Variety Wedding Card: కాస్త తెలివితేటలు, క్రియేటివిటీ ఉంటే ఏదైనా సాధ్యమే. ఎప్పుడూ వినూత్నంగా ఆలోచిస్తేనే పదిమంది దృష్టిలో పడతాం. ఆ వధూవరులు కూడా అదే చేశారు. రొటీన్‌కు భిన్నంగా వెడ్డింగ్ కార్డు డిజైన్ చేశారు..


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

పెళ్లనగానే ముందుగా గుర్తొచ్చేది, చేయాల్సింది వెడ్డింగ్ కార్డు పని. వెడ్డింగ్ కార్డు అనేది ఎవరి స్థోమతను బట్టి వాళ్లు డిజైన్ చేసుకుంటారు. కొన్ని సింపుల్‌గా ఉంటే మరికొన్ని రిచ్‌గా ఉంటాయి. అయితే క్రియేటివిటీ ఉంటే స్థోమతతో సంబంధం లేదు. రొటీన్‌కు భిన్నంగా ఆలోచించగలిగితే చాలు..అందరి దృష్టిలో కచ్చితంగా పడతాం. అందుకే ఈ వెడ్డింగ్ కార్డు ఇప్పుడు తెగ వైరల్ అవుతోంది. 


తమిళనాడులో వైద్యరంగంలో పనిచేసే ఎళిలరసన్..విల్లుపురంకు చెందిన వసంతకుమారిని సెప్టెంబర్ 5వ తేదీన పెళ్లి చేసుకోనున్నాడు. ఈ క్రమంలో రొటీన్‌కు భిన్నంగా ఆలోచించి వెడ్డింగ్ కార్డు డిజైన్ చేయించాడు. ట్యాబ్లెట్స్ స్ట్రిప్ రూపంలో. దూరం నుంచి లేదా ఫోటో చూస్తే ట్యాబ్లెట్స్ స్ట్రిప్ అనే అనుకుంటారు. చాలా చిన్నదే అయినా అందర్నీ ఆకట్టుకుంటోంది. క్రియేటివిటీ అంటే ఇదే మరి. అందుకే ఈ వెడ్డింగ్ కార్డు వైరల్ అవుతోంది. 


ట్యాబ్లెట్ స్ట్రిప్‌లో ఎక్స్‌పైరీ డేట్ వివరాలుండే చోట..పెళ్లి తేదీ, విందు సమయం, రిసెప్షన్ తేదీ వివరాల్ని పొందుపరిచారు. ఏ ఇంగ్రెడియెంట్స్ ఉన్నాయో తెలిపే చోట  వధూవరుల అర్హతలు, వివరాలున్నాయి. ఇక కాషన్ అని ఇచ్చే చోట..సర్వేపల్లి రాధాకృష్ణన్ టీచర్స్ డే, స్పెషల్ డే వంటి వివరాలున్నాయి. మ్యాన్యుఫ్యాక్చర్డ్ బై అనే చోట..చిరునామా వివరాలున్నాయి. అంతకంటే ముఖ్యంగా వధూవరుల పేర్లతో కలిపి..ఓ బ్రాండ్ నేమ్ కూడా ఎజిల్ వసంత సెప్ట్ 5 అని రూపొందించారు. 


Also read: Snake Video: కింగ్ కోబ్రాను అమాంతం మింగేసిన మరో భారీ స్నేక్.. ఆ స్నేక్ చూపుకే భయం పుట్టడం ఖాయం..



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook