓ ఎడారి ప్రాంతంలో కోతికి చైన్‌ కట్టేసి ఉంది. ఆ కోతి వద్దకు చేరుకున్న పాము మెడపై ఎక్కింది. చుట్టూ అల్లుకునేసి పడగ విప్పింది. తన వద్దకు వచ్చిన పామును కోతి మెడపై వేసుకుంది. కింద పడుతుంటే రెండు సార్లు అలాగే వేసుకుంది. అనంతరం ముందుకు కదిలింది. కదులుతున్న సమయంలో పాము పడగ విప్పి బుసలు కొట్టింది. నాగుపాము మాదిరిగా కనిపించింది. ఇది అత్యంత విషం కలిగినదిగా తెలుస్తోంది. వీడియో తీస్తున్న వ్యక్తిపై దాడి చేయడానికి సిద్ధమైంది. దీంతో అతడు భయంతో వీడియో తీయడం ఆపేశాడు. సాధారణంగా అయితే పాము ఏ జంతువునైనా కాటేస్తుంది. పాముకాటుతో జంతవులు కూడా చాలానే చనిపోతున్నాయి. అయితే ఇక్కడ మాత్రం కోతికి హాని చేయకుండా మంచిగా ఆడుకోవడం గమనార్హం.

Also Read: Ice Cream Semen: ఛీ.. ఛీ.. నడిరోడ్డుపై 'ఆ పని' కానిచ్చేసి ఐస్‌క్రీమ్‌లో వీర్యం కలిపిన యువకుడు


ఈ వీడియో నెట్టింట్లో హల్‌చల్‌ చేస్తోంది. పాము, కోతి వీడియోను చూసి నెటిజన్లు నివ్వెరపోతున్నారు. పరస్పరం దాడి చేసుకోవాల్సిన జంతువులు ఇలా కలిసిపోవడం.. ఎంచక్కా ఆడుకోవడం కొత్తగా కనిపించింది. పామును చూసి కోతి ఏమాత్రం భయపడలేదు. ఏదో తాడుగా భావించి మెడలో వేసుకుని వెళ్లిపోతుంది. అయితే పాము పడగ విప్పి భయంకరంగా కనిపించింది. ఇది చూసిన నెటిజన్లు భయపడుతున్నారు.
 




స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి FacebookTwitter