HIT 2 Main Villain : HIT 2 విలన్.. నెట్టింట్లో దారుణమైన ట్రోల్స్.. పరువుతీస్తోన్న నెటిజన్లు

HIT 2 Main Villain హిట్ సెకండ్ కేస్‌కు టాక్ బాగానే వచ్చింది. అంతా బాగానే ఉందని అంటున్నారు.. కానీ ఒక్క విషయంలో మాత్రం అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. సీరియల్ కిల్లర్‌ను చూస్తే భయానికి బదులు నవ్వు,ఆశ్చర్యం వస్తోందని జనాలు కామెంట్లు పెడుతున్నారు.

Written by - ZH Telugu Desk | Last Updated : Dec 3, 2022, 08:54 AM IST
  • హిట్ సెకండ్ కేస్‌కు హిట్ టాక్
  • థియేటర్లో దుమ్ములేపుతున్న అడివి శేష్
  • విలన్‌ ఎంట్రీ సీన్ మీద ట్రోల్స్
HIT 2 Main Villain : HIT 2 విలన్.. నెట్టింట్లో దారుణమైన ట్రోల్స్.. పరువుతీస్తోన్న నెటిజన్లు

HIT 2 Main Villain Trolls And Memes : అడివి శేష్ హీరోగా వచ్చిన హిట్ సెకండ్ కేస్ సినిమాకు మంచి టాక్ వచ్చింది. మొదటి రోజు మంచి కలెక్షన్లతో దూసుకుపోయినట్టుంది. రెండో రోజు కూడా ఈ సినిమాకు అంతటా హౌస్ ఫుల్ కలెక్షన్లతో రచ్చ చేసేట్టుగా ఉంది. అయితే ఈ సినిమా అంతా ఒకెత్తు అయితే.. విలన్ ఎంట్రీ సీన్‌, విలన్‌ను ఆడియెన్స్‌కు చూపించే సీన్ మాత్రం కాస్త వెరైటీగా అనిపిస్తుంది. మామూలుగా అయితే సైకో కిల్లర్‌ను చూస్తే అందరూ భయపడాలి.

కానీ ఇందులో మాత్రం భయం కాకుండా ఆశ్చర్యం వేస్తుంది. కొన్ని క్షణాలు నవ్వు కూడా వస్తుంది. కొత్తగా ఉంటుందని అలాంటి పాత్రను ఆ కారెక్టర్‌తో వేయించినట్టున్నాడు దర్శకుడు. అయితే కొత్తగానే అనిపించినా.. ఆ కారెక్టర్‌కు అతను మోయగలడా? లేదా? అన్నది మాత్రం మేకర్లు చూసుకోలేకపోయారు. దీంతో ఇప్పుడు జనాలు ఆ ఎంట్రీ సీన్ మీద ట్రోల్స్, మీమ్స్ చేస్తున్నారు. నెటిజన్లు వేస్తున్న ఈ కామెడీ వీడియోలు చూస్తే ఇంపాక్ట్ ఎలా ఉందో అర్థమవుతుంది.

 

హ్యాపి సినిమాలోని ఓ సీన్‌తో ఆడియెన్స్ రియాక్షన్ ఏంటో చెప్పేశారు. విలన్ ఎంట్రీ ఇచ్చాడేమో అని బన్నీ భయపడుతుంటాడు.. తీరా వెనక్కి చూస్తే.. బ్రహ్మానందం కనిపిస్తాడు.. వీడా? అంటూ ఆశ్చర్యపోతాడు బన్నీ. నేను ఇంక ఎవరో అనుకున్నాను అని అంటాడు. నేను     అయితే భయపడవా? అంటూ బ్రహ్మానందం అనే సీన్‌ను ఇప్పుడు నెటిజన్లు షేర్ చేస్తూ.. హిట్ సెకండ్ కేస్ విలన్‌ సీన్‌తో పోల్చుతున్నారు.

 

ఇక విలన్ ఫోటోను రివీల్ చేసే సీన్‌కు మరొక సినిమాలోని సీన్‌ను చేర్చి ట్రోల్ చేస్తున్నారు. చింతకాయల రవి సినిమాలో వెంకటేష్ ఫోటోకు బదులు సత్యం రాజేష్‌ ఫోటోను పంపుతారు. వాడి ఫోటో చూశావా? అంటూ అనుష్క చిరాగ్గా అనే సీన్‌ను ఇప్పుడు విలన్ ఎంట్రీ సీన్‌తో పోల్చుతున్నారు. మొత్తానికి హిట్ సెకండ్ కేస్ విలన్‌ను చూశాక ఆడియెన్స్ ఇలానే రియాక్ట్ అవుతున్నారని అర్థమవుతోంది.

Also Read : Suresh Babu-Samantha : సమంత మహానటి.. నాగ చైతన్య పెద్ద మామ సురేష్ బాబు కామెంట్స్

Also Read : Sai Dharam Tej Sweet Reply : ఎంతైనా మెగా హీరో కదా?.. ఒదిగి ఉండటం బ్లెడ్డులోనే ఉంటుందేమో.. నెటిజన్‌కు స్వీట్ రిప్లై

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 

Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

Trending News