Tamil Actor Hari Vairavan Death : తమిళ నటుడు హరి వైరవన్ గత రాత్రి తుది శ్వాస విడిచాడు. వెన్నిల కబడ్డీ జట్టు సినిమాలో అందరినీ నవ్వించిన వైరవన్ ఇక లేరు అనే వార్తను విని కోలీవుడ్ ప్రముఖులు సంతాపాన్ని వ్యక్తం చేస్తున్నారు. గత కొన్ని నెలలుగా చికిత్స పొందుతున్న నటుడు హరి వైరవన్ నిన్న రాత్రి 12 గంటలకు మృతి చెందినట్లు ఆయన కుటుంబ సభ్యులు తెలిపారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

మధురైకి చెందిన హరి వైరవన్ గత కొన్ని నెలలుగా అనారోగ్య కారణాలతో చికిత్స పొందుతున్నాడు. జీవనోపాధి కోల్పోయి కుటుంబంతో ఇబ్బందులు పడుతున్న ఆయనకు సినీ పరిశ్రమకు చెందిన పలువురు ఆర్థికంగా సాయం చేయడం గమనార్హం.


 



ఈ స్థితిలో గత కొన్ని వారాలుగా కోలుకుంటున్న హరి వైరవన్ హఠాన్మరణం చెందడం అందరినీ దిగ్భ్రాంతికి గురి చేసింది. ఈరోజు మధురైలో హరి వైరవన్ అంత్యక్రియలు జరగనున్నాయి. వైరవన్ మృతి పట్ల విష్ణు విశాల్ స్పందించాడు. వెన్నిల కబడ్డీ జట్టు సినిమా నాటి రోజులను గుర్తు చేసుకున్నాడు. ఆ సినిమా కోసం పని చేసినప్పుడు నీతో ఉన్న మెమోరీస్‌ ఎప్పటికీ చెరిగిపోవు అని ఎమోషనల్ అయ్యాడు. సారీ వైరవన్.. నీ ఆత్మకు శాంతి చేకూరాలి అని ట్వీట్ వేశాడు.


వెన్నెల కబడ్డీ జట్టు సినిమాను తెలుగులోకి భీమిలి కబడ్డీ జట్టు అని రీమేక్ చేసిన సంగతి తెలిసిందే. అక్కడ విష్ణు విశాల్ చేసిన పాత్రను ఇక్కడ నాని చేశాడు. వైరవాన్ పాత్రను చలాకీ చంటి, ధన్ రాజ్ పాత్రలకు దగ్గరగా ఉంటుంది.

Also Read : Rajamouli Oscar Award : రాజమౌళికి ఆస్కార్ అవార్డ్ ఫిక్స్.. ఇదిగో సాక్ష్యం.. నెట్టింట్లో వైరల్


Also Read : HIT 2 Main Villain : HIT 2 విలన్.. నెట్టింట్లో దారుణమైన ట్రోల్స్.. పరువుతీస్తోన్న నెటిజన్లు


 



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 


ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 


Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి